అహ్మదాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి స్వదేశానికి చేరుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనకు భారీగా కానుకలు, ప్రోత్సహాకాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ పెట్రోల్ బంక్ యజమాని నీరజ్ చోప్రాకు గౌరవం ఇస్తూ ప్రజలకు ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నారు. అయితే ఒక షరతుపై పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించడంతో గుజరాత్‌లోని బరూచ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ యజమాని ఆయూబ్ పఠాన్ ఆనందంలో మునిగిపోయాడు. దీంతో నీరజ్ చోప్రా పేరు ఉన్నవారికి రూ.501 విలువైన పెట్రోల్ ఉచితంగా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ఆ పేరు ఉన్న వ్యక్తులు వచ్చి తమ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి పెట్రోల్ వేసుకువెళ్లవచ్చని తెలిపాడు. దీంతో ఆ రాష్ట్రంలో నీరజ్ పేరు ఉన్నవారందరూ పెట్రోల్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు.
అయితే ఇది రెండు రోజులు మాత్రమేనని ఆయూబ్ తెలిపారు. ఈ రెండు రోజుల కార్యక్రమం నీరజ్‌చోప్రాకు గౌరవంగా ఇస్తున్నాం. నిజమైన నీరజ్ పేరు ఉన్నవారికే పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయూబ్ పఠాన్ స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలో సోమవారం నీరజ్ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. నీరజ్ చోప్రాకు జ్ఞాపికలు అందించి అతడి ప్రతిభపై ప్రశంసలు కురిపించింది. అయితే ఈ ఉచిత పెట్రోల్ ఆఫర్ సోమవారంతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment