UAE-Based Financier Has Filed a Complaint Against 83 Makers for Alleged Cheating - Sakshi
Sakshi News home page

Kapil Dev Biopic 83: చిక్కుల్లో కపిల్‌దేవ్‌ బయోపిక్‌, నిర్మాతలపై చీటింగ్‌ కేసు

Published Fri, Dec 10 2021 2:29 PM | Last Updated on Fri, Dec 10 2021 4:04 PM

Cheating Case Filed On Kapil Dev Biopic 83 Movie Makers In Mumbai Court - Sakshi

Ranveer Singh and Deepika Padukone's Film 83 in Legal Trouble: టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ ముంబై కోర్టును ఆశ్రయించారు. 

చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్‌ రవి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపికా పదుకొనె, కబీర్‌ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్‌ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్‌ కూడా విడుదల కాదా దీనికి విశేష స్పందన వచ్చింది.

చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి

1983 నాటి ప్రపంచ కప్‌ నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌.. కపిల్‌ దేవ్‌ పాత్ర పోషిస్తుండగా ఆయన భార్య రూమీ భాటియాగా దీపికా కనిపించబోతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‏గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement