‘ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది’ | Legislator to be arrested for the support of Thugs | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది’

Published Sat, Apr 1 2017 7:46 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

Legislator to be arrested for the support of  Thugs

హన్మకొండ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌ గ్రామంలో దళిత యువకుని మర్మాంగాలు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ దుండగులను, వారికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పుట్టమధును వెంటనే అరెస్ట్‌ చేయాలని అంబేద్కర్, దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్‌ ఎదురుగా ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితరత్న బొమ్మల కట్టయ్య, మంద కుమార్‌మాదిగ లు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని వారు ఆరోపించారు.

దళిత యువకున్ని దారుణంగా హత్య చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని వారు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. హత్యలో పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్త్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీబీఎఫ్‌ నేత చుంచు రాజేందర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement