Tihar Central Jail
-
తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పాటు మాజీ మంత్రి హరీష్‌రావులు ములాఖత్ అయ్యారు. అరగంట పాటు సాగిన ములాఖత్‌లో ధైర్యంగా ఉండాలని.. కేసు విషయంపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో తదుపరి కార్యచరణకు సిద్ధం కాగా.. అన్నీ అంశాలపై ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయంపై హరీష్ రావు, కేటీఆర్.. కవితతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కవిత బెయిల్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదలతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించగా.. న్యాయవాదుల సలహా మేరకు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
-
కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ.. తీహార్ జైలు ప్రస్తావన..
సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్.. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, సుఖేష్ మంగళవారం ఉదయం కవితకు లేఖ రాశారు. ఈ లేఖలో..‘తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను’ అని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్’ ఫైర్ మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఏడు రోజుల కస్టడీలో భాగంగా నేడు మూడో రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు.. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. 👉: సుఖేష్ లేఖ ఇదే.. -
నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో జైలు నెంబర్ 3లో ఈరోజు ఉదయం 5:30 గంటలకు వారిని ఉరితీశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి మైనర్ అని తేలింది. దీంతో అతనికి జువైనల్ యాక్ట్ కింద జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిసింది. (చదవండి: నిర్భయ దోషులకు ఉరి అమలుపై మోదీ) ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామానికి చెందిన సదరు మైనర్‌కు బస్సు ఓనర్ రామ్ సింగ్.. క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. 11 ఏళ్లకే ఇళ్లు వదిలి వచ్చిన ఆ మైనర్‌ను రామ్ సింగ్ చేరదీశాడు. నిర్భయ ఘటన సమయంలో మైనర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. రేప్ కేసులో దోషిగా తేలిన మైనర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. అయితే, అతన్ని ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ అతని ముఖాన్ని కప్పిఉంచడం వల్ల ఆ మైనర్‌ను ఎవరూ గుర్తుపట్టలేరు. అతని ఆనవాళ్లు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతను ఓ వంటవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. అతనిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
రెండు గంటల్లో ఉరి.. ఆగని ప్రయత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఏడేళ్లుగా నలుగుతున్న నిర్భయ కేసులో బాధితురాలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీశారు. అయితే, మరణ దండన నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి శిక్ష అమలుకు రెండు గంటల ముందు వరకు దోషుల ప్రయత్నాలు ఆగలేదు. ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వారు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటిషన్‌ను శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు సుప్రీం కోర్టు కొట్టివేసింది. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) కాగా, దోషులు పిటిషన్లమీద పిటిషన్లు వేయడంతో డెత్ వారెంట్లు జారీ అయ్యాక మూడు సార్లు ఉరి అమలు నిలిచిపోయింది. 2020, జనవరి 22 న దోషులను ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌజ్‌కోర్టు తొలుత డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషుల వరుస పిటిషన్లతో ఉరి అమలు సాధ్యం కాలేదు. అనంతరం ఫిబ్రవరి 1, తర్వాత మార్చి 3న ఉరితీయాలని డెత్ వారెంట్లు జారి అయినప్పటికీ శిక్ష అమలు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న (నాలుగోసారి) ఉరితీయాలని జారీ అయిన డెత్ వారెంట్ల ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది. (చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ) ఏడేళ్ల నిర్భయ కేసు పరిణామాలు.. 2012, డిసెంబర్ 16న అర్థరాత్రి నిర్భయపై సామూహిక అత్యాచారం కదులుతున్న బస్సులో అత్యాచారం చేసిన ఆరుగురు దోషులు నిర్భయను అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం చేసిన దోషులు నిర్భయతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేసిన ఆరుగురు దోషులు తీవ్రగాయాలైనా ఇద్దరిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్సపొందుతూ 2012, డిసెంబర్ 29న నిర్భయ మృతి 2013, జనవరి 2న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు 2013, జనవరి 3న ఛార్జ్‌షీట్ దాఖలు 2013, మార్చి 11న తీహార్ జైల్లో రామ్‌సింగ్ ఆత్మహత్య 2013, మార్చి 21న నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం 2013, ఆగస్టు 31న మైనర్ దోషికి మూడేళ్ల రిఫార్మ్ హోం శిక్ష 2013, సెప్టెంబర్ 13న నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు 2014, మార్చి 13న ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు 2015, డిసెంబర్ 20న రిఫార్మ్ హోం నుంచి మైనర్ విడుదల 2017, మే 5న ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు 2020, జనవరి 7న ఉరిశిక్ష అమలుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం 2020, ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు ఉరిశిక్షను నిలిపేయాలంటూ కోర్టులో దోషుల పిటిషన్లు ఎట్టకేలకు 2020, మార్చి 20న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు -
ఆ జైలంటే ఖైదీలకు ఎంతిష్టమో...
సాక్షి, న్యూఢిల్లీ: భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ... జైలు లైఫే సో బెటరు.. అని పాడుకుంటున్నారు అక్కడి ఖైదీలు. సహజంగా జైలు నుంచి ఎప్పుడు బయటపడి తమ వారిని చూసుకోవాలా అని పరితపిస్తారు ఖైదీలు...కానీ ఆ జైలు మాత్రం వారిని ఏ మాత్రం అభద్రతకు లోనుచేయడం లేదు. బయట సమాజం కంటే ఖైదీలు జైలు జీవితాన్నే ఎంజాయ్ చేస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందిన తీహార్ జైలు ఖైదీలకు మెరుగైన ఆవాస కేంద్రంగా మారింది. తీహార్ జైలులో 15,000 మందికి పైగా ఉంటే వీరిలో 80 శాతం వరకూ విచారణ ఖైదీలు కాగా, వీరిలో 25 శాతం మంది తరచూ నేరాలు చేస్తూ జైలు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. బయటి సమాజంలో ఖర్చులను తట్టుకోలేక వీరు జైలు జీవితానికే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. వీరంతా 35 సంవత్సరాల వయసు పైబడి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన వారే. జైలు జీవితమే వీరికి సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఒక్కో ఖైదీది ఒక్కో అనుభవం. రెహమాన్ (పేరు మార్చాం..) అనే ఖైదీ తన 21 ఏళ్ల వయసులో కేవలం తనతో వాదించిన కారణంగా ఓ వ్యక్తిని ఆవేశంతో హతమర్చాడు. దీంతో శిక్షకు గురై తీహార్ జైలుకు వచ్చి ఐదేళ్లు గడిపాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై వివాహం చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చాడు.18 నెలలు జైలు వెలుపల గడిపిన రెహమాన్ జైలు జీవితం మిస్సవడంతో కలత చెందాడు. ఎలాగైనా మళ్లీ తీహార్ జైలుకు రావాలని గొలుసు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డాడు. అయినా పోలీసులకు పట్టుబడక పోవడంతో ఢిల్లీ వర్సిటీ విద్యార్థినిపై వేధింపులకు దిగి తిన్నగా తీహార్ జైలుకే వచ్చాడు. నేరగాళ్ల జాబితాలో అతని పేరు పునరావృతం కావడంతో మళ్లీ నేరానికి ఎందుకు పాల్పడ్డాడో వివరించడంతో జైలు అధికారులు కంగుతిన్నారు. 18 నెలలు జైల్లో ఉన్న తర్వాత అతడిని భార్య విడిపించుకుని వెళ్లింది. మళ్లీ కొన్నాళ్లకే ఏదో నేరం చేసి తీహార్ జైలుకు వచ్చేశాడు. ఈసారి కొద్దిగా ఒళ్లు చేసిన రెహమాన్ జైలు పరిసరాలు పూర్తిగా అలవాటు కావడంతో తోటి ఖైదీల పట్ల దాదాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వెళ్లడంపైనే దృష్టిసారించేవాడు. రెహమాన్ కూతరు పెద్దగైంది. ఒళ్లు వంచడం ఇష్టం లేక, డబ్బుల్లేక భార్యను పుట్టింటికి వెళ్లాలని బలవంతపెట్టేవాడు. ఈ క్రమంలో గత ఏడాది ఢిల్లీలో ఓ దోపిడీకి పాల్పడే క్రమంలో రెహమాన్ ఓ వ్యక్తిని హత్య చేశాడు. దీంతో మళ్లీ తీహార్ జైలు బాట పట్డాడు. పదేపదే నేరాలు ఎందుకు చేస్తున్నావని జైలు అధికారులు గద్దించడంతో అసలు విషయం బయటపెట్టాడు. తనకు ఆదాయ మార్గం లేకపోవడంతో బయట జీవితాన్ని నెగ్గుకురాలేకపోతున్నానని, జైలులో అన్నీ సమయానుకూలంగా లభ్యమవుతున్నాయని, ఆరోగ్యం బాగాలేకుంటే వైద్య సేవలు అందుతున్నాయని తనకు జైలు జీవితమే బాగుందని చెప్పాడు.ఇక్కడ తాను క్రమశిక్షణగా ఉంటున్నానని, జైలు ప్రాంగణంలోనే కార్పెంటరీ పనులు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నానని అధికారులకు వివరించాడు. రెహమాన్ లాంటి ఖైదీలు తీహార్ జైలులో అడుగడుగునా కనిపిస్తారు. జైలు జీవితం గడిపి విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలనే ఖైదీల ధోరణి ఎత్తిచూపుతోంది. ఖైదీల్లో మానసిక పరివర్తన దిశగా ప్రభుత్వాలు చొరవ చూపడంతో పాటు వారికి పునరావస ప్యాకేజ్ కల్పించాల్సిన అవసరాన్నీ తీహార్ ఖైదీల ఉదంతం ప్రతిబింబిస్తోంది. -
నిడో తానియా కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా హత్య కేసులో నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద మోపిన అభియోగాలను ఉపసంహరించాలంటూ దిగువకోర్టు ఇచ్చిన సవాలుచేస్తూ మృతుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం శుక్రవారం సీబీఐకి ఓ నోటీసు జారీచేసింది. హతుడి తండ్రి, అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యుడు నిడో పవిత్ర ఈ పిటిషన్‌ను దాఖలుచేసిన సంగతి విదితమే. దీనిని పరిశీలించిన జస్టిస్ మన్మోహన్సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం... ఏప్రిల్ 22వ తేదీలోగా ఇందుకు స్పందించాలంటూ సీబీఐ, తీహార్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్లతోపాటు నలుగురు నిందితులను ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫర్మాన్... తీహార్ కేంద్ర కారాగారంలో ఉండడంతో సూపరింటెండెంట్‌కు కూడా నోటీసు జారీచేసింది. ఫర్మాన్‌కు బెయిల్ మంజూరు కాలేదు. కాగా దక్షిణ ఢిల్లీలోని లజ్పత్నగర్లోగల ఓ దుకాణదారుడికి, నిడోతానియా మధ్య ఘర్షణ జరిగింది. నిందితులు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన నిడో తానియా మరణించాడు. ఈ ఘటనపై జాతీయ రాజధానిలో నివసిస్తున్న ఈశాన్య ప్రాంతవాసులనుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. యువకుడిని కాపాడడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ కేసును విచారించిన స్థానిక న్యాయస్థానం నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మోపిన అభియోగాలను ఉపసంహరిస్తూ గత ఏడాది సెప్టెంబర్, 25వ తేదీన తీర్పు వెలువరించింది. జాతివివక్ష కేసని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తీర్పు సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. నిడో తానియా ఏ కులానికి చెందినవాడనే విషయం నిందితులకు తెలియదని పేర్కొంది. -
'బయటపడే మార్గం మీ చేతుల్లోనే ఉంది'
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరికొన్ని రోజుల పాటు తీహార్ జైలులో గడపనున్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సెబీకి చెల్లించాల్సిన డబ్బు ఇచ్చేందుకు ముందుకొస్తే బెయిల్ ఇచ్చే అంశాన్ని మళ్లీ పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. 'మీరు బయటపడే మార్గం మీ చేతుల్లోనే ఉంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. తనను జైలుపాలు చేయడం తగదంటూ బుధవారం సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టు ఎదుట హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తద్వారా విచారణలో కొత్త అంకానికి తెరలేపారు. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విషయంలో హెబియస్ కార్పస్ రిట్ పరిధి అంశాలు ఇమిడి ఉన్నాయని విన్నవించారు. మార్చి 4న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ, రాయ్‌ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.24,000 కోట్లు సమీకరించాయన్నది కేసులో ప్రధానాంశం. ఈ నిధులు పునఃచెల్లింపుల్లో విఫలం కావడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహారాపై ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం సుప్రీం ఆదేశాల ప్రకారం సహారా చీఫ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. 3 రోజుల్లో రూ.2,500 కోట్లు చెల్లించడానికి సిద్ధమని సహారా గ్రూప్ చేసిన ప్రతిపాదనను బెంచ్ తిరస్కరించింది. -
తీహార్ జైలు కిక్కిరిసింది...ఖాళీ లేదు!
దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నతీహార్ సెంట్రల్ జైలులో నో వేకెన్సీ బోర్డు పెట్టే రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తున్నాయి. జైలులో ఉండాల్సిన ఖైదీల కంటే రెండింతలు ఎక్కువై పూర్తిగా నిండిపోయిందని అధికారులు ఓ నివేదిక సమర్పించారు. వాస్తవానికి జైలులో ఉంచాల్సిన ఖైదీల సంఖ్య 6250 మాత్రమే. అయితే ఆ సంఖ్యకు మించి ప్రస్తుతం 13 వేల మంది ఖైదీలు తీహార్ జైల్లో కుక్కినట్టు సమాచారం. ఇటీవల అందించిన నివేదిక ప్రకారం తీహార్ జైలులో ప్రస్తుతం 13552 ఖైదీలున్నట్టు జైలు అధికారుల తెలిపారు. మొత్తం ఖైదీలలో 12937 మంది మగ ఖైదీలు కాగా, 615 మంది మహిళా ఖైదీలు ఉన్నట్టు వార్షిక సమీక్ష నివేదికలో వెల్లడించారు. ఇందులో 10154 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 3388 శిక్ష ఖారారైన వారు, 366 విదేశీ ఖైదీలున్నారని డీజీపీ విమ్లా మెహ్రా తెలిపారు.