షావుకారు జానకి
నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ చేసిన తారల్లో అలనాటి తార షావుకారు జానకి ఒకరు. కథానాయికగా ఒకప్పుడు వెండితెరను ఏలిన జానకి ఇప్పుడు బామ్మ పాత్రలు చేస్తున్నారు. ఆమె సినీ మైలురాయి 400వ చిత్రానికి చేరుకుంది. తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బామ్మ కస్తూరి పాత్రలో నటిస్తున్నారు జానకి. ఇది ఆమెకు 400వ చిత్రం కావడం విశేషం. ‘‘జానకిగారి ల్యాండ్ మార్క్ మూవీ మా చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఆమె ఎంతటి ప్రతిభాశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా చిత్రకథ, పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment