
ఇండియన్ టీమ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన స్పిన్ బౌలింగ్‌తో మ్యాజిక్ చేసేవారు. ఈ మధ్యే నటుడిగా మారి యాక్టింగ్ మొదలుపెట్టారు. తమిళ నటుడు సంతానం నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లీడ్ యాక్టర్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ‘ఫ్రెండ్‌షిప్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక క్రికెటర్ లీడ్ యాక్టర్‌గా నటించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం పేర్కొంది. జేపీఆర్, శ్యామ్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment