rammadhav
-
చంద్రబాబు బీజేపీతో బంధం తెంచుకున్నారు
-
బీజేపీలోకి వీరేందర్ గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం సాయంత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలోపార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ అధికార ప్రతినిధి సుధంషు త్రివేది వీరేందర్ గౌడ్‌కు కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. వీరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వీరేందర్ గౌడ్ సోదరుడు విజయేందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ చేరికను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ అధికార దురి్వనియోగానికి పాల్పడు తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, మాజీ ఎంపీ వివేక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
ఆయన రాజకీయాల్లో ఆల్ రౌండర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. నాయకులుగా అందరూ ఎదుగుతారని, అయితే నాయకుడిగా ఎదిగి సంస్థగా మారిన వ్యక్తి జైట్లీ అని ప్రశంసించారు. అందరికీ అందుబాటులో ఉండే స్వభావం జైట్లీదని, రాజకీయాల్లో హాస్యరసం పూయించడం ఆయన ప్రత్యేకత అని రాంమాధవ్ గుర్తు చేసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో రాంమాధవ్ మాట్లాడుతూ..నెల రోజుల వ్యవధిలోనే పెద్ద నాయకులను బీజేపీ కోల్పోయిందని అన్నారు. జైట్లీ పొలిటికల్ ఆల్ రౌండర్ అని, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో ఉన్నత పదవులు అందుకున్నారన్నారు. ఆయన ప్రతిభ, కష్టపడే తత్వం అత్యంత యోగ్యుడిగా మార్చిందన్నారు. ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను అవలీలగా నిర్వర్తించేవారని ప్రశంసలు కురిపించారు. న్యాయశాఖలోనూ జైట్లీ నిపుణులని, పార్టీలో న్యాయ సలహాలు ఆయనే ఇచ్చేవారన్నారు. అరుణ్ జైట్లీ: క్రికెట్‌తో ఎనలేని అనుబంధం రాత్రి ఒంటి గంట అయినా జైట్లీ బడ్జెట్‌పై కసరత్తు చేసేవారని రాంమాధవ్ గుర్తు చేసుకున్నారు. కశ్మీర్లో పొత్తులపై కూడా అరుణ్ జైట్లీ అభిప్రాయం తీసుకోమని ప్రధాని మోదీ చెప్పేవారన్నారు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో అభిమానం అని, బీజేపీకి జైట్లీ మంచి బ్యాట్స్‌మెన్ అన్నారు. ‘విపక్షాల వికెట్లు తీయడంలో మంచి బౌలర్..సమస్యలను పరిష్కరించడంలో మంచి ఫీల్డర్’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటేనే అధికారం కోసం అని, అయితే మానవీయత కోసం అనే వ్యక్తి జైట్లీ అని రాంమాధవ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
‘తండ్రీకొడుకులు ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయారు’
సాక్షి, నిజామాబాద్ : ముప్పై ఏళ్ల త్యాగాలు, కృషి, ఫలితంగా తెలంగాణలో విజయం సాధించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో సాధించిన బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తండ్రీకొడుకులు ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయారని దుయ్యబట్టారు. పసుపు, ఎర్ర జొన్న రైతులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. తన కూతురు కవిత కోసం సీఎం ఎన్నో పాట్లు పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీ ప్రభంజనం ప్రారంభమైందని, తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలకు చెక్ పెడతామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలమైన శక్తిగా మారుతామని పేర్కొన్నారు. ప్రజల కళ్లలో ఆనందం చూసేందుకే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని తెలిపారు. గత ఐదేళ్లలో కవిత చేయలేని అభివృద్దిని అరవింద్ చేసి చూపిస్తారని, పసుపు రైతుల సమస్యలను త్వరలోనే తీరుస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తు లేదని, భవిష్యత్తులో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ఉద్యోగాలు పెరుగుతున్నాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు. మజ్లిస్ పార్టీతో చేతులు కలిపితే జనం కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. భవిష్యత్తులో గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామన్నారు. నిజామాబాద్‌లో ఇకపై ప్రజల పాలన, కార్యకర్తల పాలన ఉంటుందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం, అహంకారంతో కూడిన పాలనకు పాతర వేస్తామన్నారు. ఈ విజయం తెలంగాణను కైవసం చేసుకునేందుకు నాంది కావాలన్నారు. అవినీతి లేని పాలన అందిస్తామని హామి ఇచ్చారు. -
‘పాక్ పాట పాడుతున్న కాంగ్రెస్ నేతలు’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులపై సందేహాలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలపై పాకిస్తాన్ అంతటా చర్చ జరుగుతోందని, పాక్ మీడియా సైతం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల ప్రకటనలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదంపై పాక్ వైఖరికి అనుకూలంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి సంబంధించి కాంగ్రెస్ నేతల తీరు పాకిస్తాన్ పోస్టర్ బాయ్స్‌లా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాక్ తీరును సమర్ధించేలా దిగ్విజయ్ సింగ్, సిద్ధూ వంటి కాంగ్రెస్ నేతల ప్రకటనలున్నాయని ఆరోపించారు. కాగా, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై పాలక, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో రాంమాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
కేంద్ర బడ్జెట్ ట్రైలర్ మాత్రమే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ జనరంజకంగా ఉందని, ఇదే ఇంత బాగా ఉంటే.. జూలై లో ఉండే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. శనివారం నిజా మాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా పేదలకు పది శాతం రిజర్వేషన్లు అందించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. రూ.5 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు నిర్ణయంతో దేశంలో నాలుగు కోట్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.3 వేల పెన్షన్ పథకంతో సుమారు 30 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ బడ్జెట్లో రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారనే విమర్శలను రాంమాధవ్ ఖండించారు. కేంద్రం రైతులకు రూ.6 వేలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి.. విమర్శించడం తగదన్నారు. రాష్ట్రం ఇచ్చే పెట్టుబడి సాయం తోపాటు, కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రైతులకు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది బంపర్ ఆఫర్ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ప్రశ్నించగా.. ఏపీ ప్రజా ప్రతినిధులకు నిరసన తెలపడం తప్ప వేరే పనిలేదన్నారు. మోదీ భయంతోనే కేసీఆర్ ముందస్తుకు.. ప్రధాని మోదీ హవాలో ఓటమి పాలవుతామనే భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని రాంమాధవ్ విమర్శించారు. మోదీకి దీటైన నాయకులు ఏ పార్టీలో లేరన్నారు. ఫ్రంట్ల పేరుతో విజయవాడ నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. 13న రాష్ట్రానికి అమిత్‌షా.. ఈ నెల 13న నిజామాబాద్‌లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరుకానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. ఫిబ్రవరి 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి బూత్ ఇన్చార్జిల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. -
గల్లిగల్లీలో బీజేపీ జెండా ఎగరాలి
పెర్కిట్(ఆర్మూర్): ఎమ్మెల్యే సీటు గెలవాలంటే ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ నూటికి నూరు శాతం ఓట్లు సాధించాలనే సంకల్పంతో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్స్‌లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశానికి రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో బీజేపీ ప్రభంజనం చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగుర వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సేవాభావంతో పని చేసే వారికే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తుందన్నారు. గత రెండున్నరేళ్లుగా ఆర్మూర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి వినయ్ రెడ్డిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో అవినీతిమయమైన కుటుంబ పాలన సాగుతోందన్నారు. కుటుంబ పాలన ను అంతమొందించడానికి మొదట అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అంతకుముందు బీజే పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభంజనం చూస్తుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్కు నూ కలు చెల్లాయన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల జీవితాలు బాగు పడతాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగా రెడ్డి మాట్లాడుతూ పారదర్శక పాలన కోసం తెలంగాణలో బీజేని అధికారంలోకి తీసుకు రావాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తు తం టీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ గెలవలేని స్థితిలో ఉంటే ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి ఎలా గెలుస్తాడని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న టీఆర్ఎస్ నుం చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మా ట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ని నందిపేట్ మండలంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెజ్‌లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక్క ఫ్యాక్టరీని తీసుకు రాలేక పోయారన్నారు. అలాగే ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన లెదర్ ఫ్యాక్టరీ తెరుచుకోవడం లేదన్నారు. బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గాన్ని స్థానికేతరులే పాలించారని స్థానికుడైన తనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే జన్మనిచ్చిన ఆర్మూర్ రుణం తీర్చుకుంటానన్నారు. ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సొమ్ము ఒకరిది సోకు ఒకరిదిగా మారిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులతో జరిగిన అభివృద్ధిని తమ ఘనతగా చాటుకుంటున్నారన్నారు. కార్య కర్తలు గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఈ సందర్భం గా ఆర్మూర్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్దం లింగా రెడ్డి, భూపతి రెడ్డి, సదానంద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, రాజారం, సుభాష్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్, ద్యాగ ఉదయ్, పూజ నరేందర్, పోల్కం వేణు, అమ్దాపూర్ రాజేశ్, కొంతం మురళీధర్, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కశ్మీర్లో తొలి బీజేపీ సర్కారు?
న్యూఢిల్లీ/శ్రీనగర్: మెహబూబా ముఫ్తీ రాజీనామా తర్వాత కశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్, ప్రధాని మోదీలు బుధవారం ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. నిర్మల్ సింగ్‌తో భేటీకి ముందు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్తోనూ మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీడీపీ రెబల్స్, ఇతర పార్టీల చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కశ్మీర్లో హిందువును సీఎంగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితమే కశ్మీర్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఢిల్లీ, శ్రీనగర్‌లోని బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న విషయం సుస్పష్టమే. రామ్‌మాధవ్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనీతో సమావేశమవడం, తర్వాత లోనే ఢిల్లీకి వచ్చి మోదీతో భేటీ కావడం తెల్సిందే. -
యూపీలో మేం గెలిచి తీరుతాం
‘సాక్షి’టీవీతో బీజేపీ అధికార ప్రతినిధి రాంమాధవ్ న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ‘సాక్షి’టీవీతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి నినాదంతోనే యూపీ ఎన్నికల్లో తమ అజెండా తెలిపారు. రామమందిరం నిర్మాణం విషయంలో బీజేపీపై ఆరోపణలు చేయడం అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం కట్టాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. గోవా, ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదని, నల్లధనాన్ని వెలికితీయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన చెప్పారు. -
దేశ రక్షణలో రాజీలేదు
జాతీయ భద్రతకు మోదీ సర్కారు ప్రాధాన్యం ఓయూ సదస్సులో రాంమాధవ్ హైదరాబాద్: జాతీయ భద్రత, సమగ్రత విషయంలో భారత్ ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, భద్రత విషయంలో ప్రధాని మోదీ గట్టి చర్యలు తీసుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. ‘జాతీయ భద్రతకు సవాళ్లు’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విమర్శలకు తావు లేకుండా కేంద్రంలో మోదీ సమర్థ పాలన అందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలకు కూడా విమర్శించేందుకు ఎటువంటి అంశాలు దొరక్క ‘సూటుబూటు సర్కారు, ఎన్ఆర్ఐ పీఎం’ అంటూ చిన్న పిల్లాడు మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. జమ్మూ-కశ్మీర్లో పీడీపీతో కలసి ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కారు విజయవంతమైతే అక్కడి వేర్పాటువాదుల వెన్ను విరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలకు కేంద్రం సమన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్లతో చర్చలు జరిపిన ఘనత మోదీదేనని, పాక్ ఆక్రమిత కశ్మీర్లో శరణార్థుల పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నది కూడా తమ సర్కారేనని రాంమాధవ్ చెప్పుకొచ్చారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, సరిహద్దు వివాదంపై చైనాతోనూ మోదీ చర్చలు జరిపారని వివరించారు. ప్రజావసరాల మేరకు భూ సేకరణ చట్టాన్ని కేంద్రం సవరిస్తుందని, పదేళ్లలో దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. -
బీజేపీ సత్తా వెనక రాంమాధవ్
జమ్మూకశ్మీర్‌లో కమలం 25 సీట్లు గెలవడంలో కీలకం అత్యధిక ఓట్ల శాతం వెనక తెలుగుతేజం కృషి సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం వెనక తెలుగుతేజం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యూహం పనిచేసిందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి తమ బలాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ పెంచుకుంటూ 25 సీట్లు గెలుపొందడంలో, అత్యధిక ఓట్ల శాతం (23%) సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతోంది. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ర్టంలో బీజేపీ రెండో స్థానంలో నిలవడం ఆషామాషీ విషయం కాదని...పక్కా ప్రణాళికతో పనిచేయడం వల్లే కమలదళం ఈ ఫలితాలు సాధించగలిగిందని అంటోంది. ఇంతకీ రాంమాధవ్ రాష్ట్రంలో అనుసరించిన వ్యూహం ఏమిటంటే... అభివృద్ధి నినాదంతో ముందుకు... జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే వివాదాస్పద ‘ఆర్టికల్ 370’ని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా ఎంచుకోగా రాంమాధవ్ వ్యూహంతో బీజేపీ మాత్రం అభివృద్ధి నినాదాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకొని ప్రజల వద్దకు వెళ్లింది. అభివృద్ధి చుట్టూ ప్రచారం చేపట్టేలా పార్టీ శ్రేణులను రాంమాధవ్ సమాయత్తం చేశారు. ఉగ్రవాదం, హింస కారణంగా అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రం అన్ని రంగాల్లో పుంజుకునేలా చేయడం కేవలం బీజేపీకే సాధ్యమంటూ ప్రచారంలో ఆయన నినదించారు. ‘కుటుంబ పాలన, అవినీతితో మమేకమైన పార్టీలు కావాలా? అభివృద్ధి కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కశ్మీర్లో ఎన్నికలను, రాజకీయాలను పాకిస్తాన్ అంశంతోనే ముడిపెడుతున్నారని, దశాబ్దాలుగా అదే ఎజెండా అయ్యిందని, దాన్ని పక్కనబెట్టి అభివృద్ధి దిశగా నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్ అంశం యావత్ భారత దేశంతో ముడివడి ఉందని, కేవలం ఆ రాష్ట్రంతోనే సంబంధం కలిగి లేదని ఎన్నికలకు ముందు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మాజీ వేర్పాటువాదులతో మంతనాలు... కశ్మీర్ లోయలో బలంగా లేమని గ్రహించిన ఆయన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌లతో విసిగి వేసారిన నేతలతో సంబంధాలు నెరిపి కొత్త సమీకరణలకు తెరతీశారు. గతంలో వేర్పాటువాదాన్ని బలంగా వినిపించిన నేతలతోనూ సంబంధాలు నెరిపారు. మాజీ వేర్పాటువాది, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్ గనీ లోన్ ప్రధాని మోదీని కలవడం వెనక కూడా రాంమాధవ్ ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కశ్మీరీ పండితుల కోసం... కశ్మీరీ పండితులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు రాంమాధవ్ వ్యూహాలు రచించారు. వీరంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కశ్మీరీ పండిట్ సంఘాలన్నీ కృషిచేశాయి. ఈ సంఘాల్లో ప్రేరణ కల్పించింది బీజేపీ వ్యూహమే. కాగా, కశ్మీర్లో వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమైందీ? కేంద్రం ఎలా సాయపడిందీ వివరించడంలోనూ బీజేపీ విజయం సాధించింది. మెరుగైన ఫలితం... రాంమాధవ్ ప్రచార వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జమ్మూకశ్మీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 25 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. 1987లో రెండు సీట్లతో రాష్ర్టంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం 1996లో 8 సీట్లు, 2002లో 11 సీట్లకు చేరి తాజాగా గత ఎన్నికలకన్నా రెట్టింపు సీట్లను సాధించే స్థాయికి ఎదిగింది. అయితే బీజేపీ గెలుచుకున్న సీట్లన్నీ జమ్మూ ప్రాంతం నుంచే కావడం, కశ్మీర్ లోయ, లడఖ్లలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఒక్కటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలాంశంగా నిలిచింది. ఎన్నికల ఫలితంపై రాంమాధవ్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఎన్నికల ఫలితం మిశ్రమ భావాలను మిగిల్చింది. అయితే పార్టీకి ఇదొక గొప్ప విజయం. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా నిలిచాం. రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. -
సీఎంల భేటీతో కేంద్రం భారం తగ్గినట్లే
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగు విషయాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన పరిణామమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కరించుకుంటే కేంద్రం భారం తగ్గినట్టేనన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంల భేటీకి చొరవ చూపిన గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించామని చెప్పారు. ఈ వారంలో తెలంగాణలో జరగనున్న పార్టీ కార్యవర్గసమావేశాలలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటున్నారని చెప్పారు. జాతీయ అధ్యక్షుడి తొలి సమావేశం తెలంగాణ నుంచే మొదలవ్వడం ఆ రాష్ట్రానికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఏపీ, తెలంగాణలో వ్యూహాలపై ఆయా రాష్ట్రకార్యవర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. భగవత్ వ్యాఖ్యలపై అనవసర వివాదం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో వివాదం చేయాల్సిన విషయమేమీలేదని రామ్‌మాధవ్ చెప్పారు. భారతదేశం హిందూ రాజ్యమని ముంబైలో భగవత్ చేసిన వ్యాఖ్యలపై వివరణ అడగ్గా.. ‘‘భారతదేశ సాంస్కృతిక గుర్తింపు కోసం ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచి నిర్దిష్ట అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తోంది. ఇది మతపరమైన గుర్తింపు కాదు. ఇదే విషయాన్ని భగవత్ ముంబైలో చెప్పారు. దీన్ని వివాదం చేయడం గోబెల్ ప్రచారం చేసేవారికి అలవాటు. దుష్ప్రాచారం చేయడంలో వారిది అందెవేసిన చేయి’’ అని విమర్శించారు.