సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పాటు మాజీ మంత్రి హరీష్‌రావులు ములాఖత్ అయ్యారు. అరగంట పాటు సాగిన ములాఖత్‌లో ధైర్యంగా ఉండాలని.. కేసు విషయంపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో తదుపరి కార్యచరణకు సిద్ధం కాగా.. అన్నీ అంశాలపై ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయంపై హరీష్ రావు, కేటీఆర్.. కవితతో చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కవిత బెయిల్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప‍్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదలతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించగా.. న్యాయవాదుల సలహా మేరకు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment