మహబూబ్నగర్: పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. షాద్‌నగర్‌లోని రాఘవేంద్రకాలనీలో ఇంటిలో నిద్రిస్తున్న వీఆర్వో రవియాదవ్(35)పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి.
బాలా నగర్ మండలం రాజాపూర్ వీఆర్వోగా రవియాదవ్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కల కారణాలు తెలియాల్సి ఉంది.