
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నది బీజేపీపై యుద్ధభేరి కాదని దేశ ప్రజాస్వామ్యంపై దాడి అని, దీనిని భారత సమాజం తిప్పికొడుతుందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు సీఎంకు ఓవైసీ తెలపగా, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని సీఎం కోరడం దురదృష్టకరమన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ జన వరి 30న హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’అన్న నినా దంతో సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని, సీఎం స్థాయి వ్యక్తి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ందుకు ప్రయత్నించడం సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment