
నల్లగొండ టూటౌన్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు భరోసా కల్పించి, వారి సమస్యలు పరిష్కరించాలని తాను శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే పోలీసులతో భగ్నం చేయించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడితే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ఇలాంటి కిరాతక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ కనీ సం స్పందించడం లేదని, కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించార