Comedian Santhanam Sandalwood Entry | Brahmanandam | Kovai sarala - Sakshi
Sakshi News home page

Santhanam: తమిళ కమెడియన్‌ కన్నడ సినిమాలో బ్రహ్మానందం, కోవై సరళ..

Published Fri, Apr 29 2022 9:38 AM | Last Updated on Fri, Apr 29 2022 4:08 PM

Comedian Santhanam Sandalwood Entry - Sakshi

కోలీవుడ్‌ హాస్యనటుడు సంతానం తాజాగా శాండిల్‌వుడ్‌లో తన లక్కును పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (తమిళం, కన్నడం) ఈ నెల 26న బెంగళూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్‌ ఫిలింస్‌ పతాకంపై నవీన్‌ రాజ్‌ నిర్మిస్తున్నారు. నటి తాన్యా హోప్‌ నాయకి నటిస్తున్న ఇందులో దర్శకుడు భాగ్యరాజ్‌, బ్రహ్మానందం, సెంథిల్‌, మనోబాల, కోవై సరళ; మన్సూర్‌ అలీఖాన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement