'మాటల గారడీతో ప్రభుత్వం నడుస్తోంది' | BJP MLA K Lakshman meeting with party MLAs | Sakshi
Sakshi News home page

'మాటల గారడీతో ప్రభుత్వం నడుస్తోంది'

Published Tue, Mar 3 2015 6:09 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

BJP MLA K Lakshman meeting  with party MLAs

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బడ్జెట్లో కనబడకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ బీజేఎల్పీ నేత డా.లక్ష్మణ్ హెచ్చరించారు.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం హైదరాబాద్లో డా.కె.లక్ష్మణ్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాటల గారడీతో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఆలోచించాలని ఈ సందర్భంగా కె.లక్ష్మణ్... టీఆర్ఎస్ పార్టీకి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement