
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, తెలంగాణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు వీరెందర్ గౌడ్ అన్నారు. సుదీర్ఘంగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రసంశించారు. న్యూ ఇండియా చేయాలన్న మోదీ ఆలోచన తనకు బాగా నచ్చిందని, అందుకే బీజేపీలో చేరుతున్నానని వివరించారు. నయా భారత్ రావాలంటే మోదీతోనే సాద్యమన్నారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. మూడు రోజుల క్రితం వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment