సంతానంపై పొగడ్తల వర్షం | Regina to Romance Comedian star Santhanam | Sakshi
Sakshi News home page

సంతానంపై పొగడ్తల వర్షం

Sep 10 2016 1:38 AM | Updated on Sep 4 2017 12:49 PM

సంతానంపై పొగడ్తల వర్షం

సంతానంపై పొగడ్తల వర్షం

నటుడు సంతానంను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నటి రెజీనా. సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం.

 నటుడు సంతానంను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నటి రెజీనా. సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అలాంటిది సినిమా రంగంలో ప్రతిభను గుర్తిస్తున్నారో లేదోగానీ సక్సెస్‌ను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక్కడ లక్కే ప్రధాన పాత్రను పోషిస్తోందని చెప్పక తప్పదు. ఒక భాషలో నిరాదరణకు గురైన వారు మరో భాషలో ఆదరణను పొందితే వారిని మళ్లీ పిలిచి మరీ అవకాశాలివ్వడం పరిపాటిగా మారింది.
 
 ఉదాహరణకు నటి అనుష్క, ఇలియానా, హన్సిక లాంటి వాళ్లంతా ఆదిలో కోలీవుడ్‌లో నిరాదరణకు గురైన వారే. అనుష్క రెండు అనే చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోశారు. అయినా ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌నే నమ్ముకున్నారు. అక్కడ సక్సెస్‌ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న తరువాత మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది. ఇలా పలు సంఘటనలు ఉన్నాయి. నటి రెజీనా కథా ఇంతే. మొదట్లో తమిళంలో కేడీబిల్లా కిల్లాడిరంగా తదితర కొన్ని చిత్రాల్లో నటించారు.
 
 ఆ తరువాత ఆమెను దూరంగా పెట్టేశారు. టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రెజీనా అక్కడ విజయాలను అందుకున్నారు. ఫలితం కోలీవుడ్ ఇప్పుడు వరుసగా అవకాశాలందిస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెజీనా తాను నటించనున్న హీరోలను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధర్వకు జంటగా జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
 
  సెల్వరాఘవన్ ఈ భామకు మరో అవకాశం కల్పించినట్లు తాజా సమాచారం. సంతానం హీరోగా తాను చేస్తున్న తదుపరి చిత్రంలోనూ రెజీనానే నాయకి అట. హాస్య పాత్రల్లో నటించి కథానాయకుడైన సంతానంతో నటించనున్నారేమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ చాంతాడంత కారణానే చెప్పేస్తున్నారు. అదేమిటో చూద్దాం. నాకు సంతానం హాస్యనటుడిగానూ, కథానాయకుడిగానూ నచ్చుతారు. అంతగా ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. ముఖ్యంగా హీరోగా అవతారమెత్తిన తరువాత తన బాడీలాంగ్వేజ్‌ను పక్కాగా మార్చుకున్నారు. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ ఇతర హీరోలు ఆశ్చర్యపోయేలా సూపర్‌గా నటిస్తున్నారు. అందుకే ఆయనతో నటించనుండడం సంతోషంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement