దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. జూలై 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
ఇదిలావుండగా.. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. తొలుత ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు.
అనంతరం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment