ఐఎఫ్సీఐ రుణ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ఫైనాన్స్ సంస్థ- ఐఎఫ్‌సీఐ మూడు నెలల కాలానికి సంబంధించి రుణ రేటును సోమవారం 80 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుత 9.30% నుంచి 8.50%కి తగ్గినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచే తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందనీ వివరించింది. బ్యాంకులకు తానిచ్చే (ఆర్‌బీఐ) స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవల ఆర్‌బీఐ పావుశాతం (6.25%కి) తగ్గిం చింది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు, ఫైనా న్స్ సంస్థలు తమ రుణ రేట్లను తగ్గిస్తున్నాయి.