k lakshman
-
‘హిమాచల్ పరిస్థితే తెలంగాణలో రావొచ్చు’: కే లక్ష్మణ్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులే.. త్వరలో తెలంగాణలోనూ కనిపించవచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార, ప్రధాన ప్రతిపక్షంపై మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. అధికార కాంగ్రెస్‌పై సొంత ఎమ్మెల్యేలే తిరగబడ్డారు. అసహనంతోనే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితే తెలంగాణలోనూ రావొచ్చు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి పరిస్థితి దారుణంగా మారుతుంది. అని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తా ఇక లోక్‌సభ ఎన్నికల కోసం గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతున్నట్లు తెలిపారాయన. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. వాళ్లు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. దురుసు మాటలు ఆపి హామీల సంగతి ఆలోచించాలన్నారాయన. ఇక.. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా అది దూరం అయ్యే సరికి బీఆర్ఎస్ సైతం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని అన్నారాయన. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు మాతో టచ్‌లో ఉన్నారు. అయితే.. మేం ఆచితూచి వ్యవహరిస్తాం అని అన్నారాయన. ఇక.. ఎన్నికల ముందు పథకాలు అందరికీ అని చెప్పి, ఇప్పుడేమో కండిషన్లు అప్లై అని కాంగ్రెస్ అంటోందని.. ప్రజలను మోసం చేసేందుకే గ్యారెంటీలు ఇచ్చిందని విమర్శించారాయన. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే కానీ గ్యారంటీలు అమలు కావంటూ చురకలంటించారు. బీజేపీ సంకల్ప యాత్రలను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తుందని.. అయినా ఈ యాత్రలు జగన్నాథ రథ చక్రాలుగా కదులుతూనే ఉంటాయని బీజేపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ తోడు దొంగలుగా బిజెపిపై అరోపణలు చేస్తున్నాయి. కేటీఆర్, హరీష్‌రావులకు దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటులో అయినా పోటీ చేసి గెలవాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. -
బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఐలమ్మ 126 జయంతి కార్యమ్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ కార్తీకరెడ్డిలతో పాటు పలువురు పార్టీ పదాధికారులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు కరోనా
సాక్షి, జహీరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాంచంద్రారెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు గీతారెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీజేపీ నేత కె.లక్ష్మణ్‌కు కరోనా ముషీరాబాద్(హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా జాతీ య అ«ధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గు, బాడీ పెయిన్స్ తదితర లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ సూచించారు. విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్లో లక్ష్మణ్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఐదుగురు కార్పొరేటర్లు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘హైదరాబాద్‌ని నాశనం పట్టించారు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. వరద బాధితులకు నిధులు మంజూరు చేసిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధమన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి సముద్రం లేదన్న కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. నగర రోడ్లు బాగుపడే వరకు టీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదు. విశ్వనగరాన్ని మురికి నగరంగా మార్చారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు.. వర్రియింగ్ ప్రెసిడెంట్. తండ్రి కొడుకులిద్దరూ కలిసి దోచుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో మిలాఖత్ అయ్యి హైదరాబాద్‌ని నాశనం పట్టించారు. తెలంగాణ రాష్ట్రన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటున్నది. వివిధ రంగాల్లోక నిధులు కేటాయించింది. వరద బాధితులకు కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది’ అని తెలిపారు. (చదవండి: జనంలో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువ) ‘వర్షాలు పడి అన్ని కోల్పోయిన వారిని కనీసం పట్టించుకోని.. పరామర్శించని ఏకైకా ముఖ్యమంత్రి కేసీఆర్. అకాల వర్షాలు పడితే ఫామ్ హౌస్‌లో పడుకున్నావు. కేసీఆర్ అంటే ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి. మజ్లీస్ పార్టీ వరద సహాయ నిధులలో అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీకి బుద్ధి చెప్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే.. మీ ఇంట్లో మాత్రం అందరికి ఉద్యగాలు ఇచ్చావ్. పరీక్షలో ఫెయిల్ అయిన కవితకు ఉద్యోగం కల్పించావ్. ప్రస్తుతం నీ మనవడు హిమాన్ష్ మాత్రమే ఖాళీగా ఉన్నాడు’ అంటూ లక్ష్మణ్ తీవ్రంగా మండి పడ్డారు. -
నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతల స్వీకరణ అనంతరం తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గం(పదాధికారులు)లో తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, పురందేశ్వరిలకు కీలక పదవులు దక్కాయి. తెలంగాణ మాజీ మంత్రి డి.కె.అరుణకు కీలకమైన జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. ఏపీ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నేతలుగా ఉన్న రాంమాధవ్, పి.మురళీధర్‌రావుల స్థానంలో కొత్త వారికి చోటు లభించింది. ఇక, జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉండగా.. ఆయన స్థానంలో ఎంపీ అనిల్ బెలూనీకి చోటు కల్పించారు. మొత్తం 23 మంది అధికార ప్రతినిధుల్లో..దక్షిణాది నుంచి అధికార ప్రతినిధులుగా రాజీవ్ చంద్రశేఖర్, టామ్ వడక్కన్‌లు ఇద్దరికే చోటు దక్కింది. 12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, ఒక ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సహా మొత్తం 70 మంది ఉన్న ఈ నూతన కార్యవర్గానికి తోడు కార్యవర్గ సభ్యులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కర్ణాటకకు చెందిన బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్యకు పూనమ్ మహాజన్ స్థానంలో బీజేపీ యువ మోర్చా అధ్యక్ష పదవి దక్కడం విశేషం. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి కొద్దికాలమే అయినప్పటికీ డీకే అరు ణకు, ము కుల్ రాయ్(పశ్చిమబెంగాల్)కు ఉపాధ్యక్ష పదవులు దక్కడం విశేషం. ఉపాధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, వసుంధర రాజే, ముకుల్‌రాయ్æ తదితరులు ఎంపికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా భూపేందర్ యాదవ్, కైలాష్ విజయ్‌వర్గీయ, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా బి.ఎల్.సంతోష్ ఎంపికయ్యారు. పురందేశ్వరి.. సామాజిక సమీకరణలే కీలకం.. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా.. మరో బలమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి దగ్గుబాటు పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేయడం సామాజిక సమీకరణాల సమతుల్యం చేయడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గం అండగా ఉన్న టీడీపీ క్రమంగా బలహీనపడుతున్న తరుణంలో ఏపీలో బలోపేతమయ్యే దిశగా ఈ సమతుల్యం అవసరమని విశ్లేషిస్తున్నాయి. పురందేశ్వరికి యూపీఏ ప్రభుత్వంలో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈ కీలక పదవి దక్కడంలో దోహదపడింది. డీకే అరుణ.. రెడ్డి సామాజిక వర్గంపై గురి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్ ఉండగా.. ఇక్కడ మరో బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉంది. టీఆర్ఎస్ వ్యూహాలతో బలహీనపడిన కాంగ్రెస్ నుంచి ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే దిశగా డీకే అరుణకు జాతీయస్థాయిలో కీలకమైన ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అరుణకు కలిసొచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్లో చోటు దక్కనుందా? బిహార్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాంమాధవ్‌కు చోటు దక్కవచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప నుంచి స్పష్టమైన హామీ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రుణసంస్థలకు రాష్ట్రం తాకట్టు
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులమయం చేసి రాష్ట్రాన్ని రుణ సంస్థలకు తాకట్టు పెట్టారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి రుణ వ్యవధి ని ఏకంగా 40 ఏళ్లకు పెం చారని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మో సం చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు, నిధులు వచ్చాయని, ఆయన కుటుం బానికి పదవులు వచ్చాయే తప్ప నిరుద్యోగులకు కొలువులు రాలేదన్నారు. ఈసీతో కలిసి టీఆర్ఎస్ కుట్ర: ఎన్నికలు వస్తే చాలు.. ప్రతిపక్షాలు పోటీకి సంసిద్ధం కాకుండా కుట్ర చేయడం సీఎం కేసీఆర్‌కు మామూలైపోయిందని లక్ష్మణ్ విమర్శించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో కుట్ర చేశారని ఇప్పు డు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంథా అవలంబిస్తున్నారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి టీఆర్ఎస్ పన్నాగం పన్నుతోందని, అందుకే తుది ఓటరు జాబితా రూపొందించకుండా, రిజర్వేషన్లను ఖరారు చేయకుండానే షెడ్యూలు విడుదల చేశారన్నారు. కొన్ని వార్డుల్లో ఎస్సీ ఓటర్ల జాబితాను బీసీ లు, ఓసీలుగా మార్చివేయడంతో ఎస్సీలకు రిజ ర్వ్ కావాల్సిన వార్డులు ఇప్పుడు ఓసీలపరం కానున్నాయని చెప్పారు. ఇదంతా ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ కలిసి నడిపిన అతిపెద్ద కుట్ర అన్నారు. కాగా, శనివారం లక్ష్మణ్ సమక్షంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నేత భాస్కర్ నాయక్‌తో పాటు నాగార్జునసాగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. -
కేసీఆర్, అసద్‌లది ప్రజాస్వామ్యంపై దాడి: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నది బీజేపీపై యుద్ధభేరి కాదని దేశ ప్రజాస్వామ్యంపై దాడి అని, దీనిని భారత సమాజం తిప్పికొడుతుందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు సీఎంకు ఓవైసీ తెలపగా, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని సీఎం కోరడం దురదృష్టకరమన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్ జన వరి 30న హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’అన్న నినా దంతో సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని, సీఎం స్థాయి వ్యక్తి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ందుకు ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. -
నెలాఖరులో బీజేపీ సదస్సులు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకు ఈ నెలాఖరులో చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ మత రాజకీయాలకు పాల్పడుతున్న ఆ రెండు పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో మేధావులు, విద్యావంతులతో పెద్దఎత్తున సదస్సులు నిర్వహిస్తామని, వాటిల్లో పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో స్థిరపడిన పొరుగు రాష్ట్ర ప్రజలపై విషం చిమ్మిన కేసీఆర్ ఇప్పుడు పాక్ ముస్లింలకు వకాల్తా పుచ్చుకొని మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం విడ్డూరం గా ఉందన్నారు. -
రాహుల్ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో మోదీ ప్రభుత్వ నిజాయతీ మరోసారి నిరూపితమైందని వెల్లడించారు. ప్రధాని మోదీపై ఆరోపణలు చేసినందుకుగానూ రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ శనివారం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ ఆరోపణలను ప్రజలు నమ్మలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టినా ఆ పారీ్టకి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనమండలి పక్షనేత ఎన్.రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: తమతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని, అడ్డదారిలో అధికారంలోకి రావాలని తాము అనుకోవడం లేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం అమలు చేస్తున్న పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన విషయంపై స్వయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుస్తానని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, కొత్త అధ్యక్షుడు ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని లక్ష్మణ్ చెప్పారు -
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడు
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్‌లు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ చేయడం కాదు.. ప్రజలే కేసీఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. హుజూర్నగర్ ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదన్నారు. టీఆర్ఎస్ మెడలు వంచే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కార్మికుల జీతాలు ఆపిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు ఆపాడా అని ప్రశ్నించారు. సమ్మెను బూచిగా చూపి.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మంత్రులు సమ్మె గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ వారికి అండగా ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
బీజేపీలోకి వీరేందర్ గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం సాయంత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలోపార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ అధికార ప్రతినిధి సుధంషు త్రివేది వీరేందర్ గౌడ్‌కు కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. వీరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వీరేందర్ గౌడ్ సోదరుడు విజయేందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ చేరికను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ అధికార దురి్వనియోగానికి పాల్పడు తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, మాజీ ఎంపీ వివేక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొంతమంది గాంధీ పేరు పెట్టుకొని.. ఆయన ఆశయాలను గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. గాంధీ పేరు తగిలించున్నంత మాత్రాన వారంతా ఆయన వారసులు కాలేరని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను తాము ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి లక్ష్మణ్, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి జనవరి 30 వరకు గాంధీజీ 150వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఎంపీలు గాంధీ సంకల్ప్యాత్ర చేపట్టారని తెలిపారు. మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలోనూ ఒక కమిటీ ఏర్పాటు చేసి జయంతి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. మోదీని జాతిపిత అని ట్రంప్ చేసిన వాఖ్యలపై కొంతమంది రాద్దాంతం, రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. మోదీ ఒక తండ్రిలా వ్యవహరిస్తున్నారని, ఆ ఉద్దేశంతోనే మోదీని ట్రంప్ దేశానికి తండ్రిలాంటి వారు అని అన్నారన్నారు. గాం«దీజీ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారని, మోదీ కూడా పరిశుభ్రతకు పెద్దపీట వేశారన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు సుధా పద్మినీ చారిటబుల్ ఫౌండేషన్ గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. -
‘శంకరమ్మ మమ్మల్ని సంప్రదించలేదు’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఉప ఎన్నికతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ టికెట్ ఆశించే బీజేపీ ఆశావాహులు 8మంది ఉన్నారన్నారు. రామ్మోహన్ రావు, జైపాల్ రెడ్డి, రామకృష్ణ , శ్రీలత రవీంద్ర నాయక్‌లు వంటి పలువురు టికెట్ ఆశిస్తున్నారని తెలిపారు. స్క్రీనింగ్ చేసి జాతీయ అధ్యక్షుడికి పంపుతామన్నారు. అంతేకాక శంకరమ్మ బీజేపీ నుంచి పోటీ చేస్తారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం అన్నారు. ఇంతవరకు ఆమె మమ్మల్ని కలవలేదు.. తాము కూడా ఆమెను సంప్రదించలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని ఉద్యోగ సంఘాలు ఎందుకు అన్న కేసీఆర్ తన ఇంట్లో ఇన్ని పదవులు ఎందుకు అని అనుకోవచ్చు కదా అన్నారు. ఇన్ని రోజుల సచివాలయ భవనాలు కూలుస్తా అన్న కేసీఆర్ తాజాగా హై కోర్టును మారుస్తా అంటూ కొత్త పాట పాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్‌వి ధన రాజకీయాలని.. తమకు మాత్రం ప్రజా సేవే ముఖ్యమన్నారు. ఉద్యమకారులను పక్కకు పెట్టి.. ఉద్యమంపై రాళ్లేసిన వారిని పార్టీలో చేర్చుకున్నారని.. అందుకే ప్రస్తుతం పార్టీలో ఓనర్లు, కిరాయిదార్ల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గంటలు గంటలు కూర్చుని దేని గురించి చర్చిస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. అన్నింటిని పక్క రాష్ట్రంతో పోల్చుకునే కేసీఆర్ ఎందుకు ఫాలో కావడం లేదని అడిగారు. తండ్రి, కొడుకులకు బీజేపీ అంటే భయం పట్టుకుందని.. అందుకే సభలో లేకపోయినా తమను తల్చుకుంటున్నారన్నారు. మున్సిపాలిటీల్లో బీజేపీ పోరుబాట పడుతుందని.. కొత్తగా తెచ్చిన చట్టం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు తిరగబడితే రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యమే బీజేపీ ఎన్నికల ప్రచారం అన్నారు లక్ష్మణ్. -
అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి
సాక్షి, పటాన్చెరు: అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా పోరాటం చేస్తోందని వక్తలు గుర్తు చేశారు. మంగళవారం పటాన్చెరు శివారులోని ఎస్వీఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల కోరిక మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మజ్లిస్ కారణంగా కేసీఆర్ తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా చేపట్టడం లేదన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ పటాన్చెరులో తెలంగాణ విమోచన ఉత్సవాల సభ నిర్వహణకు ప్రత్యేక కారణం ఉందన్నారు. తెలంగాణ విమోచనానికి సర్ధార్ వల్లభాబాయ్ పటేల్ సేనలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పటాన్చెరు చేరుకోగానే నిజాం రాజు తన సంస్థానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ లొంగిపోయారని నాటి ఘటనలను వివరించారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇస్తామంటోందని, కానీ తాము కోరుకుంటున్నది అది కాదన్నారు. అధికారికంగా అన్ని కార్యాలయాల్లో తెలంగాణా విమోచన దినోత్సవాలు నిర్వహించాలన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల గౌరవం కోసం, తెలంగాణ ప్రజల కోరికను గుర్తిస్తూ విమోచన దినోత్సవాలను నిర్వహించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతికి మారు పేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయిందన్నారు. బీజేపీయే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే అనేక మంది బీజేపీలో చేరుతున్నారని ఆయన గుర్తు చేవారు. టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని మరళీధర్‌రావు అన్నారు. గ్రౌండ్ లెవల్లో ఆ పార్టీ షేక్ అవుతోందిని, ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేపట్టినా ఆ పార్టీని కాపాడలేరని ఆయన విశ్లేషించారు. అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ నాయకుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తోనే పటాన్చెరులో తమ పార్టీ రాష్ట్ర కమిటీ సభను ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరులో బీజేపీకి టిక్కెట్ వచ్చి ఉంటే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే వాడినని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. ‘తమ ఇంట్లోని కుక్కపిల్లను కాపాడుకోలే ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది’అని శ్రీకాంత్‌గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి వచ్చినట్లే కేసీఆర్ పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించనుందన్నారు. బీజేపీ నాయకుడు గరికపాటి రామ్మోహాన్‌రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినంపై అధికారంలోకి రాగానే ఆ మాటను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా విమోచన కమిటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఇందులో ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి (మెదక్), విజయపాల్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, నాయకుడు వివేక్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అనంత్‌రావు కులకర్ణి, ఆదెల్లి రవీందర్, అంకగల్ల సహాదేవ్ పాల్గొన్నారు. -
‘నిజాం ఆగడాలు విన్నాం...ఇప్పుడు చూస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్ : చరిత్రను తవ్వితే లాభం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ విమెచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తేనే విమోచన దినోత్సవం అధికారకంగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. సెప్టెంబర్ 17న తిరంగా యాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఊరి నిండా జాతీయ జెండా నినాదంతో.. పల్లె పల్లెలో జాతీయ పతాకాలు ఎగురవేస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ‘యాదాద్రిపై కేసీఆర్ బొమ్మ చెక్కించుకున్నారు. నిజాం ఆగడాలు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.(చదవండి : తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు) మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు సర్దార్ వల్లభబాయ్ పటేల్ దూరదృష్టితో తెలంగాణ కు విమోచనం లభించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్ విలీన అంశాన్ని పటేల్ డీల్ చేసి విముక్తి కల్పించారు. కశ్మీర్‌ను అంశాన్ని డీల్ చేసిన నెహ్రూ 370 ఆర్టికల్ పేరుతో ఆ ప్రాంతాన్ని సమస్యాత్మకంగా మార్చారు. నేడు ప్రధాని మోదీ, అమిత్ షా చొరవతో కశ్మీర్ సమస్య పరిష్కారమైంది. 370 ఆర్టికల్ రద్దు అయ్యింది అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోకేసీఆర్ కారుపై మజ్లీస్ సవారీ చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ‘కారు రిమోట్ మజ్లీస్ చేతిలో ఉంది. రాజు గారి కుక్క చనిపోతే డాక్టరును సస్పెండ్ చేస్తారు. మనుషుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్కలేదు’ అని ఘాటుగా విమర్శించారు. -
‘వాల్మీకిని రిలీజ్ కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికెట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్ స్టర్‌తో పోల్చడం వల్ల ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దాంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. లేకపోతే బోయ కమ్మూనిటీ అంతా ఒక్కటి అవుతుందని.. అందుకు నిర్మాతలు, డైరెక్టర్, నటులు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు. టైటిల్ మార్చకుంటే రిలీజ్ కానివ్వం: గోపి బోయ మా జాతికి గురువు అయిన వాల్మీకిని ఈ సినిమా ద్వారా రాబోయే తరాలకు గ్యాంగ్‌స్టర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి బోయ ఆరోపించారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు రాం అచంట, గోపి అచంటలను కలిసి టైటిల్ మార్చమని కోరామన్నారు. అంతేకాక హీరో వరుణ్ని కూడా కలిసామని కానీ వారు స్పందించలేదని తెలిపారు. టైటిల్ మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వమని హెచ్చరించారు. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు. (చదవండి: నాతోటి పందాలు వేస్తే సస్తరు) -
‘ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది’
సాక్షి, మహబూబ్‌నగర్ : దేశానికి నరేంద్రమోదీ నాయకత్వం అవసరం ఉంది కాబట్టే ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం పాలేరు బీజేపీ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కల్వకుంట్ల కుటుంబ సేవలోనే నాయకులు గడుపుతున్నారని విమర్శించారు. ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ బంగారు తెలంగాణను ఎలా నిర్మిస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని విర్రవీగడం సరికాదని.. దేశంలోని 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. ఎందరో అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కమల వికాసమే అంటూ ధీమా వ్వక్తం చేశారు. ఇప్పుడు జరిగేందంతా సినిమా విడుదలకు ముందు ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. -
‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’
సాక్షి, నల్గొండ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అంతా సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ స్వీకరణకు ఆదరణ భారీగా పెరిగిపోతుందని, నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరించేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆగష్టు 5వ తేది చరిత్ర తిరగరాసిన రోజని, ఇది దేశ సమగ్రతకు నిదర్శమని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమగ్ర అభివృద్దికి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలిస్తాయన్నారు.విపక్షాల వ్యాఖ్యలను ప్రజలు క్షమించబోరని, వారికి దేశ సమస్యలు పట్టబం లేదని విమర్శించారు. -
దేశ సమైక్యతకు కృషి చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ
సాక్షి, హైదరాబాద్: దేశ సమైక్యత కోసం కృషి చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం లేదని నెహ్రూతో విభేదించి ప్రభుత్వంలో నుంచి ముఖర్జీ బయటకు వచ్చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాజ్యాంగం వద్దని సూచించారన్నారు. ప్రస్తుతం రగులుతున్న రావణ కాష్టానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. 1951లో జనసంఘ్‌ను స్థాపించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. చివరి ఊపిరి వరకు కశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండాలని పోరాటం చేసినందునే ఆయన వర్ధంతి రోజును బలిదాన్ దివస్‌గా నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ పిలుపు మేరకు సమైక్య ప్రభుత్వం కోసం కృషి చేశారన్నారు. అందులో భాగంగానే నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారని, కశ్మీర్ అంశంలో విభేదించి ప్రభుత్వం నుంచి బయటకువచ్చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీమంత్రి విజయరామారావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీ 20 శాతం ఓట్లు సాధించి నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో రాష్ట్రంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పశ్చిమబెంగాల్, తెలంగాణలో పార్టీ ఆశాజనకమైన ఫలితాలు సాధించడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేసిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువా రం ఢిల్లీలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడంపై అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటిసారి జరిగిన పదాధి కారుల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవడంతో వాటి పరిధుల్లోని 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగలిగిందని వివరించారు. ఉత్తర తెలంగాణలో పుంజుకున్న పార్టీని దక్షిణ తెలంగాణకు విస్తరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని, దానికి ముందుగా ఈ నెల 21న రాష్ట్రస్థాయి నేతల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అన్నారు. దేశవ్యాప్తంగా గల్లంతైన కాంగ్రెస్.. రాష్ట్రంలో కూడా కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగే స్థితి లేకుండా స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ జెండా మోస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా భావించి లోక్‌సభ ఎన్నికల్లో పట్టంకట్టారన్నారు. -
నేడు, రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల సమావేశం ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో జరగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విషయంపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమిత్‌షా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ బలోపేతానికి అవకాశం ఉన్న ప్రాంతం తెలంగాణ అని, అందుకే జాతీయ పార్టీ, అమిత్‌షా ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఓటు బ్యాంకు పెంపు వంటి అంశాలపై జాతీయ పార్టీకి నివేదిక అందిస్తానని తెలిపారు. మరోవైపు అమిత్‌షా కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవిని జేపీ నడ్డాకు అప్పగిస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడి నియామకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలోనూ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మూడేళ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి నియామకంపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో దీనిపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చన్న భావనను బీజేపీ వర్గాలు వ్యక్తం చేశాయి. -
చదువు‘కొనేలా’ మార్చిన ఘనత కేసీఆర్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వస్తే కామ న్ స్కూల్ విద్యావిధానం తీసుకొస్తానని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. తన మనుమడు, తన డ్రైవర్ కొడుకు ఒకే పాఠశాలలో చదివే విద్యావిధానం తెస్తానన్న కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని, ఆయన చెప్పిన కామన్ స్కూల్ విధానం ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, కార్పొరే ట్ విద్యా విధానానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘చదువుకుందాం’నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఫీజుల కలెక్షన్ విషయంలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటివరకు దాదాపు 400 శాతం ఫీజు పెరిగిందని చెప్పారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న నియమాన్ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డీటెయిన్ చేస్తున్నారన్నారు. మూడేళ్ల పిల్లలకు బ్యాగు బరువు తప్పడం లేదని, విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుంటోందని అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలను తమ యువజన విభాగం సేకరించిందని చెప్పారు. వారంలోగా ఆయా విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకోకపోతే వారి పనిపడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని లక్ష్మణ్ ఆరోపిం చారు. గత పాలకులు 60 ఏళ్లలో చేసిన అప్పులని కేసీఆర్ ఆరేళ్లలోనే చేశారన్నారు. మజ్లిస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
ప్రేమ్‌కుమార్ హత్య హేయమైనది
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేవరకద్ర మండలం డోకూరులో బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్ హత్య హేయమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు. రాజ్యాంగబద్ధంగా నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గురువారం దేవరకద్ర మండలం డోకూరులో ప్రేమ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి న సిద్ధాంతాల కోసం ఎంపీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ను అధికార పార్టీ నాయకులు వేట కొడవళ్లతో నరికి చంపారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకు, ఫలితాలు టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత, సన్నిహితుడు వినోద్ ఓడిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దొడ్డిదారిన గ్రామాల్లోని బీజేపీ కార్యకర్తలను అణచివేస్తామంటే అది టీఆర్ఎస్ పార్టీ నాయకుల అవివేకమేనన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే తిరుగుబాటు తప్పదని, హత్యా రాజకీయాలను నిలువరిస్తామని అన్నారు. ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంటుందని, ఇకపై ఆ కుటుంబ బాధ్యతను పార్టీయే తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే దాడులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తాటాకు చప్పుల్లకు బీజేపీ బెదరదని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణను పశ్చిమ బెంగాల్‌లా మారుస్తామంటే సహించమన్నారు. రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతి చెందిన ప్రేమ్ కుమార్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ వైఖరి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎంపీ ఫలితాల తర్వాత ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్నారు లక్ష్మణ్. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
తెలంగాణలో పాగా వేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి తెలంగాణలో పాగా వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతుండటంతో ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే సామర్థ్యం ఒక్క బీజేపీకే ఉందని భావించే ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఒక అవకాశంగా, ఒక సవాల్‌గా భావించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీని బూత్‌స్థాయిలో పటిష్టపరుస్తూ ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తాం.టీఆర్ఎస్ కుటుంబ పాలనను ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదని ప్రజలు భావించి బీజేపీకి పట్టం కట్టారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఆకాశం నుంచి దిగివచ్చి భూమ్మీద కాలుపెట్టి ఆలోచించాలి. లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంటింటికీ బీజేపీని తీసుకెళ్తాం. కేంద్ర పథకాలను తీసుకెళ్తాం. బెంగాల్ తరహా పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డికి స్థానం దక్కడంతో కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తాం. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుంది. టీఆర్ఎస్పై పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవరకు, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ అధికారికంగా జరపకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చాక జరుపుతుంద’న్నారు. కిషన్ రెడ్డి, ఎంపీలకు జిల్లా కేంద్రాల్లో సన్మానం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిష న్‌రెడ్డిని, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను ఘనంగా సన్మానించాలని బీజేపీ నిర్ణయించింది. పాత జిల్లాల ఆధారంగా జిల్లా కేంద్రాల్లో భారీ సభలు ఏర్పాటు చేసి వారిని సన్మానించనుంది. ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక పర్యటన చేయడం ద్వారా తమ శ్రేణులను సమాయత్తపరిచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ నివాసంలో జరిగిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్, అధికార ప్రతినిధి రఘునందన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కిషన్ రెడ్డిని కలసిన టీడీపీ నేతలు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డిని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు ఢిల్లీలో కలిశారు. టీడీపీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు చాడా సురేష్ రెడ్డి కలిశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరు నేతలు బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ భవన్‌కు విచ్చేసిన కిషన్ రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
పరిషత్ ఫలితాలు వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల చివరివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బుధవారం బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఫలితాలు వెలువడ్డాక జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నెలకుపైగా వ్యవధి ఉంటున్నందున పెద్దఎత్తున క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టు అవుతుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చింది. బుధవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో చిన్న జిల్లా పరిషత్‌లు ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు పెరిగే అవకాశమున్నందున పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని వారు కమిషనర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రలోభాలకు అవకాశం: కె.లక్ష్మణ్ దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని లక్ష్మణ్ విమర్శిం చారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న పరిషత్ ఫలి తాలు వెలువడ్డాక, జూలై 12న జెడ్పీపీ చైర్పర్సన్ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారని, ఇంత వ్యవధి ఇస్తే పెద్దఎత్తున ప్రలోభాలకు అవకాశంతో పాటు గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీకి అనుకూలంగా తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయన్నారు. అందువల్ల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును జూన్ ఆఖరు వరకు వాయిదా వేయాలని కమిషనర్ ను కోరామన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులున్నారు. -
పేకాటలో జోకర్లా చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో దేశంలో పేకాటలో జోకర్‌లాగా మిగిలింది చంద్రబాబు ఒక్కడేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. చంద్రబాబు, టీడీపీ వల్లనే బీజేపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి ఎడ్లబండిని మోస్తున్నానని అనుకుంటున్న కుక్క పిల్లలాగా ఉందని దుయ్యబట్టారు. బాబు పెట్టిన ప్రతిపక్షాల మీటింగ్‌కు ఎవరూ రాలేదన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. బాబు చచ్చిన పాము అనీ, తాము ఆయనను టార్గెట్ చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని మంత్రిని చేసి కనీసం ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఎమ్మెల్యేనూ చెయ్యలేదని, గవర్నర్ చెప్తే కానీ రాజీనామా చేయించలేదని, చంద్రబాబుకు రాజ్యాంగం ఏం తెలుసని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధికారిక డబ్బుని సీజ్ చేశారని, ఎన్నికల కమిషన్ తమకు మద్దతు ఇచ్చిం దని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. తెలంగాణలో రెండు పార్టీల విధానం వచ్చే అవకాశం ఉందని, బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే ఇక పోటీ ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లో జరిగిన ప్రధాని సభకు రాజాసింగ్ ఆరోగ్యం బాగాలేక మాత్రమే రాలేదన్నారు. దక్షిణాదిన సొంతంగా ఎదగాలని పార్టీ భావిస్తోందన్నారు. దేశానికి సమర్థ నాయకుడు, సుస్థిర ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారన్నారు. తాము 17 సెగ్మెంట్లలో సీరియస్‌గా పోటీ చేశామన్నారు. తమ కార్యకర్తల మీద, ప్రజల మీద నమ్మకంతో ఒక రోజు ముందే సంబరాలకు సిద్ధం అవుతున్నామన్నారు. మోదీ ప్రధాని కాకుండా కుట్రలు మోదీ తిరిగి ప్రధాని కాకుండా జరిగినన్ని కుట్రలు ఇంతకుముందెప్పుడూ జరగలేదని లక్ష్మణ్ అన్నారు. హిందువులు అంటూ రెచ్చగొట్టింది కేసీఆరే అని, మోదీ, షాలు అభివృద్ధి అంశాలు మాత్రమే చెప్పారన్నారు. కేసీఆర్ దగ్గర అభివృద్ధి ఎజెండా లేదు కాబట్టి దృష్టి మరల్చే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో చాలా మార్పులు ఉంటాయన్నారు. హరీశ్ మాత్రమే కాదు.. మోదీని, బీజేపీ విధానాలను నమ్మి ఎవరు పార్టీలోకి వచ్చినా తీసుకుంటామన్నారు. పదవికి రాజీనామా చేయించే తీసుకుంటామన్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. ఓటు శాతం అన్ని పార్లమెంట్ స్థానాల్లో పెరుగుతుందని అన్నారు. -
‘ఎగ్జిట్’ను మించి సీట్లొస్తాయ్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించి రాష్ట్రంలో బీజేపీకి లోక్‌సభ సీట్లు దక్కనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లోని అసంతృప్తవాదులు, రాష్ట్ర కాంగ్రెస్‌లోని మరికొందరు నేతలు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల్లో నిశ్శబ్ధ విప్లవం రాబోతోందని, బెంగాల్ తరహాలోనే రాష్ట్రంలో కూడా బీజేపీ రాజకీయాలను తిరగరాయబోతోందని అన్నారు. ఇద్దరు చంద్రుల ఫెడరల్ ఫ్రంట్.. ఫ్యామిలీ ఫ్రంట్‌కు టెంటు లేదని ఏపీ, తెలంగాణ సీఎంలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సమాజం సమయం కోసం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ మీద విపక్షాలు రుజువులు అడగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. ఈ దాడుల్లో దోమ కూడా చనిపోలేదని కేసీఆర్ చెప్పారని, బహుశా ఆయనకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ చెవిలో చెప్పి ఉంటాడని ఎద్దేవా చేశారు. సైన్యం మీద కన్నా ఉగ్రవాదుల మీదే కేసీఆర్‌కు నమ్మకం ఎక్కువ అని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వం అని కేసీఆర్ కాంగ్రెస్‌కు బయట నుంచి మద్దతు ఇస్తా అంటున్నారని, కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. చంద్రబాబు టీడీపీని సోనియా గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు చక్రం తిప్పుతారని, కేసీఆర్ బొంగరం తిప్పుతారని కొన్ని మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏపీలో ఎదురుకానున్న ఓటమికి చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ సాకులు వెతుకుతున్నారన్నారు. ఓ వైపు ట్యాంపరింగ్ జరిగిందంటూ.. మరోవైపు నేనే గెలుస్తానని చెప్పుకుంటూ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. బీజేపీకి స్వతహాగా మెజారిటీ వస్తుందని, ఎన్డీఏకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. మోదీ ఓటమి కోసం కూటమి కట్టి, ఎజెండా లేకుండా ఎన్నికలకు వెళ్లిన విపక్షాల కూటములను ప్రజలు నమ్మలేదన్నారు. -
హింసను ప్రోత్సహిస్తున్న మమత: లక్ష్మణ్
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్లో అమిత్‌షా ప్రచారంపై రాళ్ల దాడి జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ కార్యకర్తలు కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లో ఎలాగైనా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని హింసను నమ్ముకుని ఆమె రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గత కొద్ది రోజులుగా బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి: లక్ష్మణ్
నల్లగొండ టూటౌన్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు భరోసా కల్పించి, వారి సమస్యలు పరిష్కరించాలని తాను శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే పోలీసులతో భగ్నం చేయించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడితే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ఇలాంటి కిరాతక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ కనీ సం స్పందించడం లేదని, కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించార -
న్యాయం జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు వైఫల్యంతో నష్టపోయిన విద్యార్థులకు, ఆత్మహత్యలకు పాల్పడిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినా కనీసం స్పందించని మంత్రి జగదీశ్‌రెడ్డివే చిల్లర రాజకీయాలని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం చేయడంతోపాటు తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థను తొలగించడం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను, మంత్రి జగదీశ్‌రెడ్డిని తప్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకొస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ 1000కి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే, రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న లాస్య ఇంటికి మంత్రి తలసాని ఇల్లు కూతవేటు దూరమే అయినా ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం వెనుకబడిన రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనుకబడి ఉందన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే రాష్ట్రంలో టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని లక్ష్మణ్ పేర్కొన్నారు. మే 23 తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల విధానం వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరి మద్దతు లేకుండా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నక్సలిజం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని పేర్కొన్నారు. రక్షణ రంగానికి పెద్ద పీట వేశారని, మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించిగలిగిందన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని, అందులోకి వెళ్లాలని కేసీఆర్ పగటి కలలుకంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తాను ఓడిపోతానని తెలిసి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయనో చచ్చిన పాముతో సమానమన్నారు. విద్యార్థుల మరణాలపై కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ లేదా సీబీఐ విచారణ కోరుతామన్నారు. వర్సిటీల్లో సిబ్బంది లేకుండా, 60 శాతం ఖాళీలతో న్యాక్ గుర్తింపు ఎలా వస్తుందని, నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. -
నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన కె లక్ష్మణ్
-
‘ఇంటర్’ వైఫల్యాలపై నేడు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాలను నిరసిస్తూ బీజేపీ గురువారం (2న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నేడు తాము చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పిల్లల భవిష్యత్తు కోసం, ఆందోళనలో ఉన్న విద్యార్థి లోకానికి భరోసా ఇచ్చేందుకు, అమాయక విద్యార్థుల బలిదానమైనా అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణ, ప్రాసెసింగ్ లోపాలతో పలువురు విద్యార్థులు ఫెయిలయ్యారని అన్నారు. టాప్ ర్యాంక్ వస్తుందని ఆశించిన వారు, ఫస్టియర్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు, మిగతా సబ్జెక్టుల్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు కూడా ఫెయిలైన వారి జాబితాలో ఉన్నారని వెల్లడించారు. 50 ఏళ్ల ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని గందరగోళం, ఘోర వైఫల్యం ఈసారి చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు, బాధిత విద్యార్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని, ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదని స్పష్టం చేశారు. నిమ్స్‌లో కొనసాగుతున్న లక్ష్మణ్ దీక్ష.. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారంతో మూడో రోజుకు చేరింది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు సోమవారం ఆయన దీక్షకు కూర్చోగా, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. సెలైన్ ఎక్కించేందుకు యత్నించినప్పటికీ ఆయన నిరాకరించి, ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తు న్నారు. మూడు రోజులుగా ఆయన ఎలాంటి ఆహా రం తీసుకోకపోవడం వల్ల నాలుగు కేజీల బరువు తగ్గారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటం, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంతో బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనేక మంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న గ్లోబరీనా సంస్థ కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని.. విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, బోర్డుకార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ‘బంద్‌కు సహకరించండి’ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులను నిరసిస్తూ సోమవారం (2న) బీజేపీ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రజలను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ బోర్డులో అవకతవకలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నిరసనకు దిగిన ప్రతిపక్షా లపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఒప్పందం లేకుండా గ్లోబరీనా సంస్థ కాంట్రాక్టు ఎలా దక్కించుకుందని ప్రశ్నించారు. పాత్రధారులే న్యాయ నిర్ణేతలుగా ఉన్నారని విమర్శించారు. ఈ విషయం లో తాడోపేడో తేల్చుకునేందుకు తమ పార్టీ సిద్ధమవుతోందని చెప్పారు. తాము చేపట్టనున్న బంద్ రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. -
లక్ష్మణ్ అరెస్ట్.. నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ని అరెస్ట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ముట్టడితో సహా రేపటి అన్ని కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
‘రేపు ప్రగతి భవన్ ముట్టిడిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరపై బీజేపీ భగ్గుమంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇక లక్ష్మణ్ దీక్షకు హాజరైన సీనియర్ నేతలు రాం మాధవ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, మురళధర్ రావులు ఆయనకు సంఘీభావం తెలిపారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద తప్పిదాలు ఎన్నడూ చూడలేదని, పిల్లల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని దీక్షకు ఉపక్రమించిన లక్ష్మణ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు..బలిదానాల తెలంగాణగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లితండ్రులు విశ్వాసం కోల్పోకండని ఆయన కోరారు. విద్యార్ధులు ఒత్తిళ్లకు లోనుకావద్దు : రాంమాధవ్ ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు దురదృష్టకరం. చరిత్రలో ఇదొక మచ్చగా మిగిలిపోతుంది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకూడదు. ప్రభుత్వం పిల్లలకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంభావంతో వ్యవహరిస్తోంది. ఇది రాజకీయ సమస్య కాదు . పిల్లలకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం కొనసాగుతుంది. ఇది పెను సంక్షోభం : మురళీధర్ రావు విద్యారంగంలో ఇంత పెద్ద సంక్షోభం దేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకల కారణంగా ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికే ఇది పరీక్షగా మారుతుంది. ప్రగతి భవన్ ముట్టడిస్తాం : దత్తాత్రేయ ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలి. ఇంటర్ విద్యార్ధుల ఆవేదనను అర్ధం చేసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం న్యాయవిచారణ చేపట్టాలి : జితేందర్ రెడ్డి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూడున్నర లక్షల ఇంటర్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. ప్రభుత్వం విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది సీబీఐ విచారణ జరిపించాలి : కన్నా సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే తీరుగా ఉన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్లతో తీరికలేకుండా బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌తో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ చేత విచారణ జరపాలి -
రిజర్వేషన్లపై తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గెలిస్తే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న భయంతోనే సీఎం కేసీఆర్ ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్‌కు దేశంలో ఏక కాలంలో ఎన్నికలు జరగాలని లేదని, అలా అనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు ఎందుకు వెళతారని ప్రశ్నించారు. అయినప్పటికీ తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు. కేసీఆర్ పగటి కలలు కంటూ కేంద్రంలో మంత్రులం అవుతామని అంటున్నారని, ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఇద్దరు మంత్రులే ఎందుకని, కేసీఆర్ ప్రధాని కావచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇదంతా మైండ్ గేమ్ మాత్రమేనని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామని ఉద్యోగులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖను తీసేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పుల తడకగా నడుస్తోందని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల కుదింపు విషయంలో కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించారని, ఇంకా తగ్గించాలని చూస్తున్నారని అన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జెడ్పీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదరాబాదరాగా వెళ్తున్నారని, ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. తొందరపాటుతో, రాజకీయ దురుద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జెడ్పీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపులు తెరిచారని.. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం మద్యం ద్వారానే వస్తోందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రూ. వేల కోట్ల అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరిపిస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు జరిపించలేదని నిలదీశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా.. నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరోసిస్ బాధితులు చాలా మంది ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఫ్లోరోసిస్ బాధితుల తరఫున ఎన్ఆర్ఐలు జలగం సుధీర్, రమేశ్ దేవా, కత్తి గోపాలకృష్ణ, బోజారెడ్డి (ప్రకాశం), జి.నాగరాజు తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చౌటుప్పల్ వద్ద ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసిందని గుర్తు చేశారు. భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు చొరవ చూపాలని కోరారు. ఫ్లోరోసిస్ గ్రామాలకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. -
వారివి ఓటుబ్యాంకు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. దేశ భద్రత విషయంలో టీఆర్ఎస్ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో శనివారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అక్రమ వలసదారులను అరికట్టేందుకు, దేశద్రోహులను గుర్తించి పంపించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారులపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. -
టీడీపీ గల్లంతు..కాంగ్రెస్ కనుమరుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతైందని, కాంగ్రెస్ కనుమరుగైందని.. ఇక టీఆర్ఎస్కు ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీ ఉండబోతున్నాయని, అవి టీఆర్ఎస్, బీజేపీలే మాత్రమేనన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని, రాష్ట్రంలోనూ బీజేపీకి ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని చెప్పారు. శక్తివంచన లేకుండా కృషి.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ అవినీతి, కుటుంబపాలన, నియంతృత్వ పోకడలను రూపుమాపేందుకు కృషి చేస్తా మని లక్ష్మణ్ చెప్పారు. మోదీౖ పె ఇద్దరు చంద్రులు విషప్ర చారం చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా ప్రజలు మరో సారి మోదీ ప్రధాని కావాలని ఓట్లు వేశారన్నారు. ఈ ఎన్నికలతో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయని.. పెద్ద ఎత్తు న కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలి పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తలబొప్పి కట్టడం ఖాయమన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, మద్యం ఏరులై పారించిందని పాల్పడిందని ఆరోపించారు. అయినా మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపారని.. మే 23 తర్వాత మోదీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఆ కేబినెట్లో రాష్ట్ర ప్రాతినిధ్యం గణనీయంగా ఉంటుందని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబానికి చేదు అనుభ వాన్ని మిగుల్చుతాయని చెప్పారు. ఒవైసీ దేశం అంతా పొడిచేస్తానని మాట్లాడుతున్నారని, అయితే హైదరాబాద్‌లో ఓటింగ్ సరళిని చూస్తే వారిపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందని చెప్పారు. బీజేపీని బూచిగా చూపి, మతతత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని, అయినా ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్.. నా భరతం పడతానన్నారు.. కేసీఆర్ అవినీతి పాలన, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల తర్వాత తన భరతం పడతానని హెచ్చరించారని, అందులో భాగంగానే తమ పార్టీ డబ్బును పట్టుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అకౌంటెంట్, పార్టీ సిబ్బందిపై చేయిచేసుకుని, కారును ధ్వంసం చేసి నాటకమాడారన్నారు. అనేక సమావేశాలకు సంబంధించి చెల్లింపుల కోసం నిబంధనల ప్రకారమే తా ము డబ్బు డ్రా చేశామన్నారు. ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు ఇది అకౌంటెడ్ మనీ అని చెప్పామని, వారు క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. పార్టీ డబ్బుల డ్రా విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి కనీస అవగాహన లేదన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసిందో తలసాని వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరమని.. ఎన్నికలు నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లతో పాటు జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. -
నేడు రాష్ట్రానికి యూపీ సీఎం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆదివారం (7వ తేదీన) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగే పెద్దపల్లి నియోజకవర్గ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యా హ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిలో నిర్వహించే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభల్లో ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొననున్నారు. అలాగే కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కూడా ఆదివారం వివిధ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం శేరిలింగంపల్లిలో బీజేపీ చేవెళ్ల అభ్యర్థి బెక్కరి జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ఐటీ ప్రొఫెషనల్స్ కార్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలో నిర్వహించే ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గద్వాలలో జరిగే బహిరంగసభలోనూ పాల్గొని మాట్లాడనున్నారు. -
దేశరక్షణ కోసం బీజేపీని గెలిపించాలి
హైదరాబాద్ : దేశరక్షణ, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీని గెలిపించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ సికింద్రాబాద్‌లోని హర్యానాభవన్‌లో బీజేపీ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో బాంబు పేలుళ్లతో దేశం అల్లకల్లోలమైందని, ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన కొద్ది రోజుల్లోనే దానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 17 దేశాల అధినేతలు మద్దతు ప్రకటించారని, పాకిస్తాన్‌ను ఏకాకిని చేశామని చెప్పారు. ఉగ్రవాదం కంటే నిరుద్యోగమే పెద్ద సమస్య అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ ఉగ్రవాదం లేకుంటేనే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించగలరని అన్నారు. ఉగ్రవాదం సమస్య కాకపోతే రాహుల్ ఎస్పీజీ రక్షణతో ఎందుకు బయటకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రతివ్యక్తి అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల డబ్బు మొత్తం నేరుగా ఇప్పుడు లబ్ధిదారులకు చేరుతుండటం హర్షించదగ్గ విషయమన్నారు. కళ్లకు గంతలు తీసి చూడాలి... ఆయుష్మాన్భారత్ పథకం ద్వారా దేశంలోని 50 కోట్ల మంది ఏడాది రూ.5 లక్షల మేరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. యువత ఉపాధి కోసం రూ.800 కోట్ల ముద్ర రుణాలు అందించామని తెలిపారు. మోదీ ఏమి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, కళ్లకు గంతలు తీసి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. నిద్రపోయే వారిని లేపవచ్చని, నిద్ర నటించేవారిని లేపడం కష్టమని విమర్శించారు. గతంలో బండారు దత్తాత్రేయను నాలుగుసార్లు ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలు ఈసారి కిషన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని, లోక్‌సభ ఎన్నికలు దేశానికి సంబంధించినవి కావడంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సర్కారు చెప్పే మాటలు కాకుండా ఉగ్రవాది మసూద్ అజార్ చెప్పే మాటలనే కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లపాటు అసెంబ్లీలో ప్రజాగళం విప్పిన తనకు ఎంపీగా పార్లమెంటులో గళం విప్పే అవకాశం కల్పించాలని విన్నవించారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఒరిగేది ఏమి లేదని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ సభతో రాజకీయ మార్పులకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగసభ రాష్ట్రంలో రాజకీయ మార్పులకు శ్రీకారం చుడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా దేశ రక్షణకు సంబంధించి, ప్రధానిగా ఎవరుండాలనే దానిపై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలివి అని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో మోదీ సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్ట్‌లు కాపాడుకుంటూ తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ మంచి సంఖ్యలో సీట్లు గెలుచుకుని, ఓట్ల శాతాన్ని కూడా పెంచుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయపార్టీగా బీజేపీ రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్షం బీజేపీ అనే విషయం రుజువు కాబోతోందన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిపోయారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీమంత్రి విజయరామారావు, ఇతర నేతలు మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఇతర హేమాహేమీలు బీజేపీలో చేరారంటేనే మారుతున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని అన్నారు. మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు హిందువులను కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉగ్రవాది మసూద్ మీద ఉన్న నమ్మకం భారత సైనికుల మీద లేకపోవడం సిగ్గుచేటని, భారత ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ప్రధాని మోదీ చేపట్టిన ‘మైబీ చౌకీదార్’ లైవ్ కార్యక్రమాన్ని ముషీరాబాద్‌లోని ఎన్నికల కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, ఎన్నికల పరిశీలకులు కృష్ణదాస్, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి తదితరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మైబీ చౌకీదార్ ప్లకార్డ్స్ను ప్రదర్శించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరువాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులపై కనీస చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ మాత్రం ఉడీ, పుల్వామాలో సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి సమాధానంగా మెరుపు దాడులు జరిపించారని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ ఖ్యాతి తనది కాదని, అది జవాన్లదని.. వారికి తాము స్వేచ్ఛను ఇచ్చామని ప్రధాని ప్రకటించడం ఆయన హుందాతనానికి నిదర్శనమని కొనియాడారు. -
కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘జవాన్లపై పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు, సైనికుల కుటుంబాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ అంటే కార్మికుల స్ట్రయిక్ వంటిదని అని కేసీఆర్ అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. శనివారం ఇక్క డ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నారని, తమ పార్టీకి 300 సీట్లు వస్తే కేసీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతారా.. అని సవాల్ విసిరారు. సారు, కారు, పదహారు అంటూ కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకు లు హడావుడి చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో బారు, బీరు, సర్కార్ అన్నట్టుగా పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంతోపాటు, రాష్ట్రంలోనూ రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ సభకు వచ్చిన స్పందన చూశాక కేసీఆర్‌లో వణుకు పుట్టిందన్నారు. పాలమూరు సభ నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైం దని పేర్కొన్నారు. శతకోటి లింగాల్లో బోడి లింగం కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఏం చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తేనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి సచివాలయానికి వస్తారన్నారు. ఎన్నికల తర్వాత ఎవరి దుకాణం బంద్ అవుతుందో చూద్దామని లక్ష్మణ్ సవాల్ చేశారు. ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే డబ్బు లు, పదవులకు కాంగ్రెస్ వారు అమ్ముడుపోతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో విసిగి వేసారి మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారన్నారు. ఏప్రిల్ 1న ఎల్బీ స్టేడియం లో ప్రధాని బహిరంగసభ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ బేజారు... అహంకారం, అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజ లు ఎలా సమాధానం చెబుతారో టీఆర్ఎస్ ఎల్బీ స్టేడియం సభ ఒక ఉదాహరణ అని లక్ష్మణ్ అన్నారు. ఈ సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ నేతలకు ఎటూ పాలుపోవడం లేదన్నారు. టీచర్, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ కారు పంక్చర్ అయిందని, ముందు కేసీఆర్ తన ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిదని హితవు పలికారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు. ఈ కుటుంబపాలనల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తుల్ని చేయాలని రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కల్పన, ఆయుష్మాన్ భారత్ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. బీసీల విషయంలో బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవిని బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నిం చారు. స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం 23 శాతానికి తగ్గించిన కేసీఆర్ సర్కార్‌కు బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. -
కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘జవాన్లపై పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు, సైనికుల కుటుంబాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ అంటే కార్మికుల స్ట్రయిక్ వంటిదని అని కేసీఆర్ అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. శనివారం ఇక్క డ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నారని, తమ పార్టీకి 300 సీట్లు వస్తే కేసీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతారా.. అని సవాల్ విసిరారు. సారు, కారు, పదహారు అంటూ కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకు లు హడావుడి చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో బారు, బీరు, సర్కార్ అన్నట్టుగా పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంతోపాటు, రాష్ట్రంలోనూ రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ సభకు వచ్చిన స్పందన చూశాక కేసీఆర్‌లో వణుకు పుట్టిందన్నారు. పాలమూరు సభ నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైం దని పేర్కొన్నారు. శతకోటి లింగాల్లో బోడి లింగం కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఏం చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తేనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి సచివాలయానికి వస్తారన్నారు. ఎన్నికల తర్వాత ఎవరి దుకాణం బంద్ అవుతుందో చూద్దామని లక్ష్మణ్ సవాల్ చేశారు. ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే డబ్బు లు, పదవులకు కాంగ్రెస్ వారు అమ్ముడుపోతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో విసిగి వేసారి మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారన్నారు. ఏప్రిల్ 1న ఎల్బీ స్టేడియం లో ప్రధాని బహిరంగసభ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ బేజారు... అహంకారం, అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజ లు ఎలా సమాధానం చెబుతారో టీఆర్ఎస్ ఎల్బీ స్టేడియం సభ ఒక ఉదాహరణ అని లక్ష్మణ్ అన్నారు. ఈ సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ నేతలకు ఎటూ పాలుపోవడం లేదన్నారు. టీచర్, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ కారు పంక్చర్ అయిందని, ముందు కేసీఆర్ తన ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిదని హితవు పలికారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు. ఈ కుటుంబపాలనల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తుల్ని చేయాలని రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కల్పన, ఆయుష్మాన్ భారత్ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. బీసీల విషయంలో బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవిని బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నిం చారు. స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం 23 శాతానికి తగ్గించిన కేసీఆర్ సర్కార్‌కు బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. -
కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘జవాన్లపై పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు, సైనికుల కుటుంబాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ అంటే కార్మికుల స్ట్రయిక్ వంటిదని అని కేసీఆర్ అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. శనివారం ఇక్క డ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నారని, తమ పార్టీకి 300 సీట్లు వస్తే కేసీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతారా.. అని సవాల్ విసిరారు. సారు, కారు, పదహారు అంటూ కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకు లు హడావుడి చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో బారు, బీరు, సర్కార్ అన్నట్టుగా పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంతోపాటు, రాష్ట్రంలోనూ రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ సభకు వచ్చిన స్పందన చూశాక కేసీఆర్‌లో వణుకు పుట్టిందన్నారు. పాలమూరు సభ నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైం దని పేర్కొన్నారు. శతకోటి లింగాల్లో బోడి లింగం కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఏం చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తేనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి సచివాలయానికి వస్తారన్నారు. ఎన్నికల తర్వాత ఎవరి దుకాణం బంద్ అవుతుందో చూద్దామని లక్ష్మణ్ సవాల్ చేశారు. ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే డబ్బు లు, పదవులకు కాంగ్రెస్ వారు అమ్ముడుపోతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో విసిగి వేసారి మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారన్నారు. ఏప్రిల్ 1న ఎల్బీ స్టేడియం లో ప్రధాని బహిరంగసభ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ బేజారు... అహంకారం, అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజ లు ఎలా సమాధానం చెబుతారో టీఆర్ఎస్ ఎల్బీ స్టేడియం సభ ఒక ఉదాహరణ అని లక్ష్మణ్ అన్నారు. ఈ సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ నేతలకు ఎటూ పాలుపోవడం లేదన్నారు. టీచర్, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ కారు పంక్చర్ అయిందని, ముందు కేసీఆర్ తన ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిదని హితవు పలికారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు. ఈ కుటుంబపాలనల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తుల్ని చేయాలని రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కల్పన, ఆయుష్మాన్ భారత్ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. బీసీల విషయంలో బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవిని బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నిం చారు. స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం 23 శాతానికి తగ్గించిన కేసీఆర్ సర్కార్‌కు బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. -
నేడు పాలమూరుకు మోదీ
సాక్షి, మహబూబ్‌నగర్/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహబూబ్‌నగర్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. పాలమూరు జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మహబూబ్‌నగర్, చేవెళ్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30కు జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలు భారీఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకత.. ఐదేళ్లలో దేశంలో బీజేపీ పాలన తీరును ప్రధాని వివరించనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుండడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్ధానాల నుంచి రెండు లక్షలకు తగ్గకుండా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. పార్టీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి పరిచయ కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. 4నెలల వ్యవధిలో మోదీ పాలమూరుకు రావడం ఇది రెండోసారి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది నవంబర్ 28న మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ శంఖారావంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అలాగే ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5:30 గంటలకు జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు ప్రధానమంత్రి బహిరంగ సభకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చిన ప్రత్యేక 30 ఎస్పీజీ, 40 సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు మొత్తం వెయ్యి మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్పీజీ బలగాలు సభా ప్రాంగణాన్ని తమ అధీనంలో తీసుకున్నాయి. సుమారు 40 ఎకరాల మైదానంలో సభకు ఏర్పాట్లు జరిగాయి. 40–50 మంది కూర్చునే విధంగా భారీ వేదికను సిద్ధం చేశారు. ముఖ్యమైన నాయకులనే వేదికపైకి ఆహ్వానించనున్నారు. -
బీజేపీ మేనిఫెస్టో సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పార్టీ జాతీయ నాయకత్వం సూచనల మేరకు రాష్ట్ర స్థాయి అంశాలతో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. మన్ కీ బాత్.. మోదీ కే సాత్ నినాదంతో ప్రజాభిప్రాయాలతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 15 రంగాలకు చెందిన ప్రముఖులు, 10 వేల మంది ప్రజలు, 800 మంది వివిధ వర్గాల నేతల అభిప్రాయాలను రాష్ట్ర బీజేపీ, మేనిఫెస్టో కమిటీ సేకరించింది. వారి అభిప్రాయాలతో తెలంగాణ మన్ కీ బాత్.. మోదీకే సాత్ పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది. దానిని బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ రాకేశ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అందజేశారు. మోదీ సభల్లో చేరికలు.. జాతీయ నాయకత్వం రూపొందించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో రాష్ట్రస్థాయిలో రూపొందించిన మేనిఫెస్టో అంశాలను పొందుపరుస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్ వెల్లడించారు. గురువారం (27న) ఈ మేనిఫెస్టోను జాతీయ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేస్తామని వివరించారు. ఈ నెల 29వ తేదీ, వచ్చే నెలలో జరిగే మోదీ బహిరంగ సభల్లో ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరతారని వివరించారు. రాష్ట్రంలో కారుకు పంచర్ తప్పదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం కోసం దేశ ప్రజలు కళ్లల్లో వత్తులేసుకొని చూస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా బీజేపీలోకి చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం, సాగు నీరు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సం క్షేమ, దేశ రక్షణ తదితర అంశాలకు సంబంధించిన ఆలోచనలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామని మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ రాకేశ్‌రెడ్డి చెప్పారు. సరూర్‌నగర్‌లో నమోదైన కేసుతో మురళీ ధర్‌రావుకు ఏ సంబంధం లేదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు చెప్పారు. ఆయనపై బురద జల్లేందుకే ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని.. దానిని తాము ఎదుర్కొంటామని చెప్పారు. -
29 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 29నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సభలు రాష్ట్రంలో మూడు వరకు ఉండొచ్చునని, వాటిలో పాలమూరు, హైదరాబాద్‌లో బహిరంగసభలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరు బహిరంగసభల్లో పాల్గొంటారని తెలిపారు. మాజీమంత్రి డీకే అరుణతో కలసి శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక్కో కేంద్రమంత్రి ఎన్నికల ప్రచార సభ ఉంటుందని చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణానికి సంబంధించి ఏమైనా జరుగుతుందేమోనని ఆయన భయపడుతున్నారన్నా రు. కాంగ్రెస్ వైఖరితోనే ఆ పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందన్నారు. మోదీ మరోసారి ప్రధాని అయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ భూస్థాపితమైంది: డీకే అరుణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన నేత డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షపాత్ర నిర్వహణలో కాంగ్రెస్ విఫలమైందన్నా రు. టీఆర్ఎస్తో కాంగ్రెస్‌నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు కాంగ్రెస్ భరోసా ఇవ్వని కారణంగానే బీజేపీలో చేరినట్టు వివరించారు. పదిహేనేళ్లుగా పార్టీ ఏమి చేయలేదా అన్న విలేకరుల ప్రశ్నకు గత ఐదేళ్లలోనే ఏమీ చేయలేకపోయామని, ప్రతిపక్షపాత్రను సమర్థవంతంగా నిర్వహించలేక పో యామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియం తృత్వం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. లోక్‌సభకు పోటీ చేయకుండానే కేసీఆర్ ప్రధాని ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి డీకే అరుణ బీ–ఫారం తీసుకున్నారు. -
పోటీకి దూరంగా లక్ష్మణ్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించే అవకాశముంది. శుక్రవారమే ఈ జాబితాను ప్రకటించాలని భావించినా జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ నెల 16కి వాయిదా పడటంతో అభ్యర్థుల ప్రకటన కూడా ఆలస్యమైంది. శనివారం జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, శనివారం లేదా ఆదివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, మంత్రి శ్రీనివాస్, రాంచంద్రరావు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురి పేర్లతో జాబితాను రూపొందించి తమ వెంట తీసుకువెళ్తున్నారు. కొత్తవారికి చాన్స్.. ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా వారి పేర్లను కూడా జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఆ జాబితాపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో నిలపాల్సిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన పార్టీ మొదట 10 స్థానాలకు, తర్వాత ఒకట్రెండు రోజులకు మిగతా స్థానా లకు పోటీలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా, సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కూడా ఆ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ తన పోటీ యోచనను విరమించుకున్నట్లు తెలిసింది. దానిపైనా శనివారం స్పష్టత రానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కనుక పోటీ చేయాలని ఆదేశిస్తే లక్ష్మణ్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీలో నిలిచే అవకాశముంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు.. ►సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి/బండారు దత్తాత్రేయ/లక్ష్మణ్ ►నాగర్‌కర్నూల్: బంగారు శ్రుతి ►మహబూబ్‌నగర్: శాంతకుమార్/కొత్తవారికి అవకాశం ►చేవెళ్ల: జనార్దన్‌రెడ్డి/యోగానంద్ ►జహీరాబాద్: సోమాయప్ప ►నిజామాబాద్: ధర్మపురి అరవింద్/సదానందరెడ్డి ►కరీంనగర్: దుగ్యాల ప్రదీప్‌రావు/బండి సంజయ్/రామకృష్ణారెడ్డి ►పెద్దపల్లి: కాసిపేట లింగయ్య/ఎస్.కుమార్ ►ఆదిలాబాద్: రేష్మారాథోడ్/కొత్తవారికి అవకాశం ►వరంగల్: చింతా సాంబమూర్తి /బాబుమోహన్ ►మహబూబాబాద్: హుస్సేన్ నాయక్/చందా లింగయ్య దొర ►భువనగిరి: డాక్టర్ అనిల్/శ్యాంసుందర్ ►నల్లగొండ: శ్రీధర్/గోలి మధుసూదన్‌రెడ్డి ►హైదరాబాద్: అమర్‌సింగ్ ►మల్కాజిగిరి: రాంచంద్రరావు/ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్/మల్లారెడ్డి ►మెదక్: రఘునందన్‌రావు/రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే/కరుణాకర్‌రెడ్డి ►ఖమ్మం: వాసుదేవ్ -
అన్నింటా పోటీ.. గెలిచేవి ఎన్నో?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థుల ఖరారుపైనా పార్టీ దృష్టి సారించింది. అయితే ఎన్ని స్థానాలు గెలుస్తారన్నదే కమలం పార్టీ శ్రేణులకు ఆందో«ళన కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కస్థానంలోనే గెలిచింది. వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ సైతం కోల్పోయింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై బీజేపీ నేతలు, శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒంటిరిగా పోటీ చేసి సత్తా చాటాలని బీజేపీ భావించింది. పార్టీ బలోపేతం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం పర్యటించారు. తీరా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం కాషాయ పార్టీకి చేదునే మిగిల్చాయి. 2004 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం ఒక్క స్థానానికి పరిమితమైంది. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌పైనా బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేసింది. ఆశావహులు అధికంగానే ఉన్నా.. పార్టీ నుంచి పోటీ చేసేందుకు అశావహులు అధికంగానే ఉన్నారు. అందులో పార్టీ సీనియర్లే ఎక్కువ మంది టికెట్లను ఆశిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వారిలో పార్టీ అధ్య క్షుడు లక్ష్మణ్ సహా ముఖ్య నేతలంతా ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పోటీ చేయా లని భావిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి షెహజాదీ ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మ పురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బానాల లక్ష్మారెడ్డి ఉన్నారు. తనకు సికింద్రాబాద్‌లో టికెట్ ఇవ్వకపోతే చేవెళ్ల నుంచి ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది. భువనగిరి నుంచి పీవీ శ్యాం సుందర్, మహబూబ్‌నగర్ నుంచి శాంతికుమార్, నాగర్‌కర్నూల్ నుంచి బంగారు శృతి, రజినిరెడ్డి, మెదక్ నుంచి రఘునందన్‌రావు, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, జైపాల్ యాదవ్; పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, కాశిపేట లింగయ్య; నల్లగొండ నుంచి గోలి మధుసూదన్‌రెడ్డి, పాదూరి కరుణ ఆశిస్తుండగా మరో మూడు స్థానాలనుంచి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 15న అభ్యర్థుల జాబితాతో రండి: అమిత్ షా సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలిచ్చారు. ఈ నెల 15లోపు రాష్ట్ర స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసి జాబితాతో రావాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు అమిత్ షాను సోమవారం ఢిల్లీలోని ఆయ న నివాసంలో కలిశారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసి ఈ నెల 15న తిరిగి రావాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఈ నెల 15న బీజేపీ ఖరారు చేయనుంది. ఈ నెల 14వ తేదీనాడే పార్టీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం కోసం పంపించ నుంది. 14న రాత్రికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ జాబితాను తీసుకెళ్లనున్నారు. 15న పార్లమెంట రీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, ఢిల్లీలోనే ప్రకటించే అవకాశం ఉంది. -
తూటాకు తూటాతోనే సమాధానం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పాకిస్తాన్‌కు తాము తూటాకు తూటాతోనే సమాధానం చెప్పామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే ఉగ్ర వాదానికి తమలా దీటైన సమాధానం చెప్పగలవా అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ఐదు పార్లమెంట్ స్థానాల బీజేపీ క్లస్టర్‌స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి పరాయి దేశానికి వత్తాసు పలికేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో వాయుసేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి తగిన గుణపాఠం చెబితే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు సాక్ష్యాలు అడుగుతున్నారని మండిపడ్డారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌పై పాకిస్తాన్ మీడియా, కాంగ్రెస్ మిత్రపక్షాల మాటల తీరు ఒకేలా ఉందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జవాన్లకు మద్దతివ్వాల్సింది పోయి.. ఆధారాలు అడగడం ఎంత వరకు సమంజసమని షా ప్రశ్నించారు. బీజేపీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు మాత్రమే కాదు, భారత్ కూడా సర్జికల్‌స్ట్రైక్‌లు చేయగలదని నిరూపితమైందన్నారు. పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పామని.. ఇది మోదీ నేతృత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి మిత్ర పక్ష పార్టీలకు జెండా, ఎజెండాలు లేవని, సిద్ధాంతాలను పక్కన బెట్టి రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తమ ఎజెండా ఏమిటో రాహుల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారనే తాము ప్రకటిస్తున్నామని, మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరనేది ఎందుకు ప్రకటించడం లేదని షా ప్రశ్నించారు. రోజుకొకరు ప్రధాని అభ్యర్థి అంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలతో దేశం సురక్షితంగా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా రాలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరునూ అమిత్ షా ఎండగట్టారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. 16+1 అంటున్న కేసీఆర్ ఓ స్థానం రజాకార్ల పార్టీ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబైలలో ఉగ్రమూలాలను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ అసాంఘిక శక్తులను ఏరివేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కేసీఆర్, చంద్రబాబు, రాహుల్‌గాంధీల నుంచి సరైన సమాధానం ఆశించలేమని అన్నారు. ఈ ఎన్నికలు సీఎంను ఎన్నుకునేందుకు కావని, ప్రధానిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 2.45 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని అమిత్ షా వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, తెలంగాణ పార్లమెంట్ ఇన్చార్జి అరవింద్ లింబావలి, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ధర్మపురి అర్వింద్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో గెలుపు అవకాశాలు: లక్ష్మణ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజాంషుగర్స్ పునరుద్ధరణ వంటి హామీల అమలులో కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆయన మండిపడ్డారు. దేశాన్ని పాలించేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ సామర్థ్యం కేవలం మోదీకి మాత్రమే ఉందని ఉద్ఘా టించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 16+1 అంటూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. -
బాబు, కేసీఆర్‌లవి కుటుంబ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన విజయ్ సంకల్ప్ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ వద్ద ఆయన మాట్లాడుతూ.. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా చేయని అభివృద్ధి పనులను బీజేపీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. మోదీ ఈ ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేసేందుకు, కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ‘దేశం కోసం మోదీ–మోదీ కోసం దేశం’అనే నినాదంతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు, అన్నివర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం చేయాతనిచ్చిందన్నారు. ఈ నెలలోనే ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ ఎన్నికల మేనేజ్మెంట్ ఇన్చార్జిగా ప్రదీప్‌కుమార్ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇన్చార్జ్గా ఆర్.ప్రదీప్‌కుమార్‌ను పార్టీ నియమించింది. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. మరోసారి సికింద్రాబాద్ స్థానం నుంచి బీజేపీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తనకు ఈ బాధ్యతను అప్పగించడం పట్ల పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఇది పూర్తిగా అంకెల గారడి బడ్జెట్’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి బడ్జెట్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. ఈ బడ్జెట్లో అంకెలు తప్పా ఏమీ కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ పూర్తిస్థాయి ఆర్థికమంత్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించిన లక్ష్మణ్.. నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ప్రకటించిన 1800 కోట్లు 16 లక్షల మందికి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మాటలకు, బడ్జెట్ లెక్కలకు పొంతన లేదని ఆరోపించారు.‘బడ్జెట్లో ఉపాధి కల్పన ప్రస్తావన లేదు. వయో పరిమితి పెంపు ప్రస్తావన లేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం కొన్ని తాయిలాలు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తోంది. సంక్షేమానికి, అభివృద్ధికి పొంతన లేదు. కొత్త జిల్లాలకు కనీస సౌకర్యాలు లేవు. కేవలం మద్యం రూపంలోనే ఆదాయం పెంచుకోవడం పద్దతి కాదు. ఇది పూర్తిగా అంకెల గారడి బడ్జెట్. బీజేపీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. సన్నహక సాధస్సులు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన నిజామాబాద్ లో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. మార్చి 2న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. మార్చి 2నుండి గడప, గడప కు వెళ్లే కార్యక్రమాన్ని ఉదృతం చేస్తాం’ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ( ఇక్కడ చదవండి: సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది: కేసీఆర్) -
‘దేశభక్తులకు, స్వార్థపరులకు మధ్యే పోటీ’
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ దేశ భక్తులకు, స్వార్థపరులకు, నీతిమంతులకు, అవినీతి పరులకు మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారని పేర్కొ న్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో శివసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, ఇతర కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తామని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సీఎంను ఎన్నుకోవ డానిౖకైతే, లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నికోవడానికి అయినందునా ప్రధాని నరేంద్రమోదీని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచినా కేసీఆర్ ప్రధాని కాలేరని, ఇది తెలంగాణ ప్రజలకు తెలుసని చెప్పారు. కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పిదం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రావడాన్ని, మోదీ ప్రధాని కావడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజస్థాన్ మాజీ ఎంపీ రామ్ స్వరూప్ కోలి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, మీడియా కన్వీనర్ వి.సుధాకర్‌శర్మ, నగర ప్రధానకార్యదర్శి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ‘కాళేశ్వరానికి మరిన్ని నిధులు ఇవ్వండి’ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు ప్రధానం అయినందున కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిం చాలని, అధిక నిధులను కేటాయించేలా చర్యలు చేపట్టాలని 15వ ఆర్థిక సంఘాన్ని బీజేపీ కోరనుంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, అధికార ప్రతినిధి ఎ.రాకేష్‌రెడ్డి బృందం ఈ నెల 18న హైదరాబాద్‌లో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, సంఘం ప్రతినిధులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించను న్నారు. అలాగే మిషన్ కాకతీయకు కూడా అధిక ని«ధులను కేటాయించేలా చూడాలని కోరనున్నారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే కాకుండా దేశానికే రెండో రాజధాని స్థాయి కలిగిన నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో పట్టణాలకు ఎక్కువ వలసలు ఉన్నందున గ్రామీణాభివృద్ధికి అధిక నిధులను కేటాయించాలని కోరనున్నారు. మరోవైపు తెలంగాణలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎఫ్ఆర్బీఎం యాక్ట్‌కు విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న తీరును ఆర్థిక ప్రతినిధులకు తెలియజేయనున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో అంకెల గారడి చేస్తోందని, వాస్తవంగా లోటు బడ్జెట్ ఉన్నా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చూపుతోందని వివరించాలని నిర్ణయించారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 70 శాతమే ఖర్చు చేస్తోందని, 14వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించిందని, గ్రామ పంచాయతీల నిధులను మళ్లించడం సరికాదని తెలియజేయనున్నారు. కేంద్ర పథకాల అమలు, భూసార పరీక్షలు, ఫసల్ బీమా యోజన పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదని, వీటన్నింటిని సీరియస్‌గా తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని కోరనున్నారు. -
‘అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సమూలంగా మార్పులు తెస్తూ.. అవినీతి రహిత సమాజ నిర్మాణం చెయ్యడమే బీజేపీ లక్ష్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. సమాజంలో ఆర్థిక అంతరాలు లేకుండా రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల పారదర్శకత పెరిగిందన్నారు. పేదల భవిష్యత్ కోసం ప్రజలు తాత్కాలిక కష్టాలను పట్టించుకోలేదని తెలిపారు. జీడీపీలో పెరుగుదల, ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగిందన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌తో పన్నుల్లో సమూల మార్పులు తెచ్చారని వెల్లడించారు. వ్యవసాయం లాభసాటి చేసేందుకు, రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యడం కోసం.. విద్యుత్ సమస్య లేకుండా, యూరియా సమస్య లేకుండా, ఎరువుల కొరత లేకుండా చేశారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు వెంటనే ఇవ్వడం, కృషి సించాయ్ యోజన కింద వేల కోట్ల డబ్బులు ఇవ్వటం, పెట్టుబడి సాయం కింద 6000 రూపాయలు డబ్బులు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. దీని వల్ల తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది రైతులు లాభపడ్దారని తెలిపారు. పీఎం శ్రమయోగి ద్వారా 60 ఏళ్లు నిండిన వారికి నెలకు 3000 రూపాయల పెన్షన్ వచ్చే పథకం గొప్ప విషయమన్నారు. దేశ రక్షణ కొరకు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడం సాహసమన్నారు. పేదల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిన ఘనత నరేంద్ర మోదీదేనని నొక్కిఒక్కానించారు. టాయిలెట్స్ కట్టడం విప్లవాత్మక నిర్ణయమన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్యం చేకూరుతోందన్నారు. కానీ తెలంగాణ అందులో చేరకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల బొగ్గు నిక్షేపాలు పెరిగాయని తెలిపారు. కోట్లాది మంది హిందువులకు కామధేను పథకం పెట్టడం మంచి విషయంగా పేర్కొన్నారు. మోదీ బడ్జెట్, ఈబీసీ రిసర్వేషన్‌పై జిల్లాలు, మండలాల వారీగా అభినందన సభ పెడుతామని చెప్పారు. బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజల తరపున మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు బంధు పథకానికి, కేంద్ర పథకానికి తేడా ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చెయ్యండని, ఎందుకు ఈబీసీ అమలు చేయటం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
మరోసారి మోదీ.. మరోసారి బీజేపీ: లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా మరోసారి మోదీ, మరోసారి బీజేపీ నినాదంలో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం ముగిశాయి. దీనికి హాజరైన లక్ష్మణ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో గత ఐదేళ్లపాటు అవినీతిరహిత పాలన అందించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని స్వాతంత్య్రం అనంతరం జరిగిన దేశ అభివృద్ధిని పోల్చి చూడమని ప్రజల్ని కోరతామన్నారు. ‘మేరా బూత్ మజ్బూత్’ పేరుతో బూత్ స్థాయిలో పార్టీని గెలిపించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఆ దిశగా సమావేశంలో ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రధాన సేవకుడిగా ఉన్న తనను ప్రజలు మళ్లీ దీవిస్తారన్న విశ్వాసంతో మోదీ ఉన్నారని చెప్పారు. కేంద్రం ఏపీకి సాయం చేయట్లేదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. -
పార్లమెంటు ఎన్నికల్లో సెంటిమెంట్ ఉండదు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో సెంటిమెంటు పనిచేయదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలను ప్రజలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారని వివరించారు. శనివారం ముషీరాబాద్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినట్లేనని ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పిందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అయిపోతున్నాయని, టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీ బీజేపీయేనని జోస్యం చెప్పారు. వచ్చేనెల 11న ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలపై జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. అమిత్‌షా అధ్యక్షతన జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాల అనంతరం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. -
సోనియా క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఓట్లు, సీట్లు దండుకునేందుకే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తల్లి, బిడ్డా సెం టిమెంట్‌ను లేవనెత్తారు తప్ప తెలంగాణ ప్రజలపై కొంచెం కూడా ప్రేమ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. సోనియా చేసిన తప్పులకు చెంపలేసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పా లన్నారు. శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో ఓయూ రీసెర్చ్ స్కాలర్ వసంత తదితరులు లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర కు బయలుదేరినట్లే సోనియా, రాహుల్‌లు రాష్ట్రంలో ప్రచారానికి బయలుదేరారని, వారి ఉపన్యాసాలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రెండు పార్టీలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు కాంగ్రెస్, టీఆర్ఎస్లు మజ్లిస్ నాయకుల చేతిలో కీలుబొమ్మలని, మజ్లిస్‌కు కేసీఆర్ జీహుజూర్ అంటు న్నారని లక్ష్మణ్ ఆరోపించారు. మజ్లిస్‌కు ధైర్యం ఉంటే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు పోటీ చేయ డం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్తో కుమ్మక్కవడం వల్లే ఎం ఐఎం కొన్ని సీట్లకే పరిమితమైందని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రజలు ఈ ఎన్నికల్లో గుణ పాఠం చెబుతారన్నారు. కేసీఆర్ మాటలు వింటుంటే టీఆర్ఎస్ ఓడిపోతుందని అర్థమవుతుం దని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర‡నాయకులు సదానంద్ ముదిరాజ్, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ ముమ్మరంగా ప్రచారం
-
టీఆర్ఎస్ పార్టీని మళ్లీ ఎందుకు గెలిపించాలి
-
తెలంగాణలో కొత్త విధానాలతో ముందుకెళ్తున్న బీజేపీ
-
రాహుల్ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు
-
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూస్తాం
-
కత్తి మహేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు?
సాక్షి, భూపాలపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతును రాజును చేసిన ఘనత మోదీకి దక్కిందని, మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు జై జవాన్, జై కిసాన్ అనేవి నినాదాలుగా ఉండేవి కానీ నేడు వాటిని గొప్పగా కీర్తించిన వ్యక్తి మోదీ అని తెలిపారు. 70 ఏళ్లుగా రైతుల పేరుతో ఓట్లు దండుకున్నారని, బీజేపీ రైతుల మొహంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటోందని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తే, బీజేపీ ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల వరకు లాభాలు వచ్చేలా చేసిందని తెలిపారు. శ్రీరాముడుపై కత్తి మహేష్ కించపరిచే వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం మతం, కులం కోణంలో చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించైనా రాముడిపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వంరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వరంగల్ నడిబొడ్డున బాణసంచా అక్రమంగా తయారు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రభుత్వం తన శాఖల పనితీరుపై పట్టు కోల్పోయినట్లు తెలుస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం అందిచాలని కోరారు. సింగరేణి కార్మికులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావులు పాల్గొన్నారు. -
రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం అసువులు బాసిన బీజేపీ కార్యకర్త మైసయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి అమరుడైతే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కమీషన్ కోసమే మిషన్ కాకతీయ, భగీరథ చేపట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్, ఆయన మంత్రులు ఉస్మానియాలో అడుగుపెట్టాలంటే వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శవాలతో రాజకీయాలు రకం అంటూ లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. భారత దేశాన్ని తమ కుటుంబమే ఏలాలని నెహ్రూ కుటుంబం చూస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మోడీని చూసి ఓర్వలేక పోతోందని, కావాలనే ప్రధాని కులం, తినే ఆహారం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోడీ విజయాల జైత్రయాత్ర సాగితే తమ ఉనికి పోతోందని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు బయపడుతున్నాయని విమర్శించారు. ఫ్లోరైడ్ బాధితులు ఇబ్బందిపడున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని, ఫ్లోరైడ్ నిర్మూలణకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం 350 కోట్లు ఇస్టే వాటిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ, ఒక్క టీచర్ నియామకాలను చేపట్టలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదంటే మహిళలపై ఉన్న గౌరవం ఎంటో అర్థం అవుతోందన్నారు. సుకన్య సంవృద్ధి యోజన కింద కోట్ల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. తల్లి పడ్డ కష్టాలు చూసిన మోదీ ఏ మహిళా కష్టాలు పడకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. జనచైతన్య యాత్ర టీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 350 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో మొక్కల పెంపకానికి ఇచ్చిన 47 కోట్ల రూపాయలు ఏమయ్యాయని లక్ష్మణ్ నిలదీశారు. ఎన్నికల కోసమే రైతు బంధు పథకం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదని, ఊరు ఉరా బార్లు తెరిచి ఆదాయం పొందుతున్నారని దయ్యబట్టారు. జిల్లాకు ఇచ్చిన 543 కోట్ల రూపాయలు లెక్కలేకుండా పోయాయని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమన్న లక్ష్మణ్, అధికారంలోకి వస్తే రైతులకు రూ 2లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరైతుకు చితంగా బోర్లు వేయిస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీని కూడా బీజేపీ కడుతుందని అన్నారు. -
బీసీ విద్యార్థులకు అన్యాయం: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దాటవేసే దోరణి అవలింబించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఫీజు బకాయిలు పెరిగిపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదని అన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా తమ సిబ్బందికి జీతాలను ఇచ్చే పరిస్థితులు లేవని తెలిపారు. తక్షణమే ఫీజు బకాయిలను చెల్లించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
బీజేపీలోకి సరైన సమయంలో చేరికలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బూత్ స్థాయి నుంచి బలోపేతమవుతున్న బీజేపీలోకి సరైన సమయంలో భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, చాలా మంది ప్రముఖలు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, ఆ పార్టీ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం వల్ల ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తి టీఆర్ఎస్ పతనానికి నాంది అవుతాయని విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా మని, 10 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చేప ట్టిన ఆందోళనల గురించి నివేదిక అందించినట్టు చెప్పారు. 23 వేల పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత అమిత్ షా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ పర్యటిస్తారని తెలిపారు. జనవరి–ఫిబ్రవరి నెలల్లో లక్ష మందితో తెలంగాణలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర జల వనరుల సంఘం సలహాదారు శ్రీరాం వెదిరె, పార్టీ సమన్వయ కర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ ఎంపీ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయ్’
హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ కార్యాలయం పై మానవ బాంబుదాడి విషయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. టాస్క్‌ఫోర్స్ కేసులో ఒకలాగా, మాలేగావ్ దాడుల మీద మరోలాగా మాట్లాడటం పై ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఉండాలని సూచించారు. ఇస్లాం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ అమలులో లేదు.. కానీ ఓవైసీ తలాక్‌కు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. మతం రంగు పులమడం మంచిది కాదన్నారు. తలాక్‌పై సుప్రీం కోర్టు తీర్పు పౌరుల హక్కు కాపాడే తీర్పు ఇది.. అందరూ శిరసా వహించాలన్నారు. సుప్రీమ్ తీర్పును రాష్ట్ర బీజేపీ స్వాగతిస్తోందన్నారు. ఇది ఎవరి విజయమో.. అపజయమో కాదనీ, ముస్లిం మహిళల ఆత్మ గౌరవం, స్వాలంబనకు సంబంధించినదన్నారు. ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలకు పెద్ద ఊరట లభించిందని ఆయన అన్నారు. ఇప్పిటికైనా సంస్థలు, పార్టీలు పేద ముస్లిం మహిళలకు అండగా ఉండాలి. తీర్పు ప్రచారం చేయాలని కె. లక్ష్మణ్ సూచించారు. -
వెంకయ్యనాయుడు జీవితం తెరచిన పుస్తకం
హైదరాబాద్‌సిటీ: కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌పై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంకయ్య నాయుడుపై జైరాం రమేష్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ ఆరోపణలు చేయడం చూస్తే కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనంగా ఉన్నాయని విమర్శించారు. వెంకయ్య నాయుడు జీవితం తెరిచిన పుస్తకమని, సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన తెలుగు వారి ఆత్మస్తైర్యం దెబ్బ తీయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్చంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటిగా ఉన్నదని, జైరాం రమేష్ ఇలాంటి ఆరోపణలు చేయడం దొంగే దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. పంచ భూతాలను సైతం దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి తెలుగు ప్రజలకు మేలు చేయక పోగా నష్టం చేసిన వ్యక్తి జైరాం రమేష్ అని తూర్పారబట్టారు. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజలు అవకాశం ఇవ్వక పోయినా కాంగ్రెస్‌కు బుద్ది రాలేదని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను ప్రజలు తరిమి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. -
మోదీ పాలనతో కలలు సాకారం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి నేతల కలలను సాకారం చేసేలా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపా లన కొనసాగుతోందని, దేశాభిమానుల త్యాగాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేస్తే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలకు పాల్పడుతు న్నారన్నారు. దేశంకోసం జీవితాన్ని త్యాగం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ కలలను సాకారం చేయడానికి బీజేపీ కట్టుబడి పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతీరోజూ ఎన్నో కుంభకోణాలు, అవినీతి, బంధుప్రీతి ఉండేదని.. బీజేపీ మూడేళ్ల పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో కూడిన నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, పార్టీ నేతలు బద్దం బాల్‌రెడ్డి, దాసరి మల్లేశం, కొల్లి మాధవి పాల్గొన్నారు. -
'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావ్యవస్థపై టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీల నియామకం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలకు కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల వీసీలను నియమించింది. అయితే నియామకాలను హైకోర్టు గురువారం కోట్టివేసింది. -
'తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తాం'
హైదరాబాద్ : బీజేపీ అన్ని వర్గాల పార్టీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... అసోం లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ హోదా రావాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాంట్రాక్టర్ల కోసమే డిజైన్ మార్చలేదా.. అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. -
'కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో కరవును నివారించేందుకు కేంద్రం నిధులను ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశంలో మహారాష్ట్ర సర్కార్‌ను చూసి నేర్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో కరవుపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ మాట్లాడుతూ... కరవుతో రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. కేంద్రం ముందు కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
'బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది'
కనీసం 10 ఏళ్లపాటు దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. దేశం నలుమూలలా బీజేపీ ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని ఆయన ఆరోపించారు. ఎస్సీలు, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శించారు. కానీ త్వరలోనే వారు కూడా బీజేపీకి దగ్గర అవుతారన్నారు. బీజేపీలోనే ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రజా ప్రతినిధులు సంఖ్య అధికంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరడానికి కృషి చేయాలని కార్యకర్తలకు వెంకయ్య పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండే పార్టీనే వాళ్లు ఆదరిస్తారని చెప్పారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నదని దానిని వాడుకోవాలి అని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి... సమర్ధుడు కె. లక్ష్మణ్ బాగా పని చేస్తాడని కితాబు ఇచ్చారు. తెలంగాణ లో అన్ని వర్గాలను కలుపుకోగల నేర్పు లక్ష్మణ్ లో ఉందన్నారు. వార్తల కోసం , కాదు గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరాలి అని వారిని కోరారు. పేద ప్రజలకు ప్రధాని మోదీ ఓ ఆశా జ్యోతి అని అభివర్ణించారు. ప్రత్యర్ధులు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కరపత్రం ప్రతీ ఇంటికి వెళ్ళాలని అన్నారు. దేశం ముందుకెళ్లాలని బీజేపీ కోరుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో నైట్ హాల్ట్ చెయ్యాలని నాయకులు, కార్యకర్తలకు హితువు పలికారు. హైదరాబాద్ వదలండి. గ్రామాల్లోని ప్రజలతో మమేకం అయితే బీజేపీని వాళ్లే ఆదరిస్తారన్నారు. ఉత్తరాఖండ్‌లో మెజారిటీ శాసన సభలో నిరూపించుకోవాలి. 356 ఆర్టికల్ , ఫైనాన్స్ బిల్ పాస్ అవ్వాలి రాజ్యాంగ సంక్షోభం ఉంది కాబట్టే ఆగామన్నారు. అసీంబ్లీ రద్దు కాలేదు, బల నిరూపణ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓటింగ్ కాకముందే తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఓటింగ్ జరగలేదు, జరిగింది అని రెండు మాటలు ఎలా వస్తాయి. హిందూ , ముస్లిం , క్రిస్టియాన్స్ అందరు భారతదేశ ప్రజలే, పౌరులే అని అన్నారు. మోడీ అధికారం లో ఉన్నాడు కాబట్టే రాహుల్ హెచ్‌సీయూకి వచ్చాడు. రోహిత్ వేముల విషయంలో దత్తాత్రేయ తప్పేం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. -
నీటి కరువుకు పరిష్కారం: కె.లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పం దంతో తెలంగాణలో నీటి కరువుకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కేంద్రం, ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించలేదన్నారు. కానీ తమ నేతల కృషి వల్లే తాజా ఒప్పందం సాకారమైందన్నారు. ఈ ఒప్పం దంలో కేంద్ర మంత్రులు హన్స్‌రాజ్ అహిర్, బండారు దత్తాత్రేయ కీలకపాత్ర పోషించారన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి నదుల అనుసంధానం కలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేనందున ఈ ప్రాజెక్టులు జల రవాణాకు ఉపయోగపడేలా చూడాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ను కోరినట్లు చెప్పారు. ఫడ్నవీస్‌ను కలసిన 13 మంది నేతల్లో ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ జాతీయ నేత వెదిరె శ్రీరాం, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ తదితరులున్నారు. -
'టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ నడిపిస్తోంది'
-
'టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ నడిపిస్తోంది'
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే నైతిక అర్హత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... మజ్లిస్‌ను ఒప్పించడానికే ఒవైసీ కనుసన్నల్లో ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కుమ్మక్కై దొడ్డిదారిన హైదరాబాద్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ఏడాదిన్నరగా టీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ను మజ్లిస్ నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 60 వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని... ఆ కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీని పిలవలేదని కె.లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రులు ఎన్నికలు, ఉప ఎన్నికలు కోసమే తప్ప పరిపాలన చేసేందుకు కాదని కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు కొనసాగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో సీట్లు పంచుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 12వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జేపీ నద్దా, దత్తాత్రేయ హాజరవుతారని వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య హైదరాబాద్ నగరంలో నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తామని... ఈ సభలకు కేంద్రమంత్రులు హాజరవుతారన్నారు. జనవరి 28,29,30 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారని లక్ష్మణ్ చెప్పారు. సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
'లెక్కలు కూడా కల్తీనే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమేనా అని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు బీజేపీ శాసనసభ పక్షం నేత డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు, పార్టీ ఫిరాయింపులు, అణిచివేతలతో కేసీఆర్ పాలన ఈ ఏడాది సాగిందని విమర్శించారు. కల్తీ కల్లు, కల్తీ నూనె, కల్తీ తినుంబండారాలతో సహా రైతుల ఆత్మహత్యలపై, అమరుల ప్రాణత్యాగాలపైనా కేసీఆర్ ప్రభుత్వం కల్తీ లెక్కలు చెబుతున్నదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
'మాటల గారడీతో ప్రభుత్వం నడుస్తోంది'
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బడ్జెట్లో కనబడకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ బీజేఎల్పీ నేత డా.లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం హైదరాబాద్‌లో డా.కె.లక్ష్మణ్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాటల గారడీతో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఆలోచించాలని ఈ సందర్భంగా కె.లక్ష్మణ్... టీఆర్ఎస్ పార్టీకి సూచించారు. -
'ఇది చేతల ప్రభుత్వం కాదు... కోతల ప్రభుత్వం'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి చిన్న విషయానికి కేంద్రాన్ని నిందించడం సరికాదని బీజేఎల్పీ నేత డా. కె.లక్ష్మణ్ ఆదివారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. గతంలో తెలంగాణ అభివృద్ధి కోసం అఖిలపక్షాన్ని సంప్రదిస్తానని చెప్పిన కేసీఆర్... ఆ విషయాన్ని ఎందుకు మరిచిపోయారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇది చేతల ప్రభుత్వం కాదని... కోతల ప్రభుత్వమని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వివిధ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోరత తీర్చే క్రమంలో ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో మాట్లాడేందుకు 4 నెలలు సమయం కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చొరవతోనే ఎయిమ్స్, హార్టికల్చర్, ట్రైబల్ యూనివర్శిటీలు వచ్చాయన్న సంగతి విస్మరించరాదని కేసీఆర్‌కు లక్షణ్ హితవు పలికారు.