ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీఈ) తమ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు ఇచ్చింది. పీటీఈ నుంచి అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైదొగలడమే కాక ఒప్పంద నిబంధనలకు విరుధంగా టీ20 ప్రపంచకప్ ప్రసార నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయాడంటూ పీటీవీ నోటీస్‌లో ఆరోపించింది. అంతేకాదు మూడు నెలల వ్రాతపూర్వక నోటీసు లేదా చెల్లింపుల ద్వారా అతని ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరుపక్షాలకు ఉంటుంది.
(చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!)
కానీ అక్తర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంతో తమ సంస్థకు భారీ నష్టాలు చవిచూసినట్లు నోటిస్‌లో పేర్కొంది. పైగా అక్తర్ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక భారతీయ టీవీ షోలో కనిపించడం కూడా తమ సంస్థకి కోలుకోలేని నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ మేరకు పీటీవీ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 మొత్తంతో పాటు నష్టపరిహారంగా 10 కోట్ల రూపాయలు చెల్లించాలని పీటీవీ నోటిస్‌లో అక్తర్‌ను కోరింది. ఈ మేరకు అక్తర్ చెల్లించనట్లయితే పీటీసీ చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.
(చదవండి: అక్కడ అలా కొట్టుకోవడమే ఆచారమటా!!)
Comments
Please login to add a commentAdd a comment