సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ దేశ భక్తులకు, స్వార్థపరులకు, నీతిమంతులకు, అవినీతి పరులకు మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారని పేర్కొ న్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో శివసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, ఇతర కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తామని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సీఎంను ఎన్నుకోవ డానిౖకైతే, లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నికోవడానికి అయినందునా ప్రధాని నరేంద్రమోదీని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలిచినా కేసీఆర్ ప్రధాని కాలేరని, ఇది తెలంగాణ ప్రజలకు తెలుసని చెప్పారు. కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పిదం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రావడాన్ని, మోదీ ప్రధాని కావడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజస్థాన్ మాజీ ఎంపీ రామ్ స్వరూప్ కోలి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, మీడియా కన్వీనర్ వి.సుధాకర్‌శర్మ, నగర ప్రధానకార్యదర్శి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
‘కాళేశ్వరానికి మరిన్ని నిధులు ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు ప్రధానం అయినందున కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిం చాలని, అధిక నిధులను కేటాయించేలా చర్యలు చేపట్టాలని 15వ ఆర్థిక సంఘాన్ని బీజేపీ కోరనుంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, అధికార ప్రతినిధి ఎ.రాకేష్‌రెడ్డి బృందం ఈ నెల 18న హైదరాబాద్‌లో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్, సంఘం ప్రతినిధులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించను న్నారు. అలాగే మిషన్ కాకతీయకు కూడా అధిక ని«ధులను కేటాయించేలా చూడాలని కోరనున్నారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే కాకుండా దేశానికే రెండో రాజధాని స్థాయి కలిగిన నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
రాష్ట్రంలో పట్టణాలకు ఎక్కువ వలసలు ఉన్నందున గ్రామీణాభివృద్ధికి అధిక నిధులను కేటాయించాలని కోరనున్నారు. మరోవైపు తెలంగాణలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌కు విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న తీరును ఆర్థిక ప్రతినిధులకు తెలియజేయనున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌లో అంకెల గారడి చేస్తోందని, వాస్తవంగా లోటు బడ్జెట్ ఉన్నా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చూపుతోందని వివరించాలని నిర్ణయించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో 70 శాతమే ఖర్చు చేస్తోందని, 14వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించిందని, గ్రామ పంచాయతీల నిధులను మళ్లించడం సరికాదని తెలియజేయనున్నారు. కేంద్ర పథకాల అమలు, భూసార పరీక్షలు, ఫసల్ బీమా యోజన పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదని, వీటన్నింటిని సీరియస్‌గా తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని కోరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment