ఇది సిక్సర్‌కు మించినది.. సెలబ్రిటీల ప్రశంసల జల్లు | Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation | Sakshi
Sakshi News home page

83 Movie Trailer Out: '83' ట్రైలర్‌ విడుదల.. సెలబ్రిటీల ప్రశంసలు

Published Tue, Nov 30 2021 1:11 PM | Last Updated on Tue, Nov 30 2021 6:04 PM

Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation - Sakshi

Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation: క్రికెట్ ప్రియులకు ఆ ఆట అన్నా, ఆటపై వచ్చే సినిమాలన్న పిచ్చి ఇష్టం. వాటిపై సినిమాలు వస్తే ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచినంతగా ఆనందపడతారు. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఎంఎస్‌. ధోనీ చిత్రానికి ఎంత హిట్‌ ఇచ్చారో తెలిసిందే. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ, క్రికెట్ అభిమానుల కోసం తెరకెక్కిందే '83' చిత‍్రం. ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. గత క్రిస్‌మస్‌ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనాతో ఆలస్యం అయింది. అశేష అభిమానుల ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ట‍్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

రణ్‌వీర్ సింగ్‌ క్రికెట్‌ దిగ్గజం, ఇండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌గా కనిపించిన 3 నిమిషాల 49 సెకన్ల ట్రైలర్‌ను అభిమానులే కాకుండా బాలీవుడ్‌ ప్రముఖులు సైతం తెగ ఇష్టపడుతున్నారు. ఈ ట్రైలర్‌ను రణ్‌వీర్‌ సింగ్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌లో  'అసాధ‍్యాన‍్ని సుసాధ్యం చేసిన ఇంక్రెడబుల్‌ ట్రూ స్టోరీ #83 ట్రైలర్‌ హిందీ భాషలో వచ‍్చేసింది. డిసెంబర్‌ 24, 2021న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' రాస్తూ షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ షేక్‌హ్యాండ్‌ ఎమోజీతో వ్యాఖ్యానిస్తే, 'వాట్‌ ఏ వావ్... ఇది సిక్సర్‌ని మించినది. మీరు చేయలేనిది అంటూ ఏముంది రణ్‌వీర్‌ సింగ్‌. గూస్‌బంప్స్‌ తెప‍్పించింది. ఇది కచ్చితంగా డబుల్‌ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది.' అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కామెంట్‌ చేసింది. ఇషా డియోల్‌ 'ఔట్‌ స్టాండింగ్‌. రణ్‌వీర్  సింగ్‌ నిన్ను చూసి గర్వపడుతున్నాను.' అని తెలిపింది. 


ఈ చిత్రంలో కపిల్ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌  సింగ్‌, అతని భార్య పాత్రలో దీపికా నటించారు. అలాగే తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవా, సాకిబ్‌ సలీమ్‌, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్‌, దిన్‌కర్‌ శర్మ, నిశాంత్‌ దహియా, హార్డీ సంధు, సాహిల్‌ ఖట్టర్‌, అమ్మీ విర్క్‌, ఆదినాథ్‌ కూడా యాక్ట్ చేశారు. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్‌, విష‍్ణువర్ధన్‌ ఇందూరి, సాజిద్‌ నదియడ్వాలా, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కబీర్‌ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 24న థియేటర్లలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement