తీహార్ జైలు కిక్కిరిసింది...ఖాళీ లేదు!
Published Thu, Feb 27 2014 6:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నతీహార్ సెంట్రల్ జైలులో నో వేకెన్సీ బోర్డు పెట్టే రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తున్నాయి. జైలులో ఉండాల్సిన ఖైదీల కంటే రెండింతలు ఎక్కువై పూర్తిగా నిండిపోయిందని అధికారులు ఓ నివేదిక సమర్పించారు. వాస్తవానికి జైలులో ఉంచాల్సిన ఖైదీల సంఖ్య 6250 మాత్రమే. అయితే ఆ సంఖ్యకు మించి ప్రస్తుతం 13 వేల మంది ఖైదీలు తీహార్ జైల్లో కుక్కినట్టు సమాచారం.
ఇటీవల అందించిన నివేదిక ప్రకారం తీహార్ జైలులో ప్రస్తుతం 13552 ఖైదీలున్నట్టు జైలు అధికారుల తెలిపారు. మొత్తం ఖైదీలలో 12937 మంది మగ ఖైదీలు కాగా, 615 మంది మహిళా ఖైదీలు ఉన్నట్టు వార్షిక సమీక్ష నివేదికలో వెల్లడించారు. ఇందులో 10154 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 3388 శిక్ష ఖారారైన వారు, 366 విదేశీ ఖైదీలున్నారని డీజీపీ విమ్లా మెహ్రా తెలిపారు.
Advertisement