వీఆర్వోపై చేయిచేసుకున్న జేసీ
Published Sat, Jul 29 2017 2:26 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
మహబూబ్‌నగర్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఓ వీఆర్వోపై జాయింట్ కలెక్టర్ చేయి చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది. ధర్మాపూర్ గ్రామ సదస్సులో పాల్గొన్న జేసీ శివకుమార్ గ్రామానికి భూ వివరాలు చెప్పాలని స్థానిక వీఆర్వో మహమూద్ పాషాను అడిగారు. దీనికి వీఆర్వో సరైన సమాధానం చెప్పకపోవడంతో కోపోద్రిక్తుడైన జేసీ గ్రామసభలోనే వీఆర్వోపై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Advertisement
Advertisement