సోనియా క్షమాపణ చెప్పాలి | Congress, TRS, Majlis are birds of same feather | Sakshi
Sakshi News home page

సోనియా క్షమాపణ చెప్పాలి

Published Sun, Nov 25 2018 5:56 AM | Last Updated on Sun, Nov 25 2018 5:56 AM

Congress, TRS, Majlis are birds of same feather - Sakshi

వసంతను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓట్లు, సీట్లు దండుకునేందుకే యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తల్లి, బిడ్డా సెం టిమెంట్‌ను లేవనెత్తారు తప్ప తెలంగాణ ప్రజలపై కొంచెం కూడా ప్రేమ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. సోనియా చేసిన తప్పులకు చెంపలేసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పా లన్నారు. శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ వసంత తదితరులు లక్ష్మణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర కు బయలుదేరినట్లే సోనియా, రాహుల్‌లు రాష్ట్రంలో ప్రచారానికి బయలుదేరారని, వారి ఉపన్యాసాలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.  

రెండు పార్టీలు మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మలు
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మజ్లిస్‌ నాయకుల చేతిలో కీలుబొమ్మలని, మజ్లిస్‌కు కేసీఆర్‌ జీహుజూర్‌ అంటు న్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. మజ్లిస్‌కు ధైర్యం ఉంటే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు పోటీ చేయ డం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కవడం వల్లే ఎం ఐఎం కొన్ని సీట్లకే పరిమితమైందని విమర్శించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రజలు ఈ ఎన్నికల్లో గుణ పాఠం చెబుతారన్నారు. కేసీఆర్‌ మాటలు వింటుంటే టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని అర్థమవుతుం దని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర‡నాయకులు సదానంద్‌ ముదిరాజ్, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement