సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులమయం చేసి రాష్ట్రాన్ని రుణ సంస్థలకు తాకట్టు పెట్టారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి రుణ వ్యవధి ని ఏకంగా 40 ఏళ్లకు పెం చారని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మో సం చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు, నిధులు వచ్చాయని, ఆయన కుటుం బానికి పదవులు వచ్చాయే తప్ప నిరుద్యోగులకు కొలువులు రాలేదన్నారు. ఈసీతో కలిసి టీఆర్‌ఎస్ కుట్ర: ఎన్నికలు వస్తే చాలు.. ప్రతిపక్షాలు పోటీకి సంసిద్ధం కాకుండా కుట్ర చేయడం సీఎం కేసీఆర్‌కు మామూలైపోయిందని లక్ష్మణ్ విమర్శించారు.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో కుట్ర చేశారని ఇప్పు డు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంథా అవలంబిస్తున్నారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి టీఆర్‌ఎస్ పన్నాగం పన్నుతోందని, అందుకే తుది ఓటరు జాబితా రూపొందించకుండా, రిజర్వేషన్లను ఖరారు చేయకుండానే షెడ్యూలు విడుదల చేశారన్నారు. కొన్ని వార్డుల్లో ఎస్సీ ఓటర్ల జాబితాను బీసీ లు, ఓసీలుగా మార్చివేయడంతో ఎస్సీలకు రిజ ర్వ్ కావాల్సిన వార్డులు ఇప్పుడు ఓసీలపరం కానున్నాయని చెప్పారు. ఇదంతా ఎన్నికల సంఘం, టీఆర్‌ఎస్ కలిసి నడిపిన అతిపెద్ద కుట్ర అన్నారు. కాగా, శనివారం లక్ష్మణ్ సమక్షంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నేత భాస్కర్ నాయక్‌తో పాటు నాగార్జునసాగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment