సడన్‌గా ఓటీటీ వచ్చేసిన స్టార్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Makers Latest Movie Vadakkupatti Ramasamy Streaming On this OTT | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mar 12 2024 6:00 PM | Updated on Mar 12 2024 6:03 PM

Tollywood Makers Latest Movie Vadakkupatti Ramasamy Streaming On this OTT - Sakshi

కోలీవుడ్ స్టార్ కమెడియన్‌ సంతానం, మేఘా ఆకాష్ జంట‌గా న‌టించిన వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి.  పీరియాడిక‌ల్ కామెడీ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు కార్తిక్ యోగి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని  టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1960-70 కాలంలో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. 

మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ కమెడియన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంపై బోల్తా కొట్టింది. కానీ గ‌తంలో సంతానం - కార్తిక్ యోగి కాంబినేష‌న్‌లో వచ్చిన డిక్కీలోనా అనే మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ కావడంతో వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామిపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దాదాపు రూ.12 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.5.5 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు సాధించింది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి రానుందని టాక్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement