మోదీ పాలనతో కలలు సాకారం: లక్ష్మణ్‌ | K Lakshman about Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ పాలనతో కలలు సాకారం: లక్ష్మణ్‌

Published Sat, Jun 24 2017 1:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మోదీ పాలనతో కలలు సాకారం: లక్ష్మణ్‌ - Sakshi

మోదీ పాలనతో కలలు సాకారం: లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వంటి నేతల కలలను సాకారం చేసేలా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపా లన కొనసాగుతోందని, దేశాభిమానుల త్యాగాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన పాకిస్తాన్‌ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేస్తే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలకు పాల్పడుతు న్నారన్నారు.

దేశంకోసం జీవితాన్ని త్యాగం చేసిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కలలను సాకారం చేయడానికి బీజేపీ కట్టుబడి పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతీరోజూ ఎన్నో కుంభకోణాలు, అవినీతి, బంధుప్రీతి ఉండేదని.. బీజేపీ మూడేళ్ల పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో కూడిన నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, పార్టీ నేతలు బద్దం బాల్‌రెడ్డి, దాసరి మల్లేశం, కొల్లి మాధవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement