
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని గుడి, మసీదు కూల్చివేత పట్ల విచారం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ జారీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అలాగే సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యునైటెడ్ ముస్లిం ఫోరం సైతం ఓ ప్రకటన జారీ చేసింది.