![Ranveer Singh 83 Movie Release On June 4 - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/21/83.jpg.webp?itok=dh9Md-pF)
1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకోన్, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్‌వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
ఈ సందర్భంగా కబీర్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘1983లో భారతదేశం క్రికెట్ ప్రపంచంలో రారాజుగా అవతరించింది. కపిల్ దేవ్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజయంతో చాలామందికి క్రికెట్ ఫేవరేట్ గేమ్‌గా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ‘83’ పేరుతో వెండితెరపై ఆవిష్కరిస్తున్నాం. 1983 వరల్డ్ కప్‌కు సంబంధించి నా దగ్గర ఉన్న వంద కథల్లో 25 కథలను ఆధారంగా చేసుకుని ‘83’ సినిమాను తెరకెక్కించాను. కేవలం ఆటగాళ్ల కోణంలోనే కాక కామెంటేటర్స్, ప్రేక్షకుల కోణంలోనూ సినిమా సాగుతుంది’’ అన్నారు.
చదవండి :
భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక
Comments
Please login to add a commentAdd a comment