
కోలీవుడ్‌లో హాస్యానికి మరో పేరు సంతానం. టాలీవుడ్‌లో బ్రహ్మనందంలాగే పంచ్ డైలాగులు చెప్పడంలో ఆయన స్టైలే వేరు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ఇంగ నాన్ దాన్ కింగ్ (ఇక్కడ నేనే కింగ్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని గోపురం ఫిలిమ్స్ పతాకంపై జీఎన్ అన్భచెలియన్ సమర్పణలో ఈయన కుమార్తె సుస్మిత అన్భచెల్లియన్ నిర్మిస్తున్నారు. ఇంగ నాన్ దాన్ కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రానికి ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కమలహాసన్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో అతనికి జంటగా ప్రియాలయ నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. నటుడు తంబి రామయ్య, మనోబాల, వైవిధ్య భరిత పాత్రలు పోషించిన ఇందులో మనీష్ కాంత్, వివేక్ ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది వినోదంతో కూడిన మంచి కథా చిత్రం అని దర్శకుడు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
எனது அன்புக்குரிய நண்பர், கோபுரம் பிலிம்ஸ் அன்புசெழியன் வழங்கும், சுஸ்மிதா அன்புசெழியன் தயாரிக்கும், தம்பி சந்தானம் நடிக்கும் புதிய படத்தின் பெயரையும், போஸ்டரையும் வெளியிடுவதில் மகிழ்கிறேன்.#IngaNaanThaanKingu#GNAnbuchezhian @Sushmitaanbu @gopuramfilms @Gopuram_Cinemas… pic.twitter.com/Jn2629UVP3
— Kamal Haasan (@ikamalhaasan) February 28, 2024
Comments
Please login to add a commentAdd a comment