ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.
ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment