
Ranveer Singh 83 Movie Teaser Out:1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్‌వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్
ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా 83 టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. 1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్‌ను వదిలారు.
చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ..
ఈ టిజర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. స్టేడియంలో చివరి బంతిని కపిల్ క్యాచ్ పడుతున్న సీన్‌తో ఈ టీజర్ ముగిసింది. ఈ సిన్నివేశంలో చూస్తుంటే క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రాకతప్పదు అనేలా టీజర్‌ను ఆసక్తిగా మలిచారు మేకర్స్. కాగా ఈ మూవీలో కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ నటిస్తుండగా.. ఆయన భార్య రొమి భాటియా పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
చదవండి: బిగ్‌బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో
Comments
Please login to add a commentAdd a comment