
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) భారీ షాక్ ఇచ్చింది. చిరిగిన, పాడైన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం గుర్తించడంతో ఈ బ్యాంక్‌కు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.
చిరిగిన నోట్లలో నకిలీవి
దీంతోపాటు చిరిగిన, పాడైన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ .. బ్యాంక్ ఆఫ్ బరోడాకు అదనంగా మరో రూ.2,750 ఫైన్ వేసింది. బీవోబీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానాలు ఆర్బీఐ విధించింది. క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ పెనాల్టీలను విధించినట్లు తెలుస్తోంది.
కాగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ గత నెలలో కూడా పెద్ద మొత్తంలో పెనాల్టీ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు గతంలో బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment