సాక్షి, చెన్నై: ‘హీరో సంతానం రియల్ హీరో అయిపోయాడు’: అని హీరో ఆర్య పేర్కొన్నారు. సంతానం నటిస్తున్న తాజా చిత్రం చక్క పోడు పోడు రాజా టీజర్ ఆవిష్కరణ శనివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో ఆర్య, దర్శకుడు రాజేశ్ అతిథులుగా హాజరై మాట్లాడారు. వీటీవీ.ప్రొడక్షన్స్ పతాకంపై వీటీవీ.గణేశ్ నిర్మించిన ఈ చిత్రానికి జీఎల్.సేతురామన్ దర్శకుడు. సంచలన నటుడు శింబు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా వైభవి శాండిల‍్య, వివేక్, సంపత్, వీటీవీ, గణేశ్, రోబోశంకర్, పవర్‌స్టార్, డా.సేతు, సంజనాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ.. సంతానం తనకు మంచి ఫ్రెండ్ అని, తనను మంచి మాస్ హీరోగా చూడాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకడినని అన్నారు. సంతానం ఆత్మవిశ్వాసం, శ్రమనే ఈ స్థాయిలో నిలిపాయన్నారు. చెక్క పోడు పోడు రాజా చిత్రం ద్వారా పక్కా మాస్ హీరోగా తెరపై కనిపించనున్నారని అన్నారు. సంతానంకు ఉదయం కూడా ఫోన్ చేసి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందా, నువ్వు వస్తావా? అని అనుమానంగా అడిగానని ఆయన అన్నారు. ఎందుకంటే అతను రాకుండా ఏదేనా గొడవ జరిగి తానెక్కడ దాక్కుంటానోనన్న భయంతోనే అలా అడిగాననీ హాస్యమాడారు.
శింబుకు ఇంత అభిమానం ఉందనుకోలేదు
హీరో సంతానం మాట్లాడుతూ.. శింబుకు తనంటే అభిమానం అని తెలుసుగానీ, ఇంత అభిమానం ఉందని తెలియదని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి హీరీష జయరాజ్‌ను అడగడానికి వెళ్లామన్నారు. అయితే ఆయన ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో చిత్ర నిర్మాత శింబునే సంగీతం అందించమని ఆడుగుదామన్నారు. అంత పెద్ద హీరో సంగీత దర్శకుడిగా మనకు పని చేస్తారా ? అన్న సందేహిస్తూ అడిగాం. శింబును అడగానే తనకు కొంచెం టైమ్ ఇవ్వండి అని అన్నారన్నారు.
ఆ తరువాత కొద్ది రోజులకే తనకు ఫోన్ చేసి మీ చిత్రానికి సంగీత దర్శకుడెవరక్ష తెలుసా? ఎవరో వాట్సాప్‌లో పంపిస్తున్నాను చూడు అని అన్నారు. తాను వాట్సాప్ చూస్తే శింబు అని ఉందన్నారు. కేవలం తనపై అభిమానంతోనే ఆయన తమ చిత్రానికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించారని చెప్పారు. శింబు నెల రోజుల్లోనే ఆరు పాటలకు బాణీలు కట్టిచ్చారని సంతానం తెలిపారు. ఈ సినిమాలో సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా, అనిరుద్, టీ.రాజేందర్ తదితర ఐదుగురు సంగీతదర్శకులు పాడటం విశేషం అన్నారు. చక్క పోడు పోడు రాజా మంచి వినోదంతో కూడిన ఫుల్ మాస్ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని సంతానం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment