
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. దేశ భద్రత విషయంలో టీఆర్‌ఎస్ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో శనివారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అక్రమ వలసదారులను అరికట్టేందుకు, దేశద్రోహులను గుర్తించి పంపించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారులపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment