ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్‌ మూవీ.. దాదాపు ఐదేళ్ల తర్వాత! | Star Comedian Santhanam A1 Movie Streaming On This OTT Platform After Five Years, Check Where And How To Watch - Sakshi

Santhanam A1 Movie OTT Release: ఐదేళ్ల తర్వాత తెలుగులో హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Feb 29 2024 8:54 AM | Updated on Feb 29 2024 10:16 AM

Star Comedian Santhanam Movie Streaming On this Ott After Five Years - Sakshi

కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి.  ఇటీవలే హీరోగా వ‌డ‌క్కుప‌ట్టి రామ‌స్వామి చిత్రంలో సూపర్‌ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్(ఇక్కడ నేనే కింగ్) అనే సినిమా చేస్తున్నారు. ఫుల్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే గతంలో సంతానం హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఏ1. తమిళంలో రిలీజైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఐదేళ్ల తర్వాత తెలుగులోను అందుబాటులోకి వచ్చేసింది.

అయితే థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఏ1 చిత్రం చూడాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. రెంట‌ల్ విధానంలో తెలుగు వర్షన్‌ రిలీజ్ చేశారు. ఈ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు రూ.79 చెల్లించాల్సిందే.

కాగా.. రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా జాన్స‌న్ కే ద‌ర్శ‌కుడిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. సంతానం తన కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరించాడు. స్టార్ హీరోల సినిమాల‌తో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ రాబట్టింది. అయితే ఇప్పటికే తమిళ వర్షన్‌ సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement