ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నటుడు కమల్ హాసన్. తదుపరి హెచ్.వినోద్ దర్శకత్వంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఈ చిత్రం డ్రాప్ అయినట్లు అనధికార ప్రచారం హోరెత్తుతోంది. కాగా కమలహాసన్ నాయకన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత తాజాగా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
దీనిని మణిరత్నం మద్రాసు టాకీసు, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. దీనికి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే చిత్ర షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందనే ప్రచారం. కాగా తాజాగా థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ అనుకున్న దాని కంటే ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్, నిర్మాత ఆనంద్ కలిసి దిగిన పొటోను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఒక వైపు మణిరత్నం, మరో వైపు నిర్మాత చేతితో థమ్సప్ సింబల్ చూపగా కమలహాసన్ ప్రారంభిద్దామా? అన్నట్టు చూస్తున్నట్లు ఉంది. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి నెలలోనే సెట్‌పైకి వెళ్లే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇండియన్ –2 చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసి థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment