Verendar Goud
-
బీజేపీలోకి వీరేందర్ గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం సాయంత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలోపార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ అధికార ప్రతినిధి సుధంషు త్రివేది వీరేందర్ గౌడ్‌కు కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. వీరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వీరేందర్ గౌడ్ సోదరుడు విజయేందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ చేరికను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ అధికార దురి్వనియోగానికి పాల్పడు తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, మాజీ ఎంపీ వివేక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్ గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, తెలంగాణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు వీరెందర్ గౌడ్ అన్నారు. సుదీర్ఘంగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రసంశించారు. న్యూ ఇండియా చేయాలన్న మోదీ ఆలోచన తనకు బాగా నచ్చిందని, అందుకే బీజేపీలో చేరుతున్నానని వివరించారు. నయా భారత్ రావాలంటే మోదీతోనే సాద్యమన్నారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. మూడు రోజుల క్రితం వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
మాజీ 'హోం' వారసుల ఓటమి....
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కీలక నేతల వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన యువనేతలకు నిరాశే మిగిలింది. తమ కుటుంబ పెద్దలు ప్రజలకు చేసిన మేలు.. యువతలో ఉన్న ఇమేజీపై ఆశలతో ఎన్నికల బరి లోకి దిగినప్పటికీ చేదు అనుభవమే ఎదురైంది. చేవెళ్ల పార్లమెంటు బరిలో దిగిన ఇరువురు వారసులకు ఇదే పరిస్థితి కనిపించింది. రాష్ట్ర హోంమంత్రులుగా పనిచేసి ఇంద్రారెడ్డి, సబితారెడ్డిల కుమారుడు కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రితో పాటు పలు కీలకపదవులు చేపట్టిన తూళ్ల దేవేందర్‌గౌడ్ పెద్ద కుమారుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ టీడీపీ తరపున బరిలోకి దిగారు. పార్టీ క్యాడర్‌తో రంగంలోకి దిగిన ఇరువురు కుటుంబ పెద్దల పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు తమకు గెలుపు ఖాయమని భావించిన ఇరువురికి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో ఘోరపరాజయం ఎదురైంది. మరోవైపు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బండారు లక్ష్మారెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడైన లక్ష్మారెడ్డి.. ఈసారి అన్న రాజిరెడ్డి పోటీనుంచి తప్పుకోడంతో కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. చివరకు బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. -
బాగుంది 'వరుస'...వీరుడెవ్వరో
వారంతా చుట్టాలు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తలో దిక్కు నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీలు వేరయినా వారంతా చుట్టాలే. వివిధ పార్టీల నుంచి టికెట్లు చేజిక్కించుకుని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎవరికి వారుగా జనంలోకి దూసుకు వెళుతున్నారు. మనవాళ్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారని..బంధువులంతా అంచనాలు వేసుకుంటున్నారు. మాజీ హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ చేవెళ్ల లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. హైదరాబాద్ జిల్లా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ పోరులో నిలిచారు. ఇరువురిది బావ, బావమరిది వరుస. తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసిన వీరేందర్‌కు, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్‌కు తాజా ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి. అటు మామ-ఇటు అల్లుడు ఇక తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఇరు పార్టీల నేతలు ఉత్సాహంగా ఎన్నికల్లోకి దిగారు. ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగంలోకి దిగగా... హైదరాబాద్ జిల్లాలో అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంటు నుంచి గంగాపురం కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరిదీ మామ అల్లుడు వరస. ఒకరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా...మరొకరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటం విశేషం.