సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం | Santhanam teams up with Selvaraghavan | Sakshi
Sakshi News home page

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం

Published Sun, Jul 17 2016 3:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం

 సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం కథానాయకుడిగా నటించనున్నారన్నది తాజా న్యూస్. ఇది నిజంగా సంచలన కాంబినేషన్ చిత్రం కానుందని భావించవచ్చు. హాస్యానికి మారుపేరుగా మారిన నటుడు సంతానం. ప్రపంచంలో వినోదాన్ని కోరుకోని వారు, ఆస్వాదించని వారు ఉండరు. ఇక నవ్వు అన్నది దైవానుగ్రహం అంటారు. అలాంటి నవ్వులను పూయించి, ప్రేక్షకులను ఆహ్లాదపరచే నటులు కొంత మందే ఉంటారు. అలాంటి వారి పట్టికలో నటుడు సంతానం పేరు తప్పకుండా చోటు చేసుకుంటుంది. సంతానం రైమింగ్ సెన్స్, కౌంటర్ కామెడీ ప్రత్యేకం.
 
  తనదైన బాణీలో వినోదాన్ని అందిస్తూ హాస్యనటుడిగా ఎదిగిన సంతానం ఇటీవల కథానాయకుడిగా మారి వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల విడుదలైన దిల్లుక్కుదుడ్డు చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది. దర్శకుడు సెల్వరాఘవన్ బాణి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన చిత్రాల్లో వినోదం ఉన్నా, భావోద్రేకాలు అధికంగా ఉంటాయి.అలాగనీ హాస్యం ఆయన బాణీ కాదని చెప్పలేం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలా చాలా మంచి వినోదం ఉంటుంది.
 
 ఏదేమైనా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం హీరోగా నటించనున్నారన్న వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా సంతానం సర్వర్ సుందరం చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఏ తరహాలో ఉంటుందో ఇప్పుడే ఊహించడం కష్టం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement