సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తాను చేసిన ఆరోపణలన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని, తగ్గేదేలే.. అని సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసుకు స్పందిస్తూ.. తనని ఫ్రాడ్ అని సంబోధించినందుకు తాను కూడా పరువునష్టం దావా వేస్తానని, కోర్టులో కలుద్దామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలు అనిపించినప్పుడు మంత్రి కేటీఆర్ ధైర్యంగా సీబీఐ విచారణను స్వాగతించాలని సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సీబీఐ విచారణ చేస్తే తాను చెప్పిన చాట్‌లు, రికార్డింగ్‌లు నిజమా? నకిలీవా అనే విషయం తేలుతుందని తెలిపారు. సుఖేశ్ ఆరోప ణలపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం విధితమే. దీనికి మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్న సుఖేశ్ స్పందిస్తూ ఓ లేఖ రాశారు. దీనిని గురువారం తన న్యాయవాది ద్వారా విడుదల చేశారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసును స్వాగతిస్తున్నట్లుతెలిపారు. తన ఫిర్యాదులు ఉపసంహరించుకొనేది లేదని తేల్చి చెప్పా రు. నిజం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందన్నారు. సీబీఐకి తాను చేసిన ఫిర్యాదులు అన్నీ అసత్యాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారని, మరి సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
సీబీఐ విచారణ జరిగితే నిజం బయట పడుతుందన్నారు. తానేవరో కేటీఆర్‌కు తెలియనప్పుడు సీబీఐ విచారణ స్వాగతించే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. తనని ఫ్రాడ్ అంటున్నారని.. కేటీఆర్, కవిత వారి పనుల కోసం ఉపయోగించుకున్నప్పుడు ఈ విషయం తెలియదా అని నిలదీశారు. కేటీఆర్ తనని ఆ విధంగా సంబోధించడం బాధాకరమని పేర్కొన్నారు. తన కేసుల గురించి వ్యాఖ్యానించే ముందు కేటీఆర్ పార్టీలోని సహచరులు డజన్ల కొద్దీ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనను క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరారని, తానెందుకు క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో సుఖేశ్ ప్రశ్నించారు. కేటీఆర్ అహంకారాన్ని తన వద్దే ఉంచుకోవాలని, తనపై పనిచేయదని అన్నారు. ఏ విషయాన్నీ వ్యక్తిగతంగా తీసుకోవద్దని, కేటీఆర్ అంటే తనకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని సుఖేశ్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్?
Comments
Please login to add a commentAdd a comment