సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం సాయంత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలోపార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ అధికార ప్రతినిధి సుధంషు త్రివేది వీరేందర్ గౌడ్‌కు కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. వీరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వీరేందర్ గౌడ్ సోదరుడు విజయేందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ చేరికను వాయిదా వేసుకున్నట్టు సమాచారం.
టీఆర్‌ఎస్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్‌ఎస్ అధికార దురి్వనియోగానికి పాల్పడు తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, మాజీ ఎంపీ వివేక్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
బీజేపీలోకి వీరేందర్ గౌడ్
Published Fri, Oct 4 2019 5:08 AM | Last Updated on Fri, Oct 4 2019 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment