
'లెక్కలు కూడా కల్తీనే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమేనా అని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు బీజేపీ శాసనసభ పక్షం నేత డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కుట్రలు, కుతంత్రాలు, పార్టీ ఫిరాయింపులు, అణిచివేతలతో కేసీఆర్ పాలన ఈ ఏడాది సాగిందని విమర్శించారు. కల్తీ కల్లు, కల్తీ నూనె, కల్తీ తినుంబండారాలతో సహా రైతుల ఆత్మహత్యలపై, అమరుల ప్రాణత్యాగాలపైనా కేసీఆర్ ప్రభుత్వం కల్తీ లెక్కలు చెబుతున్నదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.