
చక్కపోడు పోడురాజా అంటున్న సంతానం
సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ప్రధాన పాత్ర పోషింస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చిత్రాల పేర్ల విషయంలో నటుడు సంతానం చాలా జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు.హాస్యనటుడి నుంచి కథానాయకుడిగా ఎదిగిన ఈ సక్సెస్‌ఫుల్ నటుడు గత చిత్రం దిల్లుకు దుడ్డు కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పుడాయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో సర్వర్‌సుందరం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.తాజాగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థలో ఒక చిత్రం, వీటీవి.ప్రొడక్షన్‌స సంస్థలో ఒక చిత్రం అంటూ చాలా బిజీగా ఉన్నారు. కాగా వీటీవీ గణేశ్ తన వీటీవీ.ప్రొడక్షన్‌స పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి చక్కపోడు రాజాపోడు అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఇందులో సంతానం ఇంతకు ముందు పోషించని సరికొత్త పాత్రలో నటిస్తున్నారట. ధనవంతుడై తండ్రి వ్యాపార వ్యవహారాలను చూసుకునే ఎలాంటి చీకూ చింతా లేని యువకుడిగా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించారు. విశేషం ఏమిటంటే ఇందులో కథలో భాగంగా సాగే హాస్య పాత్రలో నటుడు వివేక్ నటిస్తున్నారు. నవ నటి భైరవి నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వీటీవీ.గణేశ్, పవర్‌స్టార్ శ్రీనివాసన్, రోబోశంకర్ వంటి వారు వినోదభరిత పాత్రల్లో నటిస్తుండగా సంపత్, శరత్‌లోహిత్‌దాలు ప్రతి నాయకులుగా నటిస్తున్నారు. జీఎస్.సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చాయాగ్రహణం అభినందన్, ఎడిటింగ్‌ను ఆంథోని, ఫైట్స్‌ను కణల్‌కన్నన్ కంపోజ్ చేస్తున్నారు.