
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో మోదీ ప్రభుత్వ నిజాయతీ మరోసారి నిరూపితమైందని వెల్లడించారు. ప్రధాని మోదీపై ఆరోపణలు చేసినందుకుగానూ రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ శనివారం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ ఆరోపణలను ప్రజలు నమ్మలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టినా ఆ పారీ్టకి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనమండలి పక్షనేత ఎన్.రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment