Updates..
ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- ఆరు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు
- ఈనెల 28 వరకు కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ
- రిమాండ్‌ను తిరస్కరించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను రిజెక్ట్ చేసిన కోర్టు
జ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో ముగిగిన వాదనలు
- కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీ కోరిన ఈడీ
- సుధీర్ఘ వాదనలు వినిపించిన ఇరువర్గాల లాయర్లు
- తీర్పు రీజర్వ్ చేసిన జడ్జి
- అరెస్ట్ అవసరం ఏంటో చెప్పాలన్న కేజ్రీవాల్ లాయర్లు
- అరెస్ట్ అక్రమమని వాదన
- తనిఖీలకు కేజ్రీవాల్ సహకరించలేదన్న ఈడీ లాయర్లు
కోర్టులో కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు
- అప్రూవర్‌కు క్రెడిబిలిటీ లేదు
- సాక్షాలన్నీ ఉండగా, మళ్లీ కస్టడీ ఎందుకు?
- ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు అవసరం లేదుజ
- అధికారాన్ని ఈడీ దుర్వినియోగం చేస్తుంది.
- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా లిక్కర్ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవు.
- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆధీనంలో ఎలాంటి మెటీరియల్ లేకుండానే, కేజ్రీవాల్‌ను అక్రమంగా, ఏకపక్షంగా అరెస్టు చేసింది.
- కేజ్రీవాల్ రిమాండ్‌ను రొటీన్‌గా చూడవద్దు.
ఈడీ అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- ఈడీ కోర్టుకు తీసుకెళ్తుండగా మీడియా అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందన.
- నా జీవితం దేశం కోసం అంకితం
- జైలు గోడల మద్య ఉన్నా.. దేశ సేవ చేస్తూనే ఉంటాను
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కింగ్ పిన్- ఈడీ
- కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన ఈడీ
- కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీ కోరిన ఈడీ
- కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించనున్న అభిషేక్ మనుసంఘ్వి
- 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందు ఉంచిన ఈడీ
- కేజ్రీవాల్ పాత్రపై కేజ్రీవాల్ పాత్రపై కోర్టుకు వివరించిన ఈడీ
- కేజ్రీవాల్ పాత్రపై కవిత నుంచి వాంగ్మాలం తీసుకున్నాం..ఈడీ
- ఇది వంద కోట్ల స్కాం కాదు.. రూ. 600 కోట్ల కుంభకోణం.
- 45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారు.
- నాలుగు రూట్ల ద్వారా పంపారు.
- ఢిల్లీ నుంచి గోవాకు వయా ఢిల్లీ ద్వారా డబ్బులు పంపారు.
- విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలు సేకరించాం.
- మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.
- ఆప్, సౌత్ గ్రూప్ తరపున విజయ్ నాయర్ వారధిగా ఉన్నారు.
28 పేజీల రిమాండ్ రిపోర్టు
- స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ
- 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేసిన ఈడీ
- 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ
- ఈడీ తరఫున విచారణకు హాజరైన జోహెబ్ హుస్సేన్, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు
- కేజ్రీవాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి
- రాత్రి గం. 9.05కు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశాం: రాజు
- 24 గంటల లోపే కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టాం. మాకు 10 రోజుల కస్టడీకి అప్పగించండి: రాజు
- ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్‌ను అరెస్టు చేశాం: రాజు
- అరెస్టుపై ఆయన బంధువులకు సమాచారం అందించాం: రాజు
- రిమాండ్ అప్లికేషన్ కాపీని ఆయనకు అందజేశాం. అరెస్టు కారణాలను తెలిపే డాక్యుమెంట్లు కూడా ఇచ్చాం: రాజు
లిక్కర్ కేసు: ఢిల్లీ కోర్టులో సీఎం కేజ్రీవాల్
- ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- పదిరోజుల కస్టడీ కోరనున్న ఈడీ
- కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి ,రమేష్ గుప్తా, విక్రమ్ చౌదరి వాదనలు
- ఈడీ తరఫున వాదనలు వినిపించనున్న న్యాయవాది జోయబ్ హుస్సేన్
కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ
- ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- కోర్టులో హాజరు పర్చిన ఈడీ
- పదిరోజుల కస్టడీ కోరే అవకాశం
- లిక్కర్ స్కామ్ కేసులో నిన్న రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే సంచలన కామెంట్స్..
- కేజ్రీవాల్ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ అయ్యారు
- నాతో కలిసి పనిచేసి లిక్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు తయారు చేశారు.
- తన సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసింది
- అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను.
- కేజ్రీవాల్ పరిస్థితి చూసి బాధగా అనిపించడం లేదు
- కేజ్రీవాల్ నా మాట వినలేదు
- అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా నాతో ఉన్నపుడు దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పాను.
- కొత్త మద్యం పాలసీ విషయమై కేజ్రీవాల్‌కు రెండు సార్లు లేఖలు రాశాను.
- కానీ, ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
- ఇప్పుడు నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను.
- అతను నా మాట వినలేదు.
- కేజ్రీవాల్ పరిస్థితిని చూసి నేను బాధపడటం లేదు.
- చట్టం తనపని తాను చేస్తుంది.
పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్..
- సుప్రీంకోర్టులో తన అత్యవసర పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్
- రౌస్ ఎవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో అత్యవసర పిటిషన్ ఉపసంహరణ
- రిమాండ్ పిటిషన్‌తో క్లాష్ కాకుండా ఉండేందుకే నిర్ణయం
కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం: కూనంనేని సాంబశివరావు
- సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం.
- మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
- మోదీ ఓ నియంత.
- బాండ్ల రూపంలో బీజేపీ రూ.వేల కోట్లు కొల్లగొట్టింది.
- బాండ్ల రూపంలో వచ్చిన అక్రమ సొమ్ముపై చర్చలేవి?.
- బీజేపీని కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతోంది.
- కాంగ్రెస్‌ను ఎంపీ సీట్లు అడుగుతున్నాం.
- కలిసేవచ్చే వారిని కూడా కాంగ్రెస్ కలుపుకుపోవడం లేదు.
- బీజేపీకి 400 సీట్లు దాటితే తెలంగాణలో కాంగ్రెస్‌ను బతకనివ్వరు.
ఢిల్లీ ఆప్ నేతల నిరసనలు..
- కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ మంత్రులు, కార్యకర్తల నిరసనలు
- ఆప్ మంత్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈరోజు మధ్యాహ్నం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరుచనున్న ఈడీ
- సీఎం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలో పూర్తి.
- ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు.
కాసేపట్లో కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ..
- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
- నిన్న రాత్రి ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
- కేసును అత్యవసరంగా విచారించాలని మెన్షన్ చేసిన కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వీ
- రెగ్యులర్ కేసుల విచారణ తర్వాత స్పెషల్ బెంచ్ ఈ కేసును విచారిస్తుందన్న జస్టిస్ సంజీవ్ కన్నా
- మధ్యాహ్నం తర్వాత కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ
దేశ రాజధానిలో హైఅలర్ట్
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌తో దేశ రాజధానిలో హైఅలర్ట్
- కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు ఇచ్చిన ఆప్
- ఆప్ కార్యకర్తల ఆందోళనలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు
- ఢిల్లీ వ్యాప్తంగా భారీగా మోహరించిన పోలీసులు
- ఈ ఉదయం మరోసారి కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు
- మధ్యాహ్నాం కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ
బీజేపీపై ఢిల్లీ మంత్రి అతిషి ఫైర్
- రాజకీయ కుట్రతోనే కేజ్రీవాల్ అరెస్ట్ అంటున్న ఢిల్లీ మంత్రి అతిషి
- ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాకే ఆప్ జాతీయ కన్వీనర్‌ను అరెస్ట్ చేశారు
- లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయొద్దనే అరెస్ట్ చేశారు
- సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని నమ్ముతున్నాం
కాసేపట్లో కేజ్రీవాల్ ఇంటికి రాహుల్
- కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్న రాహుల్ గాంధీ
- లిక్కర్ స్కామ్ కేసులో నిన్న రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
చివరి దశకు చేరుకున్న లిక్కర్ స్కాం కేసు
- లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
- గురువారం సాయంత్రం ఇంట్లోనే ఆయన్ని విచారించి అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
- నేడు మధ్యాహ్నాం 12 గం. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టనున్న ఈడీ
- కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి కోరనున్నట్లు సమాచారం
- కస్టడీ తీసుకున్నాక కల్వకుంట్ల కవిత, ఇతర నిందితులతో కలిపి విచారించే అవకాశం
►దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసింది.
►కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించిన ఆప్ నేతలు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో ఆప్ పిటిషన్. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు.
#WATCH | Delhi minister and AAP leader Atishi says, "We have put an application in the Supreme Court against the illegal arrest of Delhi CM Arvind Kejriwal. It will be mentioned in the Supreme Court tomorrow morning. We hope that the Supreme Court will protect democracy..." pic.twitter.com/hjhbEe9geF
— ANI (@ANI) March 21, 2024
►కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేరళలో నిరసనలు. ఎర్నాకులంలో ఆప్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతూ రోడ్ల మీదకు వచ్చారు.
#WATCH | Kerala: Aam Aadmi Party workers held a protest in Ernakulam against the Enforcement Directorate after the ED team arrested Delhi CM and AAP national convenor Arvind Kejriwal in the Excice Policy Case. (21.03)
— ANI (@ANI) March 21, 2024
(Source: AAP) pic.twitter.com/TVNItTKhjL
►కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించిన రాహుల్ గాంధీ. నేడు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలుపనున్న రాహుల్ గాంధీ
►నేడు కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ. ఈ క్రమంలో కస్టడీకి ఇవ్వాలని కోరనున్న ఈడీ అధికారులు.
►మరోవైపు, ఆరో రోజుకు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ. ఈడీ ఆఫీసులో వేరు వేరు లాకప్‌లలో ఉన్న కవిత, కేజ్రీవాల్ కస్టడీ తర్వాత కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారించనున్న ఈడీ.
►ఈ కేసులో అరెస్టు చేయకుండా కేజ్రీవాల్‌కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 9.11 గంటలకు ఆయనను అరెస్టు చేశారు. రాత్రి 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
►కేజ్రీవాల్‌కు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకొని, విచారణ జరపాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కేజ్రీవాల్ అరెస్టు సమాచారాన్ని ఆయన భార్యకు తెలియజేశారు.
►ఢిల్లీ లిక్కర్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్టు కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవితను గతవారం ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
లిక్కర్ కేసులో ప్రకంపనలు.. సమీర్ మహేంద్రుతో మొదలై కవిత, కేజ్రీవాల్ దాకా..
►కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ప్రతిపక్ష నేతలను మోదీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆక్షేపించారు.
►మరోవైపు, లిక్కర్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని, దర్యాప్తునకు సహరించాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
జైలు నుంచే పరిపాలన!
►కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియన్ నేత అతీషి ప్రకటించారు. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, అందుకే లోక్‌సభ ఎన్నికల ముందు అక్రమంగా జైలుకు పంపించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం వెనుక పెద్ద కుతంత్రం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా విమర్శించారు.
అరెస్టయిన మొట్టమొదటి సిట్టింగ్ సీఎం
బదేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్టయిన మొట్టమొదటి సిట్టింగ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావడం గమనార్హం. గతంలో బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం పదవిలో ఉండగానే అరెస్టయ్యారు. కానీ, దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు.
ఏమిటీ కుంభకోణం?
► ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో నూతన మద్యం విధానాన్ని(పాలసీ) ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. లిక్కర్ రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేట్ లైసెన్స్‌దారులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ప్రకటించింది.
► కొత్త పాలసీ కింద మద్యం దుకాణాలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్స్‌దారులు అపరిమితమైన డిస్కౌంట్ ప్రకటించవచ్చు. వినియోదారులకు ఆకర్శణీయమైన ఆఫర్లు ఇవ్వొచ్చు. లిక్కర్ హోం డెలివరీ కూడా చేయ్యొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవే. కొత్త పాలసీ వల్ల లిక్కర్‌పై ఆదాయం 27 శాతం పెరిగిందని, రూ.8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
► కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని, ఢిల్లీకి లిక్కర్ సంస్కృతిని తీసుకొచ్చారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
► కొత్త మద్యం విధానంలో చాలా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ప్రైవేట్ లైసెన్స్‌దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేస్తూ 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ ఒక నివేదిక విడుదల చేశారు. కోవిడ్–19 వ్యాప్తి సమయంలో ప్రైవేట్ వ్యాపారులకు ప్రభుత్వం రూ.144 కోట్ల మేర లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు.
► చీఫ్ సెక్రెటరీ నివేదికపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరపాలంటూ సిఫార్సు చేశారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టిపారేశారు. తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 400 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి.
► లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మేరకు లిక్కర్ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంతోపాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, ఈ సోదాల్లో సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని మనీష్ సిసోడియా చెప్పారు. తమ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
► ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. మనీష్ సిసోడియాతోపాటు మరో 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది.
► అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని “సౌత్ గ్రూప్’కు లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూప్‌కు పెద్ద ఎత్తున లైసెన్స్‌లు దక్కినట్లు తేల్చింది.
►తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్లు తెలియజేసింది. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం ద్వారా సౌత్ గ్రూప్ ఈ రూ.100 కోట్లు తిరిగి రాబట్టుకున్నట్లు పేర్కొంది. నూతన లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ తేల్చిచెప్పింది.
►ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ పిళ్‌లై, సమీర్ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. వీరిలో అరుణ్ పిళ్‌లై, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు పి.శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారించింది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టమే!
►అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురు దెబ్బేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ నష్టం తప్పదని అంటు న్నారు. ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌లో కాంగ్రెస్ తో ఆ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పంజాబ్‌లో ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించి, దేశమంతటా పార్టీని విస్తరింపజేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరు ణంలో కేజ్రీవాల్ అరెస్టు కావడం ఆప్ శ్రేణులను నిరాశకు గురిచేసింది.
►నిజానికి ఆప్‌లో కేజ్రీవాల్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. ఒకవేళ ఆయన ఈడీ కస్టడీకి గానీ, జైలుకు గానీ పరిమితమైతే పార్టీని ముందుకు నడిపించే బలమైన నాయకులెవరూ లేరు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ లాంటి సీనియర్లు ఇప్పటికే అరెస్టయ్యారు. కేజ్రీవాల్ లేకపోతే ఇంకెవరు? అనే ప్రశ్న ఆమ్ ఆద్మీ పార్టీలో ఏనాడూ తలెత్తలేదు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం బీజేపీకి మేలు చేయకపోగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. 12 ఏళ్ల క్రితం పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ భవితవ్యం ఏమిటన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment