డ్రైవర్‌ను కొట్టి.. రూ. 4 కోట్ల సిగరేట్లు దోపిడీ | Thugs theft four crore value singrates in pedda amberpet | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ను కొట్టి.. రూ. 4 కోట్ల సిగరేట్లు దోపిడీ

Published Sun, Aug 20 2017 1:25 PM | Last Updated on Tue, Sep 12 2017 12:36 AM

Thugs theft four crore value singrates in pedda amberpet

హైదరాబాద్‌: నగర శివారులో బారీ దోపిడీ జరిగింది. రూ. 4 కోట్ల విలువైన సిగరెట్లతో వెళ్తున్న కంటైనర్ను కొందరు దుండగులు  అడ్డుకున్నారు. డ్రైవర్‌ను చితకబాది తమతో పాటు తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను నింపుకొని పరారయ్యారు. వివరాలీవి.. ముషీరాబాద్‌ నుంచి తిరుపతికి సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను పెద్ద అంబర్‌పేట్‌ వద్దకు రాగానే దుండగులు రెండు సుమోలతో అడ్డగించారు.
 
మల్కాపూర్‌ శివారులో డ్రైవర్‌ను కిందకు దించి ఓ సుమోలో ఎక్కించుకొని వెళ్లి అడవిలో వదిలేసి వచ్చారు. అనంతరం తమతో తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను లోడ్ చేసుకుని పరారయ్యారు. ఈ దోపిడీలో సుమారు 20 మంది దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ చొట్టుప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement