harbajan sing
-
PCA కు హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
నా జీతం... రైతు బిడ్డల చదువు కోసం: హర్భజన్
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు కోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హర్భజన్ ‘ట్విటర్’ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ ఇటీవల పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. -
అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీఈ) తమ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు ఇచ్చింది. పీటీఈ నుంచి అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైదొగలడమే కాక ఒప్పంద నిబంధనలకు విరుధంగా టీ20 ప్రపంచకప్ ప్రసార నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయాడంటూ పీటీవీ నోటీస్‌లో ఆరోపించింది. అంతేకాదు మూడు నెలల వ్రాతపూర్వక నోటీసు లేదా చెల్లింపుల ద్వారా అతని ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరుపక్షాలకు ఉంటుంది. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కానీ అక్తర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంతో తమ సంస్థకు భారీ నష్టాలు చవిచూసినట్లు నోటిస్లో పేర్కొంది. పైగా అక్తర్ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక భారతీయ టీవీ షోలో కనిపించడం కూడా తమ సంస్థకి కోలుకోలేని నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ మేరకు పీటీవీ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 మొత్తంతో పాటు నష్టపరిహారంగా 10 కోట్ల రూపాయలు చెల్లించాలని పీటీవీ నోటిస్లో అక్తర్‌ను కోరింది. ఈ మేరకు అక్తర్ చెల్లించనట్లయితే పీటీసీ చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. (చదవండి: అక్కడ అలా కొట్టుకోవడమే ఆచారమటా!!) -
హీరోబజన్ సింగ్
ఇండియన్ టీమ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన స్పిన్ బౌలింగ్‌తో మ్యాజిక్ చేసేవారు. ఈ మధ్యే నటుడిగా మారి యాక్టింగ్ మొదలుపెట్టారు. తమిళ నటుడు సంతానం నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లీడ్ యాక్టర్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ‘ఫ్రెండ్షిప్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక క్రికెటర్ లీడ్ యాక్టర్‌గా నటించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం పేర్కొంది. జేపీఆర్, శ్యామ్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
హిట్టు కప్పు పట్టు
ప్రేక్షకులు అందించే హిట్ కప్పు కోసం కొందరు బాలీవుడ్ నటీనటులు క్రీడాకారులుగా రంగంలోకి దిగారు. ఒకరు పంచ్‌లు ఇస్తుంటే, మరొకరు సిక్సర్లు కొడుతున్నారు. ఇంకొకరు ఫైరింగ్, కొందరిది రన్నింగ్... ఇలా బాక్సాఫీస్ విన్నర్ కావడానికి ఎవరి ఆట వారు ఆడుతున్నారు. బాలీవుడ్ టోర్నీలో ప్రేక్షకులకు నచ్చినట్లు ఆడి హిట్ కప్పును పట్టుకోవడానికి ఎవరికి వారు చిత్రీకరణ పనులు మొదలుపెట్టారు. వారి ఆటల వివరాలు తెలుసుకుందాం. పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇస్తున్నారు అమితాబ్ బచ్చన్. రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్‌గా తాను నటిస్తున్న చిత్రం కోసమే ఇలా చేస్తున్నారు. మరాఠీ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే ఈ చిత్రానికి దర్శకుడు. స్లమ్ స్కోరర్ అనే ఓ ఎన్జీఓ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు ఫుట్‌బాల్ శిక్షణ ఇప్పించిన నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ బార్సే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్ సమాచారం. మరో స్టార్ అజయ్ దేవగన్ కూడా ‘మైదాన్’ చిత్రం కోసం ఫుట్‌బాల్ కోచ్‌గా మారారు. అమితాబ్ బచ్చన్ పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇస్తున్నారు అమితాబ్ బచ్చన్. రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్‌గా తాను నటిస్తున్న చిత్రం కోసమే ఇలా చేస్తున్నారు. మరాఠీ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే ఈ చిత్రానికి దర్శకుడు. స్లమ్ స్కోరర్ అనే ఓ ఎన్జీఓ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు ఫుట్‌బాల్ శిక్షణ ఇప్పించిన నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ బార్సే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్ సమాచారం. మరో స్టార్ అజయ్ దేవగన్ కూడా ‘మైదాన్’ చిత్రం కోసం ఫుట్‌బాల్ కోచ్‌గా మారారు. అజయ్ దేవగన్ అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. 1950–1963 సమయంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్ కమ్ మేనేజర్‌గా పని చేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్యాట్‌తో బరిలోకి దిగారు రణ్వీర్ సింగ్. 1983లో ఇడియన్ క్రికెట్ టీమ్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న నాటి మధుర జ్ఞాపకాల ఆధారంగా హిందీలో కబీర్‌ఖాన్ దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ‘83’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. అప్పటి ఇండియన్ టీమ్ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ కనిపిస్తారు. రణ్‌వీర్‌సింగ్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించనున్నారు తమిళ నటుడు జీవా. ఈ చిత్రంలోనే కోచ్ మాన్సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠీ కనిపిస్తారు. ఇండియన్ క్రికెట్ జట్టులో సభ్యుడు కావాలనుకునే ఓ 36 ఏళ్ల క్రీడాకారుడి పాత్రలో నటించబోతున్నారు షాహిద్ కపూర్. తెలుగు హిట్ ‘జెర్సీ’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో దాదాపు ఆరేళ్ల క్రితం విడుదలైన స్పోర్ట్స్ మూవీ ‘భాగ్ మిల్కా భాగ్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఫర్హాన్ అక్తర్, షాహిద్ కపూర్ మళ్లీ వీరిద్దరూ మరో స్పోర్ట్స్ మూవీ ‘తుఫాన్’ను తెరకెక్కిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో ఫర్హాన్ కనిపిస్తారు. 2002లో లార్డ్స్ మైదానంలో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ౖఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విక్టరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా సౌరభ్ గంగూలీ లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి చేసిన విజయ నినాదాన్ని క్రీడాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ హ్యాపీ మూమెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘దూస్రా’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అభినయ్ డియోల్ దర్శకత్వం వహిస్తారని బీటౌన్ సమాచారం. 2008 బీజింగ్ ఒలింపిక్స్ పది మీటర్ల ఎయిర్‌రైఫిల్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రా బయోపిక్ వెండితెరపైకి వస్తోంది. అభినవ్ బింద్రాగా నటించడానికి బాలీవుడ్ నటుడు హర్షవర్థన్ కపూర్ కమిట్ అయ్యారు. కన్నన్ అయ్యర్ దర్శకుడు. ఇవి కాకుండా మరికొన్ని స్పోర్ట్స్ మూవీలకు చర్చలు జరుగుతున్నాయి. సూపర్ స్కోర్ బాలీవుడ్లో స్పోర్ట్స్ మూవీస్‌కి బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన స్థానం ఉంది. స్పోర్ట్స్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి స్కోర్‌ని సాధిస్తున్నాయి. అందుకే బాలీవుడ్ దర్శక–నిర్మాతలు స్పోర్ట్స్ చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు. గత చిత్రాల బాక్సాఫీస్ గణాంకాలను ఓసారి పరిశీలించినప్పుడు 2007లో వచ్చిన షారుక్ ‘చక్‌దే ఇండియా’ని 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు 127 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందీ చిత్రం. ప్రియాంకా చోప్రాతో దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మేరీ కోమ్’ చిత్రం వందకోట్లు వసూలు చేసిన మూవీ జాబితాలో చేరింది. దాదాపు రెండు వేల కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ (2016) బడ్జెట్ 70 కోట్లు. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ (201 3) చిత్రం 164కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంకా ‘ఎమ్ఎస్ ధోని: ది ఆన్‌టోల్డ్ స్టోరీ’ (2016), ‘గోల్డ్’ (2018), ‘సూర్మ’(2018) చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద హిట్ సాధించిన చిత్రాలే. మరికొన్ని స్పోర్ట్స్ చిత్రాలు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టాయి. వెండితెర రేస్‌లో.. బాక్సాఫీస్ రేస్ కోసం నటీనటులు క్రీడాకారులుగా మారుతుంటే కొందరు నిజమైన క్రీడాకారులు యాక్టర్స్‌గా వెండితెరపై కనిపించబోతున్నారు. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో వెండితెర యాక్టింగ్ ఓనమాలు మొదలుపెట్టారు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమిళ హీరో సంతానం నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమాలో నటించనున్నారు. ఇక హన్సిక నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు శ్రీశాంత్. కంగన రనౌత్ ఒకే ఓవర్లో్లఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ తండ్రి, ఇండియన్ మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ త్వరలో సౌత్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘దర్బార్’ సినిమాలో యోగ్రాజ్ ఓ కీలక పాత్ర చేశారని టాక్. ముంబై నేపథ్యంలో సాగే ‘దర్బార్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. గతంలో క్రికెటర్లు కపిల్ దేవ్, సడగోపన్ రమేష్ వంటి వారు తమ నటనా నైపుణ్యాన్ని ప్రేక్షకులు మెచ్చుకోవాలని వెండితెరపై ప్రయత్నించిన వారే. మరి.. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది క్రీడాకారులు వెండితెర రేస్‌కి వస్తారో చూడాలి. హర్భజన్ సింగ్ హీరోలే కాదు.. క్రీడా చిత్రాల్లో సత్తా చాటడానికి హీరోయిన్లు ఆట మొదలుపెట్టారు. హిట్ కప్ కోసం బరిలో నిలిచారు. ఏడాదికో ఆట ఆడాలని ప్లాన్ చేసుకున్నట్లున్నారు తాప్సీ. 2018లో వచ్చిన హిందీ చిత్రం ‘సూర్మ’లో హాకీ క్రీడాకారిణిగా నటించిన తాప్సీ ఈ ఏడాది ‘సాంద్∙ఖీ ఆంఖ్’ సినిమా కోసం షూటర్‌గా మారిపోయారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓల్డెస్ట్ షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాషీ తోమర్ జీవితాల ఆధారంగా తుషార్ హీరానందనీ దర్శకత్వంలో ‘సాంద్ కీ ఆంఖ్’ తెరకెక్కింది. చంద్రో, ప్రకాషీల పాత్రల్లో భూమీ ఫడ్నేకర్, తాప్సీ నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. వచ్చే ఏడాది కూడా తాప్సీ ఓ క్రీడా చిత్రంలో కనిపించనున్నారు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రష్మీ: ద రాకెట్’ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీ పాత్రలో నటిస్తున్నారామె. ఇక అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంగా’ సినిమా కోసం కబడ్డీ ప్లేయర్‌గా కూత పెట్టారు కంగనా రనౌత్. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువతి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? అనే అంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పరిణీతి చోప్రా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ‘సైనా’ అనే బయోపిక్ తెరకెక్కుతోంది. అమోల్ గుప్తా దర్శకత్వంలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఇంకా క్రికెటర్ మిథాలీ రాజ్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుల బయోపిక్స్ తెరకెక్కనున్నట్లు ప్రకటనలు వచ్చాయి. వీరి బయోపిక్స్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై త్వరలో స్పష్టత రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘కాలా’ టీజర్లో ధోని..
సాక్షి, చైన్నై: సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాలా’ సినిమా ఫీవర్ దక్షిణాదిలో సినీప్రియులకు ఎంతలా సోకిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను విడుదలైన 24 గంటల్లోనే కోటి ఇరవై లక్షల మంది వీక్షించారు. దీన్ని బట్టి తెలుస్తుంది కాలా ప్రభంజనం. అయితే తాజాగా క్రికెటర్లూ రజనీ ‘కాలా’ టీజర్‌కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ట్రైలర్‌ను స్పూఫ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్కే) రజనీపై తమ అభిమానాన్ని చాటుకుంది. సీఎస్కే టీజర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ ‘కాలా’ అదేం పేర్రా..! అంటాడు. వెంటనే ఓపెనర్ విజయ్ కాలా అంటే కరికాలుడు..చావుకే దడ పుట్టించేవాడు అనే డైలాగ్ విసురుతాడు. వెస్టిండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో కాలా అంటే కాపాడేవాడు.. నమ్మిన వాళ్లను గొడవ పడైనా కాపాడతాడు అంటూ విజయ్‌ని అనుసరిస్తాడు. టీజర్ చివర్లో.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ‘ఏం రా సెట్టింగా’ అంటూ రజనీ స్టైల్లో చెప్తాడు. చివర్లో మళ్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడు చూళ్లేదు కదూ... ఇప్పుడు చూపిస్తా అని విలన్లను రఫ్పాడిస్తాడు. ఇలా కాలా టీజర్లో సీఎస్కే క్రికెటర్లు హంగామా చేశారు. ఒక పక్క ‘కాలా’ సినిమా టీజర్‌ను చూసి రజనీ అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా.. మరోపక్క సీఎస్కే జట్టు ఈ సినిమా టీజర్‌ని తన వెర్షన్లో చూపించి అటు సినిమా ఇటు క్రికెట్ అభిమానులని ఆకట్టుకుంటోంది. -
బజ్జీకి కౌంటర్ ఇచ్చిన ఆసీస్ స్పిన్నర్
భారత్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటి ఇస్తామని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ చెప్పాడు. భారత ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవల ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు లియోన్ మంగళవారం బదులిచ్చాడు. ప్రస్తుత ఆసీస్ జట్టు అత్యంత బలహీనమైన జట్టు అని, భారత్ సిరీస్‌ను 4-0తో వైట్ వాష్ చేస్తుందని బజ్జీ తెలిపిన విషయం తెలిసిందే. ఎవరి నమ్మకాలు వారివని, వారి మాటలు మా జట్టు పట్టించుకోదని లియోన్ అన్నాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్, యువ క్రికెటర్లతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉందని తెలిపాడు. భారత్‌కు గట్టి పోటి ఇచ్చి మంచి ఫలితాలు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనికి మా జట్టు గట్టిగా సాధన చేస్తుందని, గెలుస్తామనే సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నాడు. భారత్ నెం.1 స్థానంలో ఉండగా ఆసీస్ వెనుకే ఉందన్నాడు. మేము ఫాస్ట్ బౌలర్లతో తొలి రోజే 5 వికెట్లు పడగొడ్తమనుకోవడం లేదని, ఇది మాకు పెద్ద సవాలని చెప్పాడు. ఇక భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌ను లియోన్ పొగడ్తలతో ముంచెత్తాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ స్పిన్నరని, అతని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ఇప్పటి వరకు ఏమి చేశానో చెప్పడం లేదని, గత నాలుగు ఏళ్లతో పోలిస్తే ఉపఖండ పరిస్థితులకు అనుగుణంగా చాలా మారనని లియోన్ తెలిపాడు. జట్టులో అందరూ యువ స్పిన్నర్లే కావడంతో జట్టు స్పిన్ దాడికి నాయకుడిగా ఉంటున్నానని, ఇది చాలా సంతోషమైన విషయమని, ఒత్తిడిగా భావించడం లేదని తెలిపాడు. మంచిగా బౌలింగ్ చేసి బ్యాటింగ్ జట్టును ఒత్తిడికి గురి చేయడమే తన కర్తవ్యమని లియోన్ అభిప్రాయపడ్డాడు.