భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి తన మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తన కొడుకు బంగారు పతకాన్ని తృటిలో చేజార్చుకునప్పటకి ఆమె మాత్రం ఏ మాత్రం దిగులు చెందలేదు.
పసిడి పతకం సొంతం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అథ్లెట్‌పై సరోజ్ దేవి ప్రశంసల వర్షం కురిపించారు. అర్షద్‌ను కూడా తన కొడుకులాంటివాడని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు.
ఈ క్రమంలో నీరజ్ తల్లి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ మనసును హత్తుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె తల్లి ప్రేమని అక్తర్ కొనియాడాడు. " ఎవరో స్వర్ణం పతకం సాధిస్తే.. అతడు కూడా మా కుమారుడే అని ఆమె చెప్పారు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యం. నిజంగా ఇదొక అద్భుతమని" ఎక్స్‌లో అక్తర్ రాసుకొచ్చాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.
జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచిన నీరజ్.. వరుసగా రెండో ఒలిపింక్ పతకాన్ని ముద్దాడాడు. అయితే అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో ఏకంగా జావెలన్ రికార్డు స్ధాయిలో 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment