Santhanam 'Kick' Movie Release Date And Details - Sakshi
Sakshi News home page

Santhanam Kick Movie: 'కిక్' ఇచ్చేందుకు స్టార్ కమెడియన్ రెడీ

Aug 7 2023 9:35 AM | Updated on Aug 7 2023 9:56 AM

Santhanam Kick Movie Release Date  And Details - Sakshi

కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన నటుడు సంతానం. ఇతడి కంటే ముందు వడివేలు, వివేక్‌ లాంటి కమెడియన్స్ హీరోలు అయ్యారు. కానీ సక్సెస్‌ కాలేకపోయారు. సంతానం మాత్రం హీరోగా హిట్స్ కొడుతున్నాడు. ఆ మధ్య కొన్ని చిత్రాలు నిరాశపరిచినా.. ఈ మధ్యే 'డీడీ రిటర్న్స్‌' హిట్ కావడంతో సంతానంలో జోష్ వచ్చింది. 

(ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)

ఈ క్రమంలోనే తాజాగా 'కిక్‌' మూవీతో అలరించడానికి సిద్ధమైపోయాడు. ఫార్చూన్‌ పతాకంపై సంతానం హీరోగా నటించిన చిత్రం కిక్‌. కన్నడంలో లవ్‌ గురు, గాని బనానా, విజిల్‌, ఆరెంజ్‌ మూవీస్ తీసిన ప్రశాంత్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌ హీరోయిన్. ఇందులో తంబిరామయ్య, బ్రహ్మానందం, సెంథిల్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌, మనోబాల, వైజీ మహేంద్రన్‌, షకీలా, స్కూల్‌ సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 

ఈ చిత్ర ట్రైలర్‌ ఈ జనవరిలోనే విడుదలైంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల రిలీజ్ కొంత ఆలస్యం అయిందని నిర్మాతలు పేర్కొన్నారు. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కిక్‌ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. దీంతో చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement