IFCI
-
ఆర్థిక నేరగాడు మోహుల్ చోక్సీపై మరో కేసు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ 13,000 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో విదేశాల్లో ఉన్న ఆర్థిక నేరగాడు మోహుల్ చోక్సీపై మరో కేసు నమోదు చేసింది సీబీఐ. ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మెహుల్ చోక్సీ, ఐఎఫ్‌సీఐల మధ్య 2014 నుంచి 2016 వరకు జరిగిన లావాదేవీల్లో చోటు చేసుకున్న మోసాలపై తాజా కేసు నమోదు అయ్యింది, మోహుల్ చోక్సీకి సంబంధించి గీతాంజలి జెమ్‌కి లాంగ్‌టర్మ్ క్యాపిటర్ రుణం కావాలంటూ 2016లో మోహుల్ చోక్సీ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత దశల వారీగా ఐఎఫ్సీఐ నుంచి రూ. 25 కోట్ల రుణం పొందాడు. ఐఎఫ్ఐసీ నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో మోహుల్ చోక్సీ చెల్లించలేదు. ఆ తర్వాత జరిగిన లావాదేవీల్లో మోహుల్ చోక్సీ కొన్ని షేర్లను బదలాయించగా వాటి ద్వారా కేవలం రూ.4.07 కోట్లు మాత్రమే రికవరీ జరిగింది. ఉద్దేశ పూర్వకంగానే తమను తప్పు దారి పట్టించి నిధులు కాజేశారంటూ ఐఎఫ్సీఐ సీబీఐ తలుపు తట్టింది. మోహుల్ చోక్సీ వ్యవహారంలో ఐఎఫ్సీఐ ఖజానకు రూ.22 కోట్ల మేర కన్నం పడింది. చదవండి: వాహనదారులకు భారీ షాక్..ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష! -
అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్.. స్టార్లప్‌లకు కొత్త వరం
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల విభాగంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చేందుకు ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్ పేరుతో త్వరలో తొలి దశను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ ఎస్.తోమర్ పేర్కొన్నారు. తద్వారా బిజినెస్ ఐడియాలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్లు తెలియజేశారు. ఐఎఫ్సీఐ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థే ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సంస్థ ప్రస్తుతం ఐదు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో రెండింటిని సామాజికంగా వెనుకబాటు, వెనుకబడిన కులాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు మద్దతిచ్చేందుకు వినియోగిస్తోంది. 2020లో తొలుత షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు)కు చెందిన 1,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మిషన్‌ను ప్రారంభించింది. తద్వారా అంబేడ్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ మిషన్ పేరుతో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఎస్సీల కోసం ఫండ్‌ను ఏర్పాటు చేసిననట్లు ఈ సందర్భంగా తోమర్ తెలియజేశారు. చదవండి: నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా -
ఐఎఫ్సీఐ నిబంధనల ఉల్లంఘన
♦ సగం పైగా రుణాల్లో రూల్స్ అతిక్రమణ ♦ కాగ్ నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఐఎఫ్సీఐ దాదాపు 50 శాతం పైగా రుణాల మంజూరీ విషయంలో నిబంధనలను పాటించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. చట్టాలను ఉల్లంఘిస్తూ పలు కంపెనీలకు ఐఎఫ్సీఐ భారీ స్థాయిలో రుణాలిచ్చిందని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. భూషణ్ స్టీల్‌కు రుణాలివ్వడంలో సంస్థలకు నీళ్లొదిలిందని తెలిపింది. ఇందుకు భూషణ్ స్టీల్ తదితర సంస్థలకి రుణాలివ్వడమే నిదర్శనమని పేర్కొంది. రుణభారం పెరిగిపోవడంతో పాటు 2014–15, 2015–16లో భారీ నష్టాలూ చవిచూడటం వల్ల ఆ సంస్థకి ఇచ్చిన రూ. 403 కోట్ల రుణాల రికవరీ సందేహాస్పదమేనని తెలిపింది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా నిబంధనలకు విరుద్ధంగా రూ. 500 కోట్లు ఐఎఫ్సీఐ మంజూరు చేసిందని పేర్కొంది. అలాగే మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ, పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ కంపెనీ, పిపావవ్ మెరీన్ అండ్ ఆఫ్షోర్కి రుణాలివ్వడంలోనూ ఐఎఫ్సీఐ నిబంధనలను తుంగలో తొక్కిందని వివరించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ముద్రపడిన ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉన్న 3 సంస్థలకు కూడా ఐఎఫ్సీఐ రుణాలిచ్చిందని ఆక్షేపించింది. ఆరు టెల్కోలు రూ. 61వేల కోట్ల ఆదాయాన్ని చూపించలేదు .. గడిచిన అయిదేళ్లుగా ఆరు టెలికం కంపెనీలు రూ. 61,000 కోట్ల పైగా ఆదాయాలను వెల్లడించకుండా తొక్కిపెట్టి ఉంచాయని కాగ్ వ్యాఖ్యానించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 7,700 కోట్ల మేర గండిపడిందని పేర్కొంది. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, సిస్టెమా శ్యామ్ ఇందులో ఉన్నాయి. కాగ్ లెక్కల ప్రకారం 2010–11 నుంచి 2014–15 మధ్య కాలంలో ప్రభుత్వానికి ఎయిర్టెల్ రూ. 2,602 కోట్ల మేర లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్‌యూసీ) బకాయిపడింది. వడ్డీ కింద మరో రూ. 1,246 కోట్లు కట్టాల్సి ఉంది. ఇక వొడాఫోన్ రూ. 1,179 కోట్ల వడ్డీతో సహా రూ. 3,332 కోట్లు, ఐడియా రూ. 1,136 కోట్లు (రూ. 658 కోట్ల వడ్డీ కలిపి), రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 1,911 కోట్లు (రూ. 839 కోట్ల వడ్డీ), ఎయిర్‌సెల్ రూ. 1,227 కోట్లు, సిస్టెమా శ్యామ్ రూ. 117 కోట్లు కట్టాల్సి ఉంటుందని కాగ్ పేర్కొంది. కమీషన్లు, డిస్కౌంట్లు మొదలైన వాటిని ఖాతాల్లో సర్దుబాటు చేసేయడం ద్వారా టెల్కోలు తమ వాస్తవ ఆదాయాలను తొక్కి పెట్టి ఉంచాయని వివరించింది. -
ఐఎఫ్సీఐ రుణ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ఫైనాన్స్ సంస్థ- ఐఎఫ్సీఐ మూడు నెలల కాలానికి సంబంధించి రుణ రేటును సోమవారం 80 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుత 9.30% నుంచి 8.50%కి తగ్గినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచే తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందనీ వివరించింది. బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవల ఆర్బీఐ పావుశాతం (6.25%కి) తగ్గిం చింది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు, ఫైనా న్స్ సంస్థలు తమ రుణ రేట్లను తగ్గిస్తున్నాయి.